Dr Bhimrao Dalit Movement

Dr Bhimrao Dalit Movement Deva Prasanna was an Indian politician from the state of Andhra Pradesh. He was the Christian Minority Parliament President of Nellore,of theTDP Party.

An Ambedkarist, Deva Prasanna was known as a prominent Dalit social and political activist in the state

12/08/2024

డాక్టర్ భీం రావ్ దళిత మహాసభ నూతన కమిటీ ఏర్పాటు. ఓబులాపురం దేవానంద్

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో భాగంగా వివిధ దశలో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ భీం రావ్ దళిత మహాసభ నాయకులు ఓబులాపురం దేవానంద్ ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పట్ల అవగాహన కలిగి అండగా ఉండాలన్న ఉద్దేశంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా "డాక్టర్ భీం రావ్ దళిత మహాసభ"నూతన కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కన్వీనర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వాట్సాప్ నెంబర్ 9150404034 సంప్రదించి మీ యొక్క బయోడేటా అప్లికేషన్ పంపవలసిందిగా తెలిపారు.

12/08/2024

||వర్గీకరణ సమస్య – ఓ పరిశీలన||

సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ సమస్యపై మరోసారి వాదోపవాదాలకు తెరతీసింది. వర్గీకరణ రాజ్యాంగ బద్దమేనని,రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం అడ్డుకాదని కోర్టు మెజారిటీ తీర్పునిచ్చింది.

ఏడుగురి ధర్మాసనంలో ఒక్కరు మాత్రమే ఈ అభిప్రాయంతో విబేధించారు.ఈ సందర్భంలోనే ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తులు ‘క్రీమీలేయర్‌’ను కూడా ప్రవేశ పెట్టడం మంచిదని విడివిడి తీర్పుల్లో పేర్కొన్నారు.

ప్రధాన న్యాయ మూర్తి, మరొకరు మాత్రం ఈ విషయంపై మౌనం వహించారు. మొత్తమ్మీద సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు వ్యతిరేకంగా లేవనెత్తబడిన రాజ్యాంగ పరమైన అభ్యంతరాలపై స్పష్టమైన తీర్పునిచ్చింది. వర్గీకరణ చెయ్యాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలివేసింది.

కోర్టుకు వచ్చిన వ్యాజ్యం రాష్ట్రాలకు సంబంధించిన విషయం అయినప్పటికీ తీర్పు కేంద్రానికి కూడా వర్తిస్తుంది. గతంలో కొన్ని రాష్ట్రాలలో వర్గీకరణ సమస్య ముందుకొచ్చినప్పుడు సీపీఐ(ఎం) వర్గీకరణను సమర్థించింది.

ఎస్సీల్లోనే వివిధ ఉపకులాల మధ్య విద్యా, ఉద్యోగాలలో కొట్టొచ్చి నట్లు వ్యత్యాసాలు వున్నాయని అధ్యయన కమిటీలు స్పష్టమైన వివరాలు/ డేటాపై ఆధారపడి సమర్పించిన నివేదికల ఆధారంగా నిర్ధారించినప్పుడు సీపీఐ(ఎం) వర్గీకరణకు సానుకూలత ప్రకటించింది.

➡️తీర్పు నేపథ్యం-కొన్ని అంశాలు

పంజాబ్‌,ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు తమ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గతంలో ఎస్సీ తరగతిలో వర్గీకరణ చెయ్యడానికి నిర్ణయాలు తీసుకున్నాయి. ఒక్క తమిళనాడులో తప్ప, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కోర్టు తీర్పుల మూలంగా ఈ నిర్ణయాలు అమలులోకి రాలేదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వర్గీకరణపై తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వచ్చిన వాజ్యంపై వర్గీకరణ రాజ్యాంగబద్దం కాదని సుప్రీంకోర్టు 2005లో తీర్పునిచ్చింది.ఈ తీర్పును సవాలు చేస్తూ వచ్చిన అనేక పిటిషన్లన్నింటిని కలిపి విచారించిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం 2024 ఆగష్టు 1వ తేదీన తన తీర్పును వెలువరించింది. తీర్పులో వివాదాస్పదంగా మారిన కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం.

