Collector EastGodavari

Collector EastGodavari Government & Public Service

జిల్లాలో 2027 జనగణన (సెన్సస్) నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 30 వేల కుటుంబాలు స్వీయ నమోదు (Self Enumeration) కింద...
30/04/2026

జిల్లాలో 2027 జనగణన (సెన్సస్) నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 30 వేల కుటుంబాలు స్వీయ నమోదు (Self Enumeration) కింద నమోదు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.

మే 1 నుండి 31 వరకు ఇంటింటి సర్వే నిర్వహించేందుకు పూర్తి స్థాయి యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సర్వే సమయంలో అధికారులు, సిబ్బంది ఇంటింటికి వచ్చినప్పుడు ప్రజలు సరైన, సమగ్ర సమాచారాన్ని అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణ దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లపై జిల్లా స్థాయిలో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చ...
29/04/2026

గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణ దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లపై జిల్లా స్థాయిలో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.

బుధవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్లో వైద్యారోగ్యం, రవాణా, ఆర్టీసీ శాఖలపై సమీక్షించారు

బుధవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన విద్యా బోధన ,నేషనల్ ఎడ్యుకేషన్ ప...
29/04/2026

బుధవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన విద్యా బోధన ,నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలు ,పురోగతిపై కలెక్టర్ కీర్తి చేకూరి బొమ్మూరు కలెక్టరేట్ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర ఆర్థిక వ్యవహారాల జాయింట్స్ సెక్రటరీ మరియు జిల్లాకు నియమితమైన పిఎం శ్రీ పాఠశాలల పరిశీలకులు అమిత్ సింఘాల్ కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు.

తూర్పుగోదావరి జిల్లాలో చేనేత రంగాభివృద్ధి ఎగుమతుల పెంపు కోసం సమగ్ర కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ కీర్త...
29/04/2026

తూర్పుగోదావరి జిల్లాలో చేనేత రంగాభివృద్ధి ఎగుమతుల పెంపు కోసం సమగ్ర కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు.

బుధవారం బొమ్మూరు కలెక్టరేట్లో జిల్లా ఎగుమతుల కార్యచరణ ప్రణాళిక పై అధికారులు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమై కలెక్టర్ సమీక్షించారు.

రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు మరమ్మత్తు పనులను జూన్ నెలాఖరు నాటిక...
29/04/2026

రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు మరమ్మత్తు పనులను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్లో ఏపీ ఎం ఎస్ ఐ డి సి ఇంజనీర్లు జిజిహెచ్ అధికారులు మరియు సంబంధిత నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరమ్మత్తు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

గోదావరి పుష్కరాలు – 2027 నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి సమగ్ర ఏర్పాట్లు చ...
28/04/2026

గోదావరి పుష్కరాలు – 2027 నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.

మంగళవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో పుష్కరాల నిర్వహణ, మౌలిక సదుపాయాలపై జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

మంగళవారం కొవ్వూరు పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌తో పాటు దేవరపల్లి మండలం గౌరీపట్నం ప్రాంతంలో జిల్లా కలెక్టర్ కీర...
28/04/2026

మంగళవారం కొవ్వూరు పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌తో పాటు దేవరపల్లి మండలం గౌరీపట్నం ప్రాంతంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి , జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, సహాయ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మలతో కలిసి తనిఖీలు నిర్వహించారు.

క్షేత్ర స్థాయి పర్యటన నేపథ్యంలో సరఫరా పరిస్థితులు, నిల్వలు, డిమాండ్‌కు అనుగుణంగా జరుగుతున్న పంపిణీపై సమగ్రంగా సమీక్షించారు. గత రోజులలో డిమాండ్ పెరగడంతో కొన్ని చోట్ల డీజిల్ డ్రై అవుట్ పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ప్రస్తుతం సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటోందని కలెక్టర్ తెలిపారు.

27/04/2026

⛽ పెట్రోల్, డీజిల్‌పై పానిక్ బయ్యింగ్ చేయవద్దు

📍 తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి

✅ జిల్లాలోని 177 పెట్రోల్ బంకుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వలు:
🔹 1219 కిలో లీటర్ల పెట్రోల్
🔹 1032 కిలో లీటర్ల డీజిల్

✅ కేవలం 17 బంకుల్లో మాత్రమే కొన్ని గంటల పాటు తాత్కాలిక డ్రై ఔట్ ఏర్పడింది.

📈 పానిక్ కొనుగోళ్ల కారణంగా రోజువారీ వినియోగంతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు అధిక కొనుగోళ్లు నమోదయ్యాయి.

📈 పానిక్ కొనుగోళ్లతో పాటు, కొంతమంది ఇండస్ట్రియల్ యూజర్లు రిటైల్ బంకుల్లో కొనుగోలు చేయడం వల్ల కూడా డిమాండ్ తాత్కాలికంగా పెరిగింది.

🔹 సాధారణంగా రోజుకు:
⛽ 272 కిలో లీటర్ల పెట్రోల్
🚛 322 కిలో లీటర్ల డీజిల్ వినియోగం ఉంటుంది.

🔹 గత ఐదు రోజుల్లో కొనుగోలు:
⛽ 477 కిలో లీటర్ల పెట్రోల్
🚛 577 కిలో లీటర్ల డీజిల్

🌾 వ్యవసాయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేశాం.

🏛️ జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సరఫరా అంతరాయం లేకుండా అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది.

🚫 జిల్లాలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు.
🙏 ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేయకుండా సహకరించాలి.

📞 సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించండి: 8074661259
📞 టోల్ ఫ్రీ నెంబర్: 1967

— జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం పరిధిలోని ఎస్పీ సెంట్రల్ జైలు పెట్రోల్ బంక్‌ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో కలిసి సోమవారం సాయం...
27/04/2026

రాజమహేంద్రవరం పరిధిలోని ఎస్పీ సెంట్రల్ జైలు పెట్రోల్ బంక్‌ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో కలిసి సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జిల్లాలో ఇంధన సరఫరా వ్యవస్థను సమీక్షిస్తూ, వినియోగదారులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించామన్నారు.

సీఎంవోకు అర్జీ చేసిన నిడదవోలు మండలం ఉండ్రాజవరం ప్రాంతానికి చెందిన లబ్ధిదారురాలు ఈడ రూబేను గారికి కొత్త రేషన్ కార్డు మంజూ...
27/04/2026

సీఎంవోకు అర్జీ చేసిన నిడదవోలు మండలం ఉండ్రాజవరం ప్రాంతానికి చెందిన లబ్ధిదారురాలు ఈడ రూబేను గారికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయబడింది.

అర్జీని పరిశీలించి అర్హత నిర్ధారించిన అనంతరం వెంటనే రేషన్ కార్డు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సోమవారం ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య పరిష్కారంపై అభిప్రాయం తెలుసుకున్నారు.

సమస్య త్వరితగతిన పరిష్కారం కావడంతో లబ్ధిదారురాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

జనగణన 2027 లో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ గణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ...
26/04/2026

జనగణన 2027 లో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ గణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు.

స్వీయ నమోదు పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం వై జంక్షన్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు "సెన్సెస్ 5 కే రన్" ను జెండా ఊపి ప్రారంభించారు.

Address

NAC Building Bommuru OPP Horlicks Factory
Rajahmundry
533124

Website

Alerts

Be the first to know and let us send you an email when Collector EastGodavari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Collector EastGodavari:

Share