20/09/2025
🌿✨ స్వచ్ఛంద్రా- స్వర్ణాంధ్ర ✨🌿
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు,
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పాంగులూరు నారాయణ గారి సూచనలతో,
వేలూరు పెంచల బాబు మరియు షేక్ జాఫర్ గారి ఆధ్వర్యంలో 48వ డివిజన్ పరిధిలోని ఆనం వెంకట్ రెడ్డి కాలనీ లో
ఈ రోజు స్వచ్ఛంద్రా స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి డివిజన్ పరిసర ప్రాంతాలను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులతో చర్చించి వారి సమస్యలను గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా చూస్తామని హామీ ఇవ్వడం జరిగినది.
అనంతరం పై కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులను మరియు సిబ్బందిని ఘనంగా సత్కరించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి
ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో తమ పాత్రను నిర్వర్తించారు.
ఈ సందర్భంగా శ్రీ వేలూరు పెంచల బాబు గారు మాట్లాడుతూ –
“స్వచ్ఛమైన పరిసరాలు ఉంటేనే ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి.
తెలుగు దేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కో క్లస్టర్ ఇంచార్జ్ షేక్ జాఫర్ అధ్యక్షులు వేలూరు పెంచల బాబు డివిజన్ ఇంచార్జ్ శ్రీమతి వేలూరు కీర్తి తెలుగుదేశం నాయకులు ఇంతియాజ్ గారు తదితరులు పాల్గొన్నారు #పొంగూరు