20/08/2026
టౌన్–I పోలీస్ స్టేషన్, నిజామాబాద్
Mobile phone (52) Recovered through CEIR Portal ద్వారా – యజమానులకు అప్పగింత
నిజామాబాద్ టౌన్–I పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి, మొత్తం 52 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది.
రికవరీ చేసిన 52 మొబైల్ ఫోన్లను వాటి అసలైన యజమానులను గుర్తించి, ధృవీకరణ అనంతరం సంబంధిత యజమానులకు అప్పగించడం జరిగింది.
ప్రస్తుతం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న సందర్భాల్లో, ఫోన్ ద్వారా ఫోన్‌పే, గూగుల్ పే తదితర డిజిటల్ చెల్లింపు ఖాతాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత బ్యాంకు ఖాతాలు, ఫోన్‌పే, గూగుల్ పే తదితర డిజిటల్ చెల్లింపు ఖాతాలను తాత్కాలికంగా బ్లాక్ చేయించుకోవాలి.
అలాగే, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌కు సంబంధించిన వివరాలతో CEIR (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. దీనితో పాటు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయాలి.
ప్రజలు తమ మొబైల్ ఫోన్లు మరియు డిజిటల్ ఖాతాల భద్రత కోసం బలమైన పాస్‌వర్డ్‌లను (Strong Passwords) ఉపయోగించాలని, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోకూడదని పోలీసులు సూచించారు.
మొబైల్ ఫోన్ల రికవరీలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు. ప్రజల భద్రతకు, వారి విలువైన వస్తువుల రికవరీకి పోలీసులు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు.
బి. రఘుపతి
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
టౌన్–I పోలీస్ స్టేషన్, నిజామాబాద్