06/11/2025
🌸 నా పేరు : M. మోహన్
🚔 పిడుగురాళ్ళ రూరల్ PS
🙏 తల్లిదండ్రులందరికీ చేతులు జోడించి చేసే వినమ్ర విన్నపం...
🌿 క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల ప్రవర్తన, హెయిర్ స్టైల్, దుస్తులు చూసి బాధ కలుగుతోంది... 😔
ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు లేదు.
ఉపాధ్యాయులు చూస్తూ ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు.
👩👩👧👦 తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ధ, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.
క్రమశిక్షణ మాటలతో రాదు — కొద్దిపాటి భయం, గౌరవం ఉండాలి అప్పుడే వస్తుంది. ⚖️
📚 ఈరోజు పిల్లలకు బడిలో భయం లేదు, ఇంట్లో భయం లేదు.
అందుకే సమాజం భయభ్రాంతులకు గురవుతోంది.
వాళ్లే రౌడీలుగా తిరుగుతున్నారు, తరువాత పోలీసుల చేతుల్లో పడుతున్నారు. 🚓
💭 గురువుని గౌరవించని సమాజం వినాశనానికి గురవుతుంది
ఇది నిజం.
గురువంటే భయం లేదు, గౌరవం లేదు — చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది..?
❌ “కొట్టొద్దు! తిట్టొద్దు!”
❌ “బడి రానివాడ్ని అడగొద్దు!”
ఇలా చెప్పే తల్లిదండ్రుల వలన పిల్లల్లో బాధ్యతలే ఉండటం లేదు.
🎯 5వ తరగతి నుండే కటింగులు, చినిగిన జీన్స్, కామెంట్లు, అహంకారం — ఇవే వారి ఫ్యాషన్!
😞 కొంతమంది తల్లిదండ్రుల మాటలు –
“మావాడు చదవకున్నా ఏమి కాదు, కొట్టవద్దు సార్!”
ఇదే పెద్ద దురదృష్టం.
📖 పెన్ను ఉంటే పుస్తకం ఉండదు, పుస్తకం ఉంటే పెన్ను ఉండదు.
భయం లేకుండా చదువు రాదు.
భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట! 🐔
అలానే ఉంది నేటి పిల్లల ప్రవర్తన.
👨🏫 టీచర్ అంటే గౌరవం, భయం ఉండేట్లు పిల్లలకు తల్లిదండ్రులే నేర్పాలి.
90% గురువులు పిల్లల మేలుకే శ్రమిస్తున్నారు. 🙏
💬 ఇప్పటి తరం పిల్లల పరిస్థితి... 👇
👉 కారు, బండి శుభ్రం చేయరు.
👉 ఇంటి పనులకు సహాయం చేయరు.
👉 రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా లేస్తారు.
👉 ఎదురు తిరిగి సమాధానం చెబుతారు.
👉 డబ్బు ఇచ్చినా దాచుకోకుండా ఫ్రెండ్స్‌తో పార్టీలు చేస్తారు.
👉 మైనర్ పిల్లలకి బైకులు ఇస్తున్నారు – ప్రమాదాలు, కేసులు పెరుగుతున్నాయి. 🚫
👉 ఆడపిల్లలు అయితే వంట, పనులు తెలియవు.
📱 ఫోన్, సోషల్ మీడియా, అతి గారాబం వల్ల 15 ఏళ్లకే ప్రేమలు, బెట్టింగులు, చెడు అలవాట్లు పెరుగుతున్నాయి. 😢
🌾 కష్టం తెలియని పిల్లలకు జీవితం విలువ తెలియదు.
ప్రేమతో, గారాబంతో పెంచడం కాదు — బాధ్యత, కష్టం, గౌరవం నేర్పండి. 💪
💠 తల్లిదండ్రులు గుర్తుంచుకోండి 💠
పిల్లల్లో చెడు 60% బయట ప్రభావం వలన వస్తుంది,
కానీ 40% మాత్రం తల్లిదండ్రుల నిర్లక్ష్యం వలనే! ⚠️
🪔 పిల్లలకు చిన్న వయసులోనే నేర్పాల్సిన విలువలు 👇
❤️ బాధ్యత
💬 మర్యాద
🙏 గౌరవం
💪 కష్టం
🧠 ఓర్పు
💖 దాతృత్వం
🇮🇳 దేశభక్తి
🕉️ దైవభక్తి
🤝 సహకారం
🌼 సమాజం మారాలంటే, మనమే మారాలి.
మనం మారితే పిల్లలు మారతారు.
పిల్లలు మారితే సమాజం మారుతుంది. 🌎
🙏 ఈ సందేశం చదివి అందరూ మారిపోతారు అని నేను అనుకోవడం లేదు…
కానీ కనీసం ఒక్కరు అయినా ఆలోచిస్తే చాలు 💫
ఇట్లు,
✨ మీ M. మోహన్
🚓 పిడుగురాళ్ళ రూరల్ PS
🙏🙏🙏
#సామాజికవృత్తం