30/07/2026
హైదరాబాద్ భవిష్యత్తును, మన చెరువులను కాపాడుతున్న 'హైడ్రా' (HYDRAA) ఒక ఏజెన్సీ మాత్రమే కాదు.. అదొక నగర పరిరక్షణ ఉద్యమం! ✊🔥
సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరం ‘ఫోర్త్ సిటీ’ దిశగా శరవేగంగా అడుగులు వేస్తుంటే, గత పదేళ్లలో వేలాది ఎకరాల పబ్లిక్ ప్రాపర్టీని, చెరువులను కబ్జా చేసిన భూమాఫియా ఈ రోజు వణుకుతోంది.
హైడ్రా కమిషనర్, బీసీ బిడ్డ, నిజాయితీగల ఐపీఎస్ అధికారి ఎ.వి. రంగనాథ్ గారిపై ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రపూరిత దాడులు కేవలం తమ భూ ఆక్రమణల చిట్టా బయటపడుతుందనే భయంతోనే! దొంగ పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు.
గడిచిన కొద్దికాలంలోనే ఏకంగా ₹1.5 లక్షల కోట్ల విలువైన 3,325 ఎకరాల ప్రభుత్వ భూములను, చెరువులను, పార్కులను కాపాడి కబ్జాదారుల గుండెల్లో నిద్రపోయిన ఘనత హైడ్రాది. పేదల జోలికి వెళ్లకుండా.. కేవలం భూబకాసరుల అక్రమ నిర్మాణాల పైనే చెక్ పెడుతూ, వరదలు లేని గ్లోబల్ సిటీగా మన నగరాన్ని తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. "హైడ్రా ఆగేది లేదు.. అక్రమార్కులను వదిలేది లేదు!" 💥
కబ్జాదారుల దుష్ప్రచారాన్ని నమ్మకండి.. మన నగర భవిష్యత్తు కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, హైడ్రాకు అండగా నిలవండి!
జై తెలంగాణ! జై జై హైడ్రా! ✊🚩