Matam SanthaKumari

Matam SanthaKumari Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Matam SanthaKumari, Political organisation, Hukumapeta, Paderu.

02/08/2026
16/07/2026
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండిఅరకు నియోజకవర్గ కేడర్ సమావేశంలో 'అల్లూరి' జిల్లా అధ్యక్షులు మఠం శాంత కుమారి గారు.......
16/07/2026

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి

అరకు నియోజకవర్గ కేడర్ సమావేశంలో 'అల్లూరి' జిల్లా అధ్యక్షులు మఠం శాంత కుమారి గారు.........................................
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని వాటిలో శతశాతం విజయం సాధించేలా క్యాడర్ సన్నద్ధం కావాలని భారతీయ జనతా పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు *శ్రీమతి మఠం శాంతకుమారి గారు* పేర్కొన్నారు. అరకు నియోజకవర్గ కేడర్ సమావేశం గురువారం డుంబ్రిగూడ మండలంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేడర్ కు స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎన్నికలు నిర్వహణపై ప్రకటన విడుదల చేశారన్నారు. తొలుత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, తర్వాత జిల్లా - మండల పరిషత్తు, గ్రామపంచాయతీ ఎన్నికలు ఉండబోతున్నాయని ఆయన తెలిపారని *శాంత కుమారి గారు* పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోటా విజయం సాధించేలా సన్నాహాలు చేసుకోవాలన్నారు. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడమూ ...చేసిన ప్రతిచోట కచ్చితంగా విజయం సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ గిరిజన ప్రజలకు చేస్తున్న మేలును వివరించాలని తెలిపారు. ఇదివరకు ఏ ప్రభుత్వాలు చేయనంత అభివృద్ధిని సంక్షేమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం గిరిజనులకు అందిస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. గ్రామ గ్రామాన తాగునీటి సదుపాయానికి జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికి కులాయిలు వేస్తున్నారని, ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మిస్తున్నారని, అవసరం ఉన్న ప్రతి చోట అంగన్వాడీలు నిర్మిస్తున్నారని ప్రతి ఆదివాసికి ఉచితంగా పక్కా గృహాల నిర్మిస్తున్నారని... ఇంత చేస్తున్న ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనం వైఫల్యం చెందకూడదు అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవి ఓట్ల రూపంలో మలుచుకోగలిగితే మనం విజయం సాధించినట్లు అవుతుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మెడికల్ కళాశాలను జగన్ తీసుకొచ్చాడు అని చెబుతున్నారని వాస్తవానికి ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసింది కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటు పై వైఎస్ఆర్సిపి దుష్ప్రచారం చేస్తుందని ఇది కరెక్ట్ కాదు ప్రతి జిల్లాకు బిజెపి ఇచ్చింది అందులో భాగంగా పాడేరు కూడా ఎన్ డి ఏ ప్రభుత్వమే ఇచ్చింది అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం ద్వారా వారికి జరిగిన మేలుని వివరించి వారితో సత్సంబంధాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడే మనం నిజమైన నాయకులుగా ఎదుగుతామని ఓట్ బ్యాంకు కూడా పెరుగుతుందని చెప్పారు.

భారతదేశ తొలి విద్యాశాఖ మాత్యులు, స్వతంత్ర సమరయోధులు, భారతరత్న విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకొచ్చిన మహనీయులు మౌలాన...
22/02/2026

భారతదేశ తొలి విద్యాశాఖ మాత్యులు, స్వతంత్ర సమరయోధులు, భారతరత్న విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకొచ్చిన మహనీయులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళుల

పండిట్ దీన్ దయాళ్ స్ఫూర్తితో ముందుకు నడుద్దాం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యశాలలో అల్లూరి జిల్లా అధ్యక్షులు శ్రీమతి మఠం...
20/02/2026

పండిట్ దీన్ దయాళ్ స్ఫూర్తితో ముందుకు నడుద్దాం

భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యశాలలో అల్లూరి జిల్లా అధ్యక్షులు శ్రీమతి మఠం శాంతకుమారి గారు............................................
పండిట్ దీన్ దయాళ్ స్ఫూర్తితో ముందుకు నడుద్దామని భారతీయ జనతా పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు *శ్రీమతి మఠం శాంత కుమారి గారు* ఆ పార్టీ శ్రేణులకు సూచించారు. పాడేరులోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యశాల శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ గా మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ గారి వ్యవహరించారు. చక్రవర్తి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మఠం శాంత కుమారి గారు మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంత కర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలు సాధన దిశగా మనమంతా అడుగులు వేయాలన్నారు. అట్టడుగునున్న పేదవారికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ఆయన ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పారు. దీన్ దయాళ్ గారి ఆశయ సాధనలో ప్రతి బిజెపి కార్యకర్త ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ దయాళ్ ఆశయ సాధన దిశగా అడుగులు వేస్తున్నారని వికసిత భారత్ దానిలో లక్ష్యమేనన్నారు. ఫసల్ బీమా, గరీబ్ కళ్యాణ్, యోజన స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాలన్నీ దీన్ దయాళ్ గారి అంత్యోదయ సిద్ధాంతంలో భాగమేనని చెప్పారు. మార్చి ఏడో తేదీ నుంచి మండలాల్లో మండల కార్యశాల నిర్వహించబోతున్నట్లు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనదేనన్నారు. ఒకపక్క దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలు ముందుకు తీసుకు వెళుతూనే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని చెప్పారు.

రోడ్డు ప్రమాద బాధితుల రక్షణ కవచం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెచ్చిన పీఎం రాహత్ పథకం
20/02/2026

రోడ్డు ప్రమాద బాధితుల రక్షణ కవచం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెచ్చిన పీఎం రాహత్ పథకం

Address

Hukumapeta
Paderu

Website

Alerts

Be the first to know and let us send you an email when Matam SanthaKumari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share