NLR DIST SDPI Official

NLR DIST SDPI Official NELLORE DIST OFFICIAL
ఆకలి నుండి స్వేచ్ఛ...!
భయం నుండి స్వేచ్ఛ...!

*🟢చిరు వ్యాపారుల జీవనోపాధిపై రాజకీయాలు వద్దు - SDPI*నెల్లూరు జిల్లా / తేది: 28.03.2026 మార్చి 27న గొలగమూడి రోడ్‌లో పశువు...
28/03/2026

*🟢చిరు వ్యాపారుల జీవనోపాధిపై రాజకీయాలు వద్దు - SDPI*

నెల్లూరు జిల్లా / తేది: 28.03.2026

మార్చి 27న గొలగమూడి రోడ్‌లో పశువుల సంత నిర్వహణ జరుగుతుందనే పేరుతో వైసీపీ నెల్లూరు జిల్లా ఇంచార్జ్ & మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కొందరు నాయకులు, గో సంరక్షకుల పేరుతో అక్కడికి వెళ్లి చిన్న వ్యాపారులు, పశువుల కొనుగోలు-అమ్మకాలు చేసుకునే వారిపై ఆరోపణలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించిన ఘటనను SDPI తీవ్రంగా ఖండిస్తోంది.

చట్ట విరుద్ధ చర్యలు జరుగుతున్నాయని అనుమానం ఉంటే సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. కానీ రాజకీయ నాయకులు స్వయంగా వెళ్లి మత భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం సమంజసం కాదు. ఇది ప్రజల్లో అనవసర భయాందోళనలు, విభజనలకు దారి తీసే ప్రమాదం ఉంది.

మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం తగదు. ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న మత ఆధారిత రాజకీయాలను దక్షిణ భారతంలో అమలు చేయాలని ప్రయత్నించడం ప్రజలు అంగీకరించరు. చిన్న స్థాయి పశువుల వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం కంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న పెద్ద స్థాయి మాంసం ఎగుమతులపై ఎందుకు స్పందించడం లేదో స్పష్టం చేయాలి. ప్రపంచంలోనే అత్యధికంగా బీఫ్ ఎగుమతి చేసే దేశాలలో భారత్ ఒకటిగా ఉండటం వాస్తవం.

దీన్ని అరికట్టాలని చెప్పే రాజకీయ నాయకులే ఎన్నికల సమయంలో పెద్ద వ్యాపార సంస్థల నుంచి నిధులు సేకరిస్తున్న విషయం ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా బయటపడింది. అలాంటి పరిస్థితుల్లో చిన్న వ్యాపారులపై మాత్రమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం ద్వంద్వ వైఖరిని సూచిస్తుంది.

గొలగమూడి రోడ్‌లో నిజంగా ఏవైనా అక్రమాలు ఉంటే పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కానీ మత భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందే ప్రయత్నాలు నిలిపివేయాలి. ప్రజల మధ్య శాంతి, సామరస్య వాతావరణాన్ని భంగం చేసే చర్యలను SDPI తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని SDPI నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఇమామ్ బాషా గారు డిమాండ్ చేశారు.

*SDPI నెల్లూరు జిల్లా కమిటీ అధికారిక ప్రకటన*📍 నెల్లూరు | మార్చి 1నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) ప్రసూతి & ఎంసిహెచ...
01/03/2026

*SDPI నెల్లూరు జిల్లా కమిటీ అధికారిక ప్రకటన*
📍 నెల్లూరు | మార్చి 1

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) ప్రసూతి & ఎంసిహెచ్ బ్లాక్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై SDPI నెల్లూరు జిల్లా కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అధికారుల సమాచారం ప్రకారం, ప్రసూతి వార్డులోని ఒక గదిలో ఏసీ బ్లాస్ట్ కావడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి, దాని ప్రభావంతో సమీపంలోని ఒకటి రెండు పడకలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఆ గది వరకే పరిమితమైందని, ఆసుపత్రి మొత్తం విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగలేదని జిల్లా విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి గర్భవతులు, బాలింతలను సురక్షితంగా ఇతర వార్డులు మరియు ఐపీ బ్లాక్‌కు తరలించడం ప్రశంసనీయమైన చర్య. అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు, ఆసుపత్రి యాజమాన్యం సమన్వయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. జిల్లా కలెక్టర్ మరియు పోలీసు అధికారులు ఘటనను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టారు.

ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకపోవడం ఉపశమనకరం. అయితే, ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలక్ట్రికల్ పరికరాలు, ఏసీ యూనిట్లు, వైరింగ్ వ్యవస్థలపై క్రమం తప్పకుండా సాంకేతిక తనిఖీలు నిర్వహించడం అత్యవసరం. ముఖ్యంగా ప్రసూతి వార్డుల వంటి సున్నిత విభాగాల్లో భద్రతా ప్రమాణాలు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలి.

ఈ ఘటనపై పూర్తి స్థాయి సాంకేతిక నివేదికను ప్రజలకు వెల్లడించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని SDPI నెల్లూరు జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు తెలిపారు.


SDPI నెల్లూరు జిల్లా కమిటీ

21/02/2026
నెల్లూరు పెద్ద బజార్ డైకస్ రోడ్డులో ఏర్పాటు చేసిన వి.ఎస్.ఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌పై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్త...
20/02/2026

నెల్లూరు పెద్ద బజార్ డైకస్ రోడ్డులో ఏర్పాటు చేసిన వి.ఎస్.ఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌పై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించడం సమాజ భావాలను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు.
ఈ బార్ అండ్ రెస్టారెంట్ వల్ల పేద ప్రజలు మద్యానికి బానిసలుగా మారే ప్రమాదం ఉందని, మహిళలు మరియు యువత భద్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ దుకాణాన్ని అక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేశారు.
గత సంవత్సరం మన్సూర్ నగర్ వాకర్స్ రోడ్ ప్రాంతంలో కూడా ఇలాంటి మద్యం దుకాణం విషయంలో స్థానికులతో కలిసి దాదాపు 50 రోజుల పాటు నిరసనలు జరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఆ బ్రాందీ షాపును తొలగించలేకపోయింది. ప్రస్తుతం ఆ విషయానికి సంబంధించిన కేసు కోర్టులో కొనసాగుతోంది.
నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటు ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే అంశంగా మారుతోంది. ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తు మరియు సామాజిక వాతావరణాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


#మద్యం_దుకాణాలు_మూసివేయాలి


ప్రెస్ నోట్తేదీ: 13 ఫిబ్రరి 2026నెల్లూరులో SDPI కీలక సమావేశం – నెల్లూరు కార్పొరేషన్ పరిధి లో డివిజన్లకు కొత్త ఇంచార్జ్‌ల...
14/02/2026

ప్రెస్ నోట్
తేదీ: 13 ఫిబ్రరి 2026
నెల్లూరులో SDPI కీలక సమావేశం – నెల్లూరు కార్పొరేషన్ పరిధి లో డివిజన్లకు కొత్త ఇంచార్జ్‌లు

నెల్లూరు జిల్లా స్థానిక హాల్తాలిం సెంటర్‌లో గల SDPI పార్టీ జిల్లా కార్యాలయం నందు, పార్టీ జిల్లా అధ్యక్షులు ఇమామ్ భాషా గారి ఆధ్వర్యంలో కీలక సమావేశం ఘనంగా నిర్వహించబడింది.

ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ గారు మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ మహమ్మద్ గని గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డివిజన్లకు ఇంచార్జ్‌లను నియమిస్తూ, వారికి క్రమశిక్షణ, బాధ్యతలు మరియు ప్రజా అవసరాలను గుర్తించి సమస్యలను పరిష్కరించే విధానంపై శిక్షణ ఇచ్చారు.
నియమించబడిన డివిజన్ ఇంచార్జ్‌లు

29వ డివిజన్:
షేక్ యాసిన్ గారు, షేక్ హాజీర గారు

30వ డివిజన్:
ఎస్.డి. ముహమ్మద్ అలీ గారు, మొగల్ ఉస్మాన్ గారు

42వ డివిజన్:
ఎస్.కె. రఫీ గారు, ఎస్.కె. ఇమామ్ భాషా గారు

43వ డివిజన్:
ఎస్.కె. షాఅలీ హుస్సేన్ గారు, ఎస్.కె. అంజత్ గారు

52వ డివిజన్:
ఎస్.కె. తాజున్నిసా గారు,
ఎస్.కె. షాకిరా గారు,
ఎస్.కె. ఖాలిద్ గారు,
ఎస్.కె. అబ్దుల్ అజీజ్ గారు

54 వ డివిజన్
మొహమ్మద్ గని గారు

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ,
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి ఇంచార్జ్ అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

నూతనంగా ఎన్నికైన SDPI జాతీయ అధ్యక్షులు మరియు జాతీయ కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన SDPI నెల్లూరు జిల్లా కమిటీనెల్లూరు, 21-0...
21/01/2026

నూతనంగా ఎన్నికైన SDPI జాతీయ అధ్యక్షులు మరియు జాతీయ కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన SDPI నెల్లూరు జిల్లా కమిటీ

నెల్లూరు, 21-01-2026:

సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) 2026–28 కాలానికి నూతనంగా ఎన్నికైన జాతీయ నాయకత్వానికి SDPI నెల్లూరు జిల్లా కమిటీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది.

