Telugu Desam Party: Pulivendla

Telugu Desam Party: Pulivendla Official Page of TDP Pulivendla

నంద్యాలలో విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్త జంబులయ్య. వైసీపీ పెద్దలే చేయించి తిరిగి డ్రామాలు ఆడిస్తున్నారు. వచ...
01/06/2026

నంద్యాలలో విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్త జంబులయ్య. వైసీపీ పెద్దలే చేయించి తిరిగి డ్రామాలు ఆడిస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసమే ఈ నాటకాలు. ఇలాంటివి జగన్ కు కొత్త కాదుగా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్లి చూడండి.


01/06/2026

గొడ్డలి పార్టీ కుట్రలకు ఆ దేవుడిని కూడా వదలడం లేదు..

కడపకు చెందిన ఓ పాస్టర్‌ను పంపి హత్యాయత్నం డ్రామాలు ఆడారు. మరో చోట పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి మోటార్‌సైకిల్ నడుపుతూ ప్రమాదంలో చనిపోతే, దానిని కూడా మాపై నెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. సీసీ కెమెరాల సాయంతో ఈ కుట్రను బట్టబయలు చేయగలిగాం.

పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర సాక్షి మీడియా మద్యం బాటిళ్లు తీసుకెళ్లి వేసి అపవిత్రం చేసేందుకు ప్రయత్నించింది. కుట్రలతో హిందూ దేవాలయాలపై దాడులు చేయడం, వాటిని అపవిత్రం చేయడం సరికాదని హెచ్చరిస్తున్నాను.




01/06/2026

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకొండప్ప కాలనీలో కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి స్వయంగా పెన్షన్ అందజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొనడం జరిగింది...

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పులివెందులలో సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులను అందజేసిన మారెడ్డి లతా రెడ్డిపులివెందుల టీడీప...
01/06/2026

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పులివెందులలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన మారెడ్డి లతా రెడ్డి

పులివెందుల టీడీపీ కార్యాలయంలో పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి లబ్ధిదారులకు రూ. 23,33,409 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక గొప్ప భరోసానిస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆమె ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.



ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ముసల్ రెడ్డి గారి పల్లెలో బోర్ వెల్‌ను ప్రారంభించిన బీటెక్ రవివేంపల్లె మండలంలోని ముసల్ ర...
01/06/2026

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ముసల్ రెడ్డి గారి పల్లెలో బోర్ వెల్‌ను ప్రారంభించిన బీటెక్ రవి

వేంపల్లె మండలంలోని ముసల్ రెడ్డి గారి పల్లె గ్రామంలో నూతనంగా వేసిన బోర్ వెల్ ను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ముసల్ రెడ్డి గారి పల్లె ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించే దిశగా ఈ బోర్ వెల్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది గృహ అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడమే తమ ప్రాథమిక లక్ష్యమని, అభివృద్ధి పనుల్లో ఎటువంటి రాజీ పడకుండా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు..

ప్రజల సంక్షేమమే మా ప్రాధాన్యత.. వర్షంలోనూ కొనసాగిన పెన్షన్ పంపిణీ - బీటెక్ రవివర్షాన్ని సైతం లెక్కచేయకుండా,  ఈరోజు పులివ...
01/06/2026

ప్రజల సంక్షేమమే మా ప్రాధాన్యత.. వర్షంలోనూ కొనసాగిన పెన్షన్ పంపిణీ - బీటెక్ రవి

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, ఈరోజు పులివెందుల మున్సిపాలిటీ, పెద్దకొండప్ప కాలనీ పరిధిలోని భేతెల్ చర్చి లైన్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను.

కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలాఖరు వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ఒకటో తారీఖునే ఉదయాన్నే పెన్షన్ పంపిణీని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల కోసం పడ్డ ఇబ్బందులను అధిగమించి, నేడు పేద ప్రజలకు సకాలంలో సాయం అందిస్తున్నాం.

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏడాదికి 33 వేల కోట్ల రూపాయలను కేవలం పెన్షన్ల కోసమే ఖర్చు చేస్తున్న గొప్ప మనసు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు.

01/06/2026

దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్లు
ప్రకటించిన మొదటి పార్టీ తెలుగుదేశం

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామంటూ టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహానాడులో పెట్టిన తీర్మానం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఎన్టీఆర్, డ్వాక్రా మహిళలను మహాశక్తిగా తీర్చిదిద్దిన చంద్రబాబు మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు.
మహిళలకు 33% రిజర్వేషన్లు ప్రకటించిన నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని దేశంలోనే మొదటి పార్టీగా నిలిపారు.




#నాతెలుగుదేశంనాబాధ్యత

దశాబ్దాల కలకు సాకారం.. నేటి నుంచి విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం..రాష్ట్ర ప్రజల చిరకాల కల విశాఖ కేంద్రంగా దక్...
01/06/2026

దశాబ్దాల కలకు సాకారం.. నేటి నుంచి విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం..

రాష్ట్ర ప్రజల చిరకాల కల విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారం అయ్యింది. 2019 ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రకటన చేసినా, గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. భూములు అప్పగించాలని కేంద్రం ఎన్ని సార్లు కోరినా పట్టించుకోలేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఒక్కో విభజన హామీ పరిష్కారం అవుతుంది. రాజధాని చట్టబద్ధత, పోలవరం నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజ్, రైల్వే జోన్ సహా అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.


• నేటి నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం. ఫలించిన సీఎం చంద్రబాబు పట్టుదల • సింగపూర్ బ...
01/06/2026

• నేటి నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం. ఫలించిన సీఎం చంద్రబాబు పట్టుదల

• సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ లో చిరాగ్ తో కలిసి స్వర్ణ పథకం సాధించిన కోనసీమ కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

• నంద్యాల జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసం వైసీపీ కార్యకర్త పనే.సీసీ కెమెరాల ఫుటేజీ తో బట్టబయలైన సైకో బ్యాచ్ నాటకం. వైసీపీ తీరుపై ధ్వజమెత్తిన ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• నేడు కాకినాడ జిల్లా చామవరం లో "ప్రజావేదిక" లో పాల్గొని ,ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

• పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రేపటి నుంచి ఆరు రోజులపాటు రష్యాలో పర్యటించనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/oc1l


Address

Pulivendla

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Pulivendla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Pulivendla:

Share