Janardhana Rao Damacharla

Janardhana Rao Damacharla Indian Politician|TDP State Vice President |MLA,Ongole

ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చిన్న కుమార్తె దామచర్ల తనూజ లక్ష్మి గారు అమెరికా లోని ప్రముఖ విశ్వవిద...
31/05/2026

ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చిన్న కుమార్తె దామచర్ల తనూజ లక్ష్మి గారు అమెరికా లోని ప్రముఖ విశ్వవిద్యాలయం లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇంటీరియర్ డిజైన్‌లో మ్యాగ్నా కమ్ లాడ్ గౌరవాలతో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (BFA) డిగ్రీని పూర్తి చేసుకున్న సందర్భంగా 30.05.2026 న గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ లో పట్టా తీసుకున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, దామచర్ల నాగ సత్యలత గారు మరియు దామచర్ల అనిషా లక్ష్మి గారు.

తేదీ:28-05-2026,తెలుగుదేశంపార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైబ్రిడ్ మహానాడు రెండో రోజు వేడుకలు ఒంగోలు నియోజ...
28/05/2026

తేదీ:28-05-2026,
తెలుగుదేశంపార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైబ్రిడ్ మహానాడు రెండో రోజు వేడుకలు ఒంగోలు నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఒంగోలు నగరంలోని పరిధిలోని క్లస్టర్-3, కొత్తపట్నం మండలం లోని క్లస్టర్ -11, మరియు క్లస్టర్-12 డిజిటల్ సభా వేదికలకు స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ సరికొత్త డిజిటల్ పసుపు పండుగలో భాగస్వాములయ్యారు. యుగ పురుషుడు, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక *శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతిని* పురస్కరించుకొని, ఆయా క్లస్టర్ల వేదికల వద్ద అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా ఎన్టీఆర్ జయంతి సంబరాల సంతోషాన్ని పంచుకుంటూ క్లస్టర్-3 వేదిక వద్ద విచ్చేసిన కూటమి శ్రేణులకు, కార్యకర్తలకు కేకు కట్ చేసి పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ గారు చిరస్మరణీయంగా నిలిచిపోయారని, ఆయన ఆశయాల సాధన కోసమే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తోందని కొనియాడారు.అనంతరం పార్టీ కోసం దశాబ్దాలుగా జెండా మోస్తూ, అంకితభావంతో పనిచేస్తున్న పలువురు సీనియర్ మరియు ఉత్తమ కార్యకర్తలను ఎమ్మెల్యే గారు, పరిశీలకులు శివప్రసాద్ గారు ప్రత్యేకంగా శాలువాలు కప్పి, ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, వారి త్యాగాల వల్లే కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య, స్థానిక క్లస్టర్ ఇన్-ఛార్జ్ లు, తెలుగుదేశంపార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

28/05/2026

ఒంగోలు నియోజకవర్గంలో మహానాడు-2026 మరియు ఎన్టీఆర్ గారి జయంతి సందర్బంగా ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు గారి ఆధ్వర్యంలో ఒంగోలు నగరం పసుపు మయం...

మాజీ ముఖ్యమంత్రి వర్యులు ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ ఎన్.టి.రామారావు గారి 103వ జయంతిని పురస్క...
28/05/2026

మాజీ ముఖ్యమంత్రి వర్యులు ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ ఎన్.టి.రామారావు గారి 103వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి మరియు పార్టీ కార్యాలయం నందు వారి విగ్రహాలకు జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు శాసన సభ్యులు, శ్రీ బి.ఎన్.విజయకుమార్ గారు, పార్టీ పరిశీలుకులు DR శివ ప్రసాద్ గారు, Dr.సీతారామయ్య గారు, ముప్పవరపు సుచిత్ర గారు మరియు పార్టీ నాయకులతో కలసి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు..

28/05/2026
ఒంగోలు నియోజకవర్గంలో కోలాహలంగా తెలుగుదేశం పార్టీ మహానాడు-2026* ఒంగోలు నియోజకవర్గంలోని 12 క్లస్టర్ల పరిధిలో వర్చువల్ మహాన...
27/05/2026

ఒంగోలు నియోజకవర్గంలో కోలాహలంగా తెలుగుదేశం పార్టీ మహానాడు-2026

* ఒంగోలు నియోజకవర్గంలోని 12 క్లస్టర్ల పరిధిలో వర్చువల్ మహానాడు పండగ.

* ప్రతి క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ల ద్వారా మహానాడును వీక్షిస్తున్న టీడీపీ శ్రేణులు...

* మహానాడు కార్యక్రమాలకు హాజరై క్లస్టర్-08 బండ్లమిట్ట నందు తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడంతో పాటు ఎన్టీఅర్ కు నివాళులర్పించిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు.

* ఒంగోలు నగరం మరియు ఒంగోలు మండల పరిధిలోని 10 క్లస్టర్ల పరిధిలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు.

* ఈ సందర్భంగా శాసనసభ్యులు జనార్దన్ గారు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పక్షపాతి ఎన్టీఆర్ అని కొనియాడారు. సంక్షేమ పథకాల ఆవిర్భావానికి ఎన్టీఆర్ ఆద్యుడని, పేద ప్రజల హృదయాలను గెలుచుకున్న మహానేత అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని తెలిపారు. టిడిపికి అసలైన బలం కార్యకర్తలేనని, తరాలు మారినా పసుపు జెండా మారదని జనార్దన్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల రుణం ఎన్నటికీ తీర్చలేమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తల వెంటే నిలబడే నాయకుడు చంద్రబాబు నాయుడేనని అన్నారు.

* ఏపీ అభివృద్ధికి దిక్సూచి చంద్రబాబు నాయుడేనని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. నవ్యాంధ్ర సృష్టికర్త చంద్రబాబేనని, కార్యకర్తల త్యాగాల వల్లే పార్టీ, ప్రభుత్వాల్లో పదవులు దక్కుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా కుటుంబ సభ్యుల్లా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఒంగోలు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.

* ⁠ఈ కార్యక్రమం లో పార్టీ పరిశీలుకులు శివ ప్రసాద్ గారు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, నగర అధ్యక్షులు బండారు మదన్ గారు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ /గ్రామ కమిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర /జిల్లా /నియోజకవర్గ /నగర అనుబంధ కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, ఐటీడీపి సభ్యులు మరియు ప్రజలకు పెద్ద ఏత్తున పాల్గొన్నడం జరిగినది.

27/05/2026

Address

Ongole

Telephone

+919948199999

Website

Alerts

Be the first to know and let us send you an email when Janardhana Rao Damacharla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Janardhana Rao Damacharla:

Share