నూతనంగా ఎన్నికైన SDPI జాతీయ కమిటీ:

జాతీయ అధ్యక్షుడు:

ఎం. కె. ఫైజీ

ఉపాధ్యక్షులు:

మహమ్మద్ షఫీ
షేక్ మొహమ్మద్ దేహ్లాన్ బాఖవి
సీతారాం ఖోయివాల్

ప్రధాన కార్యదర్శులు:

మహమ్మద్ అష్రఫ్ అంకాజల్
రియాజ్ ఫరంగిపేటే
అబ్దుల్ మజీద్ ఫైజీ
యాస్మిన్ ఫారూకీ
ఇల్యాస్ థుంబే

కార్యదర్శులు:

అల్ఫోన్స్ ఫ్రాంకో
యా మొహిదీన్
సాదియా సయీదా
బి.ఎస్. బింద్రా
అతికా సాజిద్
తయ్యేదుల్ ఇస్లాం

ఖజానాదారు:

అబ్దుల్ సత్తార్

ఈ సందర్భంగా స్థానిక SDPI నెల్లూరు జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శులు షేక్ అబ్దుల్ అజీజ్, అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్, పార్టీ ఉపాధ్యక్షులు ముఫ్తీ షేక్ అబ్దుర్ రహమాన్, షేక్ రఫీ, సెక్రటరీ సయ్యద్ ఫాజిల్, కోశాధికారి సయ్యద్ ఆజాం హుస్సేన్, జిల్లా సభ్యులు షా అలీ హుస్సేన్, ఫైజల్లా, మొహమ్మద్ అలీ, ఉస్మాన్ బేగ్ పాల్గొని నూతనంగా ఎన్నికైన SDPI జాతీయ కమిటీకి అభినందనలు తెలిపారు.

ఈ నెల 20 మరియు 21 తేదీలలో జరిగిన SDPI జాతీయ సమావేశంలో ఎన్నికైన నూతన నాయకత్వం ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం మరింత బలంగా పనిచేస్తుందని జిల్లా కమిటీ విశ్వాసం వ్యక్తం చేసింది.





> Hearty Welcome Mr. Abdullah Khan (President) Andra Pradesh & State Office Bearers on the occasion of the National Repr...
19/01/2026

> Hearty Welcome Mr. Abdullah Khan (President) Andra Pradesh & State Office Bearers on the occasion of the National Representative Council.




*SDPI - SOCIAL DEMOCRATIC PARTY OF INDIA*

*SDPI demands gender-wise audit of SIR nationwide, questions ECI over systematic voter exclusions*The data emerging from...
18/01/2026

*SDPI demands gender-wise audit of SIR nationwide, questions ECI over systematic voter exclusions*

The data emerging from the Special Intensive Revision (SIR) of electoral rolls is no longer an isolated concern limited to one state. The sharp decline in women voters seen in Uttar Pradesh reflects a disturbing national trend that points to systemic exclusion in the voter verification process.

As reported, the draft rolls in Uttar Pradesh show a 21.4% drop in women voters, with the gender ratio of regustered voters falling from 877 to 824 women per 1,000 men. Over 1.54 crore women voters have been deleted—far higher than the decline among men. Similar patterns of disproportionate omissions of women, the marginalised, and minorities are being flagged in other states undergoing SIR exercises.

--This makes a gender-wise and social-category-wise audit of SIR a national democratic necessity, not a local demand.

-- SDPI appeals to civil society organisations, women’s groups, minority rights collectives, academics, journalists, and legal experts to independently examine SIR electoral rolls across states and document the emerging national trend of omissions affecting women, marginalised communities, and minorities.

Democracy cannot survive selective participation. Electoral rolls must reflect society as it exists—not as power wishes it to be.

SDPI demands:

An immediate nationwide gender-wise and social-category-wise audit of SIR

Public disclosure of deletion data state-wise

Restoration of wrongly deleted voters

Institutional accountability within the ECI

Mohammad Shafi
National Vice President

Address

Dycus Road Nellore
Nellore
524001

Alerts

Be the first to know and let us send you an email when NLR DIST SDPI Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to NLR DIST SDPI Official:

Share