రాజ్యాంగంలో 341 అధికరణం రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేయడానికి అనుమతించ దన్న వాదనను కోర్టు తిరస్కరించింది. ఎస్సీ,ఎస్టీ జాబితాలపై నిర్ణయించే హక్కు పార్లమెంటుదైనందున వర్గీకరణ అంశం కూడా పార్లమెంటు పరిధిలోనిదని, ఇందులో రాష్ట్రాల జోక్యానికి తావులేదన్న వాదనను తిరస్కరిస్తూ, తమ పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చునని స్పష్టం చేసింది.

వర్గీకరణ చేసేహక్కు పార్లమెంటుదా, రాష్ట్రాలదా అనే అంశంకన్నా,అసలు వర్గీకరణ చేయడం అవసరమా లేదా అన్నది ముఖ్యం. ఈ అంశంపై స్పష్టత వస్తే ఎక్కడి నుండి ప్రారంభించడం బాగుంటుందన్న అంశం కేవలం సాంకేతిక,ఆచరణాత్మక సమస్య అవుతుంది.

వర్గీకరణ చట్టబద్దమా కాదా అన్న అంశాన్నే కాకుండా సమానత్వం సాధించడం అన్న కోణంలో కూడా వర్గీకరణ సమంజసమేనని కోర్టు అభిప్రాయపడింది. ఎస్సీ తరగతి అస్పృశ్యత ‘అంటరానితనం’ గురయ్యే కులాల బృందంగా ఏర్పడినందున అది ఒక ‘ఏకఖండ’ (హోమోజీనియస్‌) బృందం,అందు వలన దాన్ని విడదీయడం సమంజసం కాదన్న వాదనను కోర్టు తిరస్కరించింది.

అస్పృస్యతకు ఎస్సీ తరగతిలో ఉన్న ఉపకులాన్ని గురవుతున్నా వాటి మధ్య అన్ని విషయాలలో ఏకరూపత లేదు. సామాజిక, ఆర్థిక,విద్యా విషయాలలో వ్యత్యాసం వుందని, హెెటి రోజీనియస్‌ బృందమని కోర్టు భావించింది. ఈ వ్యత్యాసాలను అధిగమించడానికి వర్గీకరణ సమంజసమేనని కోర్టు చెప్పింది.

➡️విమర్శలు-ఆక్షేపణలు

ఈ అంశంపై కోర్టు సరైన సమాచారం/ డేటా లేకుండానే నిర్ధారణ చేసిందని ఆక్షేపణలు వచ్చాయి. ఈ విమర్శలో పసలేదు.ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నియమించిన అధ్యయన కమిషన్ల రిపోర్టులు అంతర్గతంగా ఎస్సీ ఉపకులాల మధ్య వున్న వ్యత్యాసాలను బహిర్గతం చేశాయి.

2011 జనరల్‌ సెన్సెస్‌లో ఎస్సీ ఉపకులాలపై ఉన్న సమాచారాన్ని పరిశీలించినా వ్యత్యాసాలపై నిర్ద్వంద్వమైన సమాచారం దొరుకుతుంది. కొంతమంది వ్యత్యాసాలున్నాయని అంగీకరిస్తూనే, ఎస్సీల్లో వెనకబడిన ఉపకులాలు, ముందంజలో ఉన్న కులాలతో పోటీపడగల స్థాయికి రావడానికి అవసర మైన ప్రత్యేక సదుపాయాలను అదనంగా కేంద్రం, రాష్ట్రాలు కల్పిస్తే సరిపోతుందని వర్గీకరణ అవసరం లేదని అంటున్నారు.

ఈ సూచనలో అభ్యంతరం పెట్టాల్సిందేమీ లేదు కానీ ఇది వర్గీకరణకు ప్రత్యామ్నాయం కాదు. దానికి జత చేయాల్సింది మాత్రమే. వర్గీకరణ అనేది రిజర్వేషన్‌ హక్కులో భాగంగా వుంటుంది. వర్గీకరణ వలన లాభం ఏ కొద్దిపాటిదైనా, తక్షణం అందుబాటులోకి వస్తుంది.సదుపాయాలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వుంటాయి.

‘వర్గీకరణ’ రిజర్వేషన్ల వ్యవస్థను ఉనికిలోకి తెచ్చిన మౌలిక భావనకు భంగం కలిగిస్తుందని గతం నుండి వస్తున్న విమర్శ. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా వస్తున్నది. అణచివేత,అస్పృశ్యత వంటి సామాజిక అంశాలు రిజర్వేషన్ల వ్యవస్థ ఉనికికి ప్రాతిపదిక అని ఇప్పుడు కోర్టు వెనకబాటుతనం, తగ్గిన ప్రాతినిథ్యం వంటి అంశాలను ప్రవేశపెట్టి రిజర్వేషన్‌కున్న ప్రాతిపదికను బలహీనం చేస్తున్నదని ఈ విమర్శ సారాంశం.

ఈ విమర్శకు తగిన ప్రాతిపదిక వుందని అనుకోలేం. ఎస్సీలలో అంతర్గత వ్యత్యాసాలను అధిగమించేందుకు ముందుకు వచ్చిన అంశాన్ని రిజర్వేషన్ల మౌలిక భావనకు వ్యతిరేకం అని భావించడానికి ఆస్కారం లేదు.మన దేశంలో రిజర్వేషన్ల చారిత్రక నేపథ్యం,అస్పృస్యత లేని తరగతులకు కూడా రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించిన తీరును పరిశీలిస్తే, రిజర్వేషన్లను, ప్రాతినిథ్యాలకు ఏదో ఒక్క అంశం ప్రాతిపదికగా వున్నది అనుకోవడం సాధ్యం కాదు.

సామాజిక అణచివేత,అస్పృశ్యతలను నేరాలుగా రాజ్యాంగం ప్రకటించింది.వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు చట్టాలు కూడా తెచ్చాయి.అవి అధ్వాన్నంగా అమలు చేయబడుతున్నాయనేది వేరే విషయం. అయితే సామాజిక బలహీనత అధిగమించ డానికి చట్టాలే సరిపోవని,విద్య,ఆర్థిక, రాజకీయ సాధికారతలను కూడా ఇవ్వడం అవసరమని భావించే,విద్య,ఉపాధి, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కల్పించబడ్డాయి.

➡️జనరల్‌ కోటాకు మళ్లింపు-బ్యాక్‌లాగ్‌ విధానం

వర్గీకరణ మూలంగా నిండని ఖాళీల సంఖ్య పెరుగుతుందని, వాటిని జనరల్‌ కోటాలోకి మళ్లించడం ద్వారా ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని కొందరు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. నిండని ఖాళీలను జనరల్‌ కోటాలోకి మార్చాలన్న ప్రయత్నం వర్గీకరణ అంశంతో ముడిపెట్టడం సరికాదు.

జనరల్‌ కోటాలోకి మార్చాలనే ప్రయత్నాలు వర్గీకరణ అంశం చర్చకు రాకముందు నుండి జరుగు తున్నాయి.వీటికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల మూలంగానే ‘బ్యాక్‌లాగ్‌’ అన్న పద్దతి ప్రవేశ పెట్టబడింది. అయినా ఇప్పటికీ ఇటువంటి ప్రయత్నాలు జరుగు తూనే వున్నాయి.

ఈమధ్య యుజిసి రిజర్వుడ్‌ ఖాళీలను జనరల్‌ కోటాలోకి ఎటువంటి పరిస్థితుల్లో మార్చవచ్చో వివరిస్తూ మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించింది.తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో హడావుడిగా ఉపసంహరించుకుంది. ఇటువంటి ప్రయత్నాలను అడ్డు కోవడం తప్ప ఈ అంశాన్ని వర్గీకరణతో ముడిపెట్టడం తప్పు.

అలాగే వర్గీకరణ అనేది ఎస్సీ తరగతి అంతర్గత అంశం: ఉన్న కోటాలో ఉప విభజన. అందువలన ఒక బృందంగా చూసినప్పుడు ఎస్సీ తరగతిగా నష్టపోయేది వుండదు. ఒక ఉపతరగతిలో ఖాళీ మిగిలిపోతే ఇంకో తరగతిలో అర్హులైనవారితో నింపవచ్చు. అన్ని ఉపతరగతుల నుండి కూడా భర్తీ కాకపోతే బ్యాక్‌లాగ్‌లో పెట్టవచ్చు. ఈ పద్ధతి వలన కోటా ఎస్సీ తరగతి దాటి బయటకు పోవడం వుండదు. రాష్ట్రాలు గానీ కేంద్రంగానీ వర్గీకరణ తీసుకువస్తే ఎస్సీ కోటా బయటకు పోకుండా రాజ్యాంగ, చట్టబద్దమైన ఏర్పాటు చేసేట్లుగా చూడాలి.

➡️అభివృద్ధిలో వ్యత్యాసాలు-పరిష్కార మార్గాలు

వర్గీకరణకు మరికొన్ని అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. వర్గీకరణ దళితుల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుందని వీటిలో ఒకటి.వాస్తవం ఏమంటే ఎస్సీల్లోని వివిధ ఉపకులాల మధ్య పెరుగుతున్న వ్యత్యాసాలే వర్గీకరణ డిమాండ్‌కు దారితీశాయి. వ్యత్యాసాలను అధిగమించే చర్యలను సమర్థించడమే ఐక్యతకు మార్గం తప్ప,వాటిని వ్యతిరేకించడం కాదు.దీని ద్వారా వ్యత్యాసాల పేరుతో అనైక్యతను సృష్టించే వారి ఆటలు కట్టించడం సులభం.

అలాగే బూర్జువా రాజకీయ పార్టీలు వర్గీకరణ అంశాన్ని తమ స్వార్థపూరిత ప్రయోజనాలకు ఉపయోగించు కొంటున్నాయనేది మరో విమర్శ. ఓట్ల కోసం ఒక సామాజిక తరగతిని ఇంకొక సామాజిక తరగతికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం, సమీకరించడం బూర్జువా పార్టీలు ఒక శాస్త్రంగా మార్చివేశాయనేది నిజం. ఈ కుటిల ప్రక్రియ ప్రయోగంలో బీజేపీ అన్నిటికన్నా ముందున్నది.

ఎస్సీల మధ్య ఉన్న అభివృద్ధి వ్యత్యాసాలను గుర్తించి, పరిష్కార మార్గాలను కనుగొనడం ద్వారా మాత్రమే బూర్జువా పార్టీల అనైక్యత సృష్టించే ఎత్తుగడలను తిప్పికొట్టగలం.

➡️వర్గీకరణ సర్వరోగ నివారిణి కాదు

సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చింది కాబట్టి ఇక ఎస్సీల్లోని వెనక బడిన ఉపకులాల సమస్యలన్నిటికి పరిష్కారం దొరికిపోయిందని ఎవరైనా భావిస్తే వారికి నిరాశే ఎదురవుతుంది. అలా చూస్తే రిజర్వేషన్లే సామాజిక అణచివేతను, దళితుల వెనకబాటు పరిస్థితిని పరిష్కరించలేదు.

సరళీకరణ విధానాలొచ్చిన తర్వాత (బూర్జువా పార్టీలన్నీ వీటిని అమలు చేస్తున్నాయి) రిజర్వేషన్లు ఇంకా నామమాత్రం అవుతున్నాయి. ఈ స్థితిలో వర్గీకరణ పెద్ద మార్పు సాధిస్తుందని అనుకోరాదు. ఎస్సీలలోని కొన్ని తరగతు లలో అసంతృప్తి కారణ మవుతున్న ఒక అంశానికి తక్షణ పరిష్కారం చూపించడం ద్వారా ఐక్యతను పెంపొందించడం జరిగితే, అదే మనం ఆశించగల పెద్ద లాభం.

అసలైన పరిష్కారం వెనకబాటుకు కారణ మైన మౌలిక అంశాలను పరిష్కరించడంలో ఉంది.ఇప్పటికీ దళితులను అట్టడుగు స్థాయికి కట్టిపడ వేస్తున్న భూసంబంధాలను బద్దలుకొట్టాలి. భూపంపిణీ జరగాలి. నాణ్యమైన విద్య,వైద్యం,ఉద్యోగం,ఆహారం, ఆవాసం హక్కులుగా మారాలి.ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు రావాలి.వీటిని సాధించు కుంటేనే దళితులకు,ఇతర బలహీన వర్గాలకు రిజర్వేషన్ల పరిమితు లను దాటి తమ వెనకబాటు తనాన్ని అధిగమించేందుకు సత్తా వస్తుంది.

➡️క్రీమీలేయర్‌ అవసరం లేదు

సుప్రీంకోర్టు తను పరిష్కరించాల్సిన ‘వర్గీకరణ’ వివాదంపై తీర్పు చెబుతూనే ‘క్రీమీలేయర్‌’పై కూడా వ్యాఖ్యలను చేసింది. నలుగురు న్యాయమూర్తులు ‘క్రీమీ లేయర్‌’ను ఎస్సీ, ఎస్టీలకు కూడా అనువర్తింప చేయాలని అభిప్రాయపడ్డారు. ఇది అమలు చేయాల్సిన తీర్పులో భాగం కాకపోయినా, వివాదాస్పద అంశం.

ఎస్సీ,ఎస్టీలకు క్రీమీలేయర్‌ వుండకూడదని సీపీఐ(ఎం) అభిప్రాయం.చారిత్రకంగా ఎటువంటి ఆస్తిపాస్తులు కలిగివుండడానికి నోచుకోని ఎస్సీలలో ఇప్పటికీ స్థిరమైన ఆస్తిపాస్తులు కలిగిన స్పష్టమైన ఒక తరగతి ఏర్పడలేదు. కొద్దిమంది రాజకీయ నాయకులను, ఐఏఎస్‌,ఐపిఎస్‌ అధికారులను, కొద్దిమంది పరిశ్రమల యజమానుల పేర్లను చూపించి క్రీమీ లేయర్‌ను ప్రతిపాదించడం న్యాయం కాదు.

ఈ కుటుంబాల చేతిలో తగినంత సంపద పోగుబడిందని, వారి సామాజికహోదా పెరిగిందని, అటువంటి కుటుంబాల సంఖ్య తగినంత మోతాదులో వుందని మాట వరసకు అంగీకరించినా వాటి సంపద, సామాజిక హోదా తర్వాతి తరాలకు పాస్‌ఆన్‌ అవుతుందన్న పరిస్థితి లేదు. అటువంటప్పుడు ఎస్సీ తరగతిలో క్రీమీలేయర్‌ గురించి ఇప్పుడు చర్చించడం అసందర్భం.

11/08/2024
10/08/2024
03/08/2024

రిజర్వేషన్! రిజర్వేషన్!
ఇచింది. 15అమలైనది 11మిగతా 85%మీరే దొబ్బి తిని దొంగలెక్కలు చెబుతున్నారుగా... దీనికేమంటారు మీ దొంగబుద్ధికి నిదర్శనం కదా కాంట్రాక్టు విధానం? ఔట్ సోర్సింగ్ విధానం?
ఎక్కడుంది రిజర్వేషన్ ?
ప్రధానమంత్రి పదవిలో
ఉందా ?
ముఖ్యమంత్రి పీఠం లో
ఉందా ?
మంత్రి పదవుల్లో ఉందా ?
రాష్ట్ర పతి పదవిలో ఉందా?
సుప్రీం కోర్టు న్యాయమూర్తి
పదవికి ఉందా
పరిశ్రమల్లో వుందా?
మీడియా లో వుందా?
దేశ సంపదలో వుందా?
సినిమా రంగంలో వుందా?
కాంట్రాక్టుల్లో వుందా?
పవర్ ప్రాజెక్ట్ లలో ఉందా?
రిలయన్స్ మాల్స్ లో ఉందా ?
IT కంపెనీల్లో వుందా?
ప్రయివేట్ రంగంలో వుందా?
మెట్రో రైళ్లలో వుందా
విజయ్ మాల్యా ఎగవేతలో
ఉందా ?
కార్పొరేట్ హాస్పిటల్స్ లో
ఉందా ?
కార్పొరేట్ కాలేజ్ లలో ఉందా?
కార్పొరేట్ కంపెనీలలో ఉందా ?
భూముల్లో ఉందా ?
బంగ్లాలలో ఉందా ?
భూస్వాముల్లో ఉందా ?
పదవుల్లో ఉందా ?
పంపకాల్లో ఉందా ?
సత్యం కంప్యూటర్ ఉందా ?
రిలయన్స్ కంపెనీ ఉందా ?
సినిమా స్టూడియో లలో
ఉందా ?
ఆస్తులు లలో ఉందా ?
అంతస్తులు లలో ఉందా ?

*ఎందులో ఉంది రిజర్వేషన్*
100 రూపాయిలు ఫీజు ఉండే
గవర్మెంట్ హై స్కూల్ లోఉంది !
బోధకులు లేని కాలేజ్
చదువులో ఉంది ?
ఫీజ్ లు కట్టలేని చదువులో
ఉంది ?
వీధులూడ్చే శ్వీపర్ పోస్ట్ లో
ఉంది !
ఈ రిజర్వేషన్ వల్ల మేం
పొందింది .....ఏముంది
మీరు కంపెనీ ఓనర్ అయితే
మేం అటెండర్ !
మీరు హాస్పిటల్ పెడితే మేం
కాంపౌండర్ !
మీరు సినిమా తీస్తే మేం
సినిమా చూడడం !
మీరు రాజ్యాలు ఏలితే మేం
ఓట్లేయడం !
మీరు మందు షాప్ పెడితే మేం
మందు తాగడం

ఎందుకు దొంగ ఏడుపు ఏడుస్తారు మీ ఆస్తులు ఎదో ఇచ్చినట్టు మా జనాభా ప్రకారం మాకు రావాల్సిన వాటా.
అది మీ సొత్తు కాదు, అది కూడా సరిగా అమలుచేయకుండా *11%కె మమ్మల్ని పరిమితం చేస్తిరి అయినా 73సంవత్సరాలలో మాకు ఒరిగింది ఏముంది గుమస్తా ఉద్యోగాలు,తిండి, బట్ట, ఇల్లు కొంతమందికి అందాయి తరతరాలు గా మా జాతి శ్రమను దోచుకుంటిరి ఈ అభివృద్ధిలో కష్ట పడ్డది పడుతున్నది మేము* పరిశ్రమల్లో కార్మికులు మేము,
బస్సులు నడిపేది మేము
ఓడలు నడిపేది మేము
లారీలు నడిపేది మేము
వీధులు ఊడ్చేది మేము
దొడ్లుకడిగేది మేము
డ్రైనేజీ శుభ్రం చేసేది మేము
మీ కంపు కడిగేది మేము
మీకు సెక్యూరిటీ మేము
డ్రైవర్లు మేము
బిల్డింగ్లు కట్టేది మేము
రిక్షా తొక్కింది మేము
యంత్రాలు నడిపేదిమేము
కార్మికులు మేము
రైతుకూలీలుమేము
రైల్వేకూలీలుమేము
అక్కడ
ఇక్కడ
ఎక్కడైనా
మేము లేకుంటే
మీకు బ్రతుకు లేదు
చివరికి
*మీరు ఛస్తే*
*కాటికి పంపేది*
*శవాన్ని కాల్చేది మేము*.....................
ఎవడురా అంటరానివాడు?
ఎవడురా పంచముడు?
ఎవడురా హరిజనుడు?
మా రక్తం అభివృద్ధికి -ఇంధనంగా
మా చెమట మీకు -పెట్టుబడిగా
మా
శ్రమతో ఎదిగారు
మా శ్రమశక్తిని దోచుకున్నారు
భూములు మీ సొంతం చేసుకున్నారు!
పరిశ్రమలు మీ సొంతం చేసుకున్నారు !
అధికారం చలాయిస్తున్నారు!......................
కూటికి లేక మేము చస్తుంటే
కోటానుకోట్ల సంపదతో
ఆదిత్యధిక సంపన్నులుగా
ప్రపంచ ర్యాoకులు సాధిస్తున్నారు
ఇది ఎక్కడి న్యాయం?
అందుకే
మాకు రిజర్వేషన్ కాదు
*ఈ దేశ బిడ్డలుగా మాకు సంపదపై హక్కు వుంది*
*ఈదేశ అభివృద్ధి లో మా శ్రమ దాగి వుంది*
*మా జనాభా దామాషా ప్రకారం మాకు పాలించే హక్కు కావాలి*
*మమ్మల్ని విభజించి, పాలించే అధికారం హక్కు మీకు ఎక్కడిది*

మేము తిరగబడే రోజు వస్తుంది.
దళిత, గిరిజన, బహుజనులదే పాలించే అధికారం
డా భీం రావ్ దళిత ఉద్యమం (Dr Bhimrao Dalit Moment) వర్ధిల్లాలి.

01/08/2024

చారిత్రాత్మక తీర్పు ని మాదిగ సమాజానికి అందించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారికి మరియు ఇతర సభ్యుల ధర్మాసనానికి కృతజ్ఞతలు. ఈ విజయాన్ని అందిపుచ్చుకోడానికి గల ముఖ్య కారకులు మన దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక వందనాలు.
స్వాతంత్ర పోరాట యోధుడిగా మాదిగ జాతి కోసం 30 సంవత్సరాలకు పైగా అలుపెరగని పోరాటం చేసిన జాతి ఆశా కిరణం మందకృష్ణ మాదిగ గారికి శుభాభినందనలు.
జై భీమ్ జై దళిత్ .
ఇట్లు మీ,
డా. ఓబులాపురం దేవప్రసన్న

01/08/2024

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా...

ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం

కోటాలో సబ్‌ కోటా తప్పు కాదు: సుప్రీం కోర్టు

*వర్గీకరణకు అనుకూలమని ఇప్పటికే కోర్టుకు తెలిపిన కేంద్రం*

ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణల్లో వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ క్రమంలో గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

తాజా చారిత్రక తీర్పులో.. ఏడుగురు న్యాయమూర్తుల్లో ఒక్క జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం విరుద్ధమైన తీర్పును ఇచ్చారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదని బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో 6-1 తేడాతో తుది తీర్పు వెలువడింది.

*కేసు ఏంటంటే..*
వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొట్టివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చింది. అయితే ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ’ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

అయితే.. హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2020లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. కోఆర్డినేట్‌ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరం ఉందని.. దీనిపై పునస్సమీక్షించాలని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది.

*ఫిబ్రవరిలో..*
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా? లేదా? అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజేఐ రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడురోజుల పాటు విచారణ సాగింది. వాదనలు ముగియడంతో ఆ టైంలో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ఫిబ్రవరి 8న ప్రకటించింది. ఇప్పుడు.. ఐదు నెలల తర్వాత ఆ తీర్పు ఏంటో వెల్లడించింది.

*కేంద్రం వాదనలు*
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పథకాలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని వాదనల సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.

*వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో వాదనలు వినిపించింది. రిజర్వేషన్ల అసలైన లక్ష్యం చేరుకోవాలంటే కోటాను హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యమని, రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వెనుకబడిన వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది.*

వెనుకబడిన వర్గాలు/కులాలకు సమానత్వం, సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం, రాజ్యం (ప్రభుత్వం) లక్ష్యం అని, వర్గీకరణ చేపట్టడం ద్వారా అవసరం ఉన్నవారికి ఈ ప్రయోజనాలు అందుతాయని వాదనలు వినిపించింది.

Address

Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Bhimrao Dalit Movement posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share