30/05/2026
కంప్యూటర్ ఆపరేటర్లు, కోర్టు కానిస్టేబుళ్ల పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం
తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్., గారు జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్లు మరియు కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలో నిర్వహించాల్సిన డేటా ఎంట్రీ, కేసుల రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్‌ఎస్ (CCTNS) నమోదు, డిజిటల్ డాక్యుమెంటేషన్, కోర్టు కేసుల పురోగతి, సమన్లు మరియు వారెంట్ల అమలు, పెండింగ్ కోర్టు వ్యవహారాలపై సమీక్షించారు.
కోర్టు కానిస్టేబుళ్లు కేసుల విచారణలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొంటూ, సమన్లు మరియు వారెంట్ల అమలు, సాక్షుల హాజరు, కేసు డాక్యుమెంట్ల సమర్పణ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులు మరియు కోర్టు సిబ్బందితో సమన్వయం పెంపొందించడం ద్వారా కేసుల కన్విక్షన్ రేటును గణనీయంగా మెరుగుపరచవచ్చని సూచించారు.
అలాగే కంప్యూటర్ ఆపరేటర్లు పోలీస్ స్టేషన్లలో డేటా నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టి, సీసీటీఎన్‌ఎస్ మరియు ఇతర సాంకేతిక వ్యవస్థల వినియోగంలో ఎటువంటి లోపాలు లేకుండా పనిచేయాలని ఆదేశించారు.
డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పోలీసింగ్‌లో పారదర్శకత, మరియు పనితీరు మరింత మెరుగుపడుతుందని ఎస్పీ గారు తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్ అమలు, సమర్థవంతమైన కోర్టు నిర్వహణ, అధిక కన్విక్షన్ రేటు సాధన లక్ష్యాల కోసం పనిచేయలని ఆదేశించారు.