14/05/2026
పాతపట్నంలో టీడీపీకి భారీ బూస్ట్
* మాకివలస పంచాయతీ నుంచి 70 కుటుంబాల ఘన చేరిక
* బైదాలపురం పంచాయతీలో మరో 40 కుటుంబాలు టీడీపీలోకి
* ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నాయకత్వానికి పెరుగుతున్న ప్రజాభిమాన వెల్లువ
* పాతపట్నం ఫోకస్డ్ బూత్ అబ్జర్వర్ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు సారథ్యంలో
పాతపట్నం, మే 14:
పాతపట్నం నియోజకవర్గ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి తన సత్తా చాటింది. ప్రజల విశ్వాసం, కార్యకర్తల అంకితభావం, నాయకత్వంపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా మాకివలస పంచాయతీ నుండి ఏకంగా 70 కుటుంబాలు, అలాగే బైదాలపురం పంచాయతీ నుండి మరో 40 కుటుంబాలు ఘనంగా తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ భారీ చేరిక కార్యక్రమం పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో, పాతపట్నం ఫోకస్డ్ బూత్ అబ్జర్వర్ పుచ్చ ఈశ్వరరావు సారథ్యంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
గ్రామాల్లో టీడీపీ జెండాలు రెపరెపలాడుతుండగా, పార్టీ నినాదాలతో మాకివలస, బైదాలపురం గ్రామాలు మారుమోగాయి. మహిళలు, యువత, రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలుగుదేశం పార్టీపై తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. పార్టీలో చేరిన కుటుంబాలకు నాయకులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ,
“ప్రజల ఆశయాలే మా పార్టీ బలం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, యువతకు అవకాశాలు, రైతులకు భరోసా కల్పించడమే టీడీపీ లక్ష్యం. ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడం మా పాలనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం” అని పేర్కొన్నారు.
అలాగే ఆయన మాట్లాడుతూ, పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన రాజకీయ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఫోకస్డ్ బూత్ అబ్జర్వర్ పుచ్చ ఈశ్వరరావు మాట్లాడుతూ,
“మాకివలస, బైదాలపురంలో జరిగిన ఈ భారీ చేరికలు రానున్న రోజుల్లో టీడీపీ విజయానికి సంకేతం. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు… ప్రజలు నమ్మకమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు… ఆ నమ్మకమే టీడీపీ వైపు ప్రజలను తీసుకొస్తోంది” అని అన్నారు.
గ్రామస్తులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రభావంతోనే ప్రజలు టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మాకివలస, బైదాలపురం పంచాయతీల్లో జరిగిన ఈ భారీ చేరికలు పాతపట్నం రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
#పాతపట్నం