03/08/2026
తేదీ : 03/08/2026
వేల్పూర్ మండల కేంద్రం
*MRPS, MSP అనుబంధ సంఘాల బాల్కొండ నియోజకవర్గ సదస్సు*
*బాల్కొండ నియోజకవర్గంలో గ్రామ కమిటీలు, మండల కమిటీల నిర్మాణం జరగాలి.*
*పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని బలపరచుకుందాం.*
*40 రోజుల కార్యాచరణను విజయవంతం చెయ్యండి.*
మాసాయిపేట యాదగిరి మాదిగ
MRPS నిజామాబాద్ జిల్లా ఇంచార్జి
ఈరోజు MRPS, MSP మరియు అనుబంధ సంఘాల బాల్కొండ నియోజకవర్గ సదస్సును జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశానికి బాల్కొండ నియోజకవర్గ నలుమూలల నుంచి MRPS, MSP కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగింది.
ఈ సమావేశానికి MSP నియోజకవర్గ ఇంచార్జి మంద ప్రభాకర్ మాదిగ గారు సభాధ్యకత వహించడం జరిగింది.
ఈ సమావేశానికి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మాసాయిపేట యాదగిరి మాదిగ గారు ముఖ్య అతిథిగా పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.
ఈ సమావేశానికి విశిష్ట అతిథిగా మాదిగ మహిళా సమాఖ్య (MMS) జిల్లా నాయకురాలు గుంటూ పద్మ మాదిగ గారు పాల్గొనడం జరిగింది.
మాసాయిపేట యాదగిరి మాదిగ గారు మాట్లాడుతూ " 20 మందితో మొదలైన MRPS ఉద్యమం, ఈ 30 ఏండ్లలో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రులను కదిలించింది. రాష్ట్ర రాజధానులు అట్టుడికించింది. ఈ దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారిని మెప్పించింది. ఢిల్లీని గడగడలాడించింది. అలాగే MRPS మాదిగలకే నాయకత్వం వహించడం కాకుండా ఈ సమాజంలో పేద వారికి కూడా నాయకత్వం వహించి ఎన్నో పోరాటాలు చేసి సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదల కోసం ఫలితాలు సాధించింది. ఆనాడు అంబేద్కర్ గారు ఎలాగైతే పేద అస్పృశ్యుల కోసం పోరాటాలు చేసి విజయం సాధించాడో ఇప్పుడు అలాగే ఈనాడు మంద కృష్ణ మాదిగ గారు కూడా అలానే పేద వర్గాల ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడు. అందుకే మంద కృష్ణ మాదిగ గారిని సమాజం అంత మంద కృష్ణ మాదిగ గారిని అభినవ అంబేద్కర్ గారు అంటున్నారు. ఒకనాడు మాదిగ పల్లెలోని MRPS మీటింగులు పెట్టిన స్థాయి నుంచి గ్రామ నడిబొడ్డులో, హైదరాబాద్ నడిబొడ్డులో, ఢిల్లీ నడిబొడ్డులో సభలు సమావేశాలు పెట్టే స్థాయికి మంద కృష్ణ మాదిగ గారు తెచ్చారని తెలియచేయడం జరిగింది. అలాంటి MRPS ను గ్రామగ్రామాన నూతన నిర్మాణాన్ని, మండల కమిటీల నిర్మాణాన్ని చేసుకోవాల్సిన బాధ్యత మాదిగ సమాజం మీద ఉందని గుర్తు చెయ్యడం జరిగింది. మాదిగలు MRPS నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని, MRPS అనుబంధ సంఘాల నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది. మాదిగలు అందరూ రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ సమావేశంలో MRPS బాల్కొండ నియోజవర్గ ఇంచార్జి కనక ప్రమోద్ మాదిగ, వేల్పూర్ మండల అధ్యక్షులు శివరాజ్ మాది