జనసేన పార్టీ నెల్లూరు జిల్లా

  • Home
  • India
  • Nellore
  • జనసేన పార్టీ నెల్లూరు జిల్లా

జనసేన పార్టీ నెల్లూరు జిల్లా JSPNLRDIST
(1)

03/06/2026

శ్వాస ఆడక మనిషి ప్రాణం పోయే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సాంఘీక సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలి.

మా ప్రియతమ నాయకులు, హ్యాట్రిక్ రూరల్ ఎమ్మెల్యే Kotamreddy Sridhar Reddy గారికి ఒక వినమ్ర విజ్ఞప్తి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థుల కష్టాలను తెలుసుకునేందుకు ఒక రోజు ఈ హాస్టల్‌లో గడపి లేదా మీరు విజిట్ చేసి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నాం."

సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో దయనీయ పరిస్థితులు – వెంటనే చర్యలు తీసుకోవాలి:

Kishore Gunukula గారు - JanaSena Party
ప్రధాన కార్యదర్శి,శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

నెల్లూరు దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సాంకేతిక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా సమాచారం అందడంతో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల సుబ్బారెడ్డి స్టేడియం పక్కన ఉన్న సాంఘీక సంక్షేమ వసతి గృహాలను సందర్శించారు.

ఈ సందర్భంగా హాస్టల్‌లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించిన కిషోర్ గునుకుల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ ప్రాంగణమంతా దుర్గంధభరితంగా ఉండటం, నేలపై మట్టి పేరుకుపోవడం, బాత్రూములు శుభ్రం చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. సంబంధిత సిబ్బందిని ప్రశ్నించగా, ప్రస్తