మన ఊటాడ

మన ఊటాడ A small village in west godavari dt, Andhra pradesh, India

30/03/2026
29/09/2025

🕉️🙏🔱 జై దుర్గ భావాని 🔱🙏🕉️

22/04/2022

"1995" సంవత్సరంలో చిత్రించిన మన ఊటాడ గ్రామం
ఈ వీడియో దూరదర్శన్లో ప్రసారం అయిన పునరపిజననం అనే దారవహికలోని ముఖ పరిచయ దృశ్య చిత్రం...
ఇలాంటి అరుదైన చిత్ర దృశ్యాన్ని సేకరించిన నా సోదరుడు హరిహరన్ కు ధన్యవాదములు🙏🙏🙏
!.,✍️

25/12/2021

మన ఊటాడ గ్రామ చరిత్ర
అసలు ఉట్టి కాడ ప్రదేశం ఊటాడ అగ్రహారం తరవాత ఊటాడ అని ఎలా మారింది
ఈ మధ్య మా వంశం వృక్షం గురించి తెలుసుకోవాలని ఆసక్తితో మా పెద్దవాళ్ళని అడిగినపు నాకు మన ఊటాడ గ్రామ చరిత్ర గురించి నా పూరువీకులకి ఉన్న సంబంధం గురించి తేలింది అది మీతో పంచుకందామనే ఈ వ్యాసం రాస్తున్నాను.
ఊటాడ గురించి చెప్పే ముందుగ నేను నా వంశ వృక్షం గురించి ఊటాడ కి ఉన్న సంబంధం గురించి తెలుపుతాను

నా వంశ వృక్షం

నా పేరు సుధీర్ తమ్మినీడి (1)
తండ్రి పుల్లారావు తమ్మినీడి గారు(2)
తాత సత్యనారాయణ తమ్మినీడి గారు (3)
ముత్తాత సుబ్బన్న తమ్మినీడి గారు (4)
సుబ్బన్న గారి తండ్రి శేషయ్య తమ్మినీడి గారు(5)
శేషయ్య గారి తండ్రి బుల్లి వెంకన్న తమ్మినీడి గారు (6)
బుల్లివెంకన్న తండ్రి సుబ్బయ్య తమ్మినీడి గారు (7)

సుబ్బయ్య గారి తండ్రి పేరు తెలియదు ###XX (8)

###XX గారి తండ్రి పేరు తెలియదు YYYYYY (9)

YYYYY గారి తండ్రి వీరయ్య తమ్మినీడి గారు (10)

ఈ వీరయ్య గారు మన ఊటాడ గ్రామ ప్రధమ పౌరుడు మరియు గ్రామ వ్యవస్థాపకుడు

ఈ వీరయ్య గారు నా వంశానికి 10వ తరం వారు, ఇయనకు ఊటాడ & యలమంచిలి లో 70-80 ఎకరాల పొలం ఉండేది
ఇయన ముందు యలమంచిలి వాస్తవ్యులు.

వీరయ్య గారు ఒక రోజు వీధిలో ఉదయాన్నే పొలం వెళ్తుండగా ఎవరో కళ్ళాపి చలుతుండగ ఆ కళ్ళాపి పేడ నీళ్ళు ఆయన మీద పడ్డాయని వీదిలో వున్న వాళ్ళు ఆ సన్నివేశాన్ని చూసి నవ్వరట, ఆ సంఘటనను అవమానాన్ని సహించలేని వీరయ్య గారు కోపంగా ఇంకా యలమంచిలి నివాసం ఉండనని శపథం చేసి తన పొలానికి వచ్చి ఒక మామిడి చెట్టుకి తన చేతిలో ఉన్న ఉట్టిని కట్టీ అదే చెట్టుకింద పాకవేసి తన నివాసాన్ని యలమించిలి నుండి తన పొలానికి మార్చుకున్నారు
ఆయన్ని ఉట్టి కాడ వీరయ్య అని పిచేవరు తను నివాసం ఉన్న పొలాన్ని ఉట్టి కాడ పొలం అనే వాళ్ళు

కల క్రమేణా "ఉట్టి కాడ" కాస్త "ఊటాడ" గా రూపాంతరం చెందింది...

ముందు 70 ఎకరాలు ఉన్న కాస్త కాల క్రమేణా తరిగి పోయింది, మొగల్తురు పరిపాలక రాజులు మన గ్రామాన్ని 101 ఎకరాలు విభజించి ఒక బ్రాహ్మణుడికి ఇనం క్రింద దాన ఇచ్చారు అప్పుడు ఊటాడ కాస్త ఊటాడ అగ్రహరంగా మారింది బ్రిటీషు పరిపాలనలో వచ్చాక భూమి శిస్తు కట్టలేదని కారణంగా ఆ బ్రాహ్మునులకి ఈనంగా ఉన్న 101 ఎకరాల భమిని యలమంచిలి నుండి వచ్చిన జమిందారు తమ్మినీడి దత్తుడిగారి పూర్వీకులకు బ్రిటీషువారు కొంత భూమిని స్వాధీనం పరచగా మిగిలిన భూములు తమ్మినీడి వంశంలో వాళ్ళు గ్రామ ప్రజలు ఆక్రమించుకున్నారు అప్పుడు బ్రాహ్మణ పంతులు అచ్చం చెరువు దగ్గర గుడి కడుతుంటే అడుక్కునారు అచ్చం చెరువు దగ్గర కట్లవలసిన గుడిని శివాలయం దగ్గర నిర్మించారు
తన ఆస్తులు లకున్నరని తనిఖీ ఊరి పెద్దలు అడ్డు పడుతున్నారని అందుకు కోపగించిన బ్రాహ్మణుడు ఊటాడ గ్రామం తరగదు పెరగదు అని శపించి వెళ్ళిపోయాడు
బ్రాహ్మణుడు వెళ్లిపోయిన తర్వాత ఊటాడ అగ్రహారం కాస్త ఊటాడ అనే పేరు మారింది...

https://chat.whatsapp.com/L4TrtQDDxTKIgiL0Fi54fG

!.,✍️

Address

Palakollu
534260

Telephone

9441886457

Website

Alerts

Be the first to know and let us send you an email when మన ఊటాడ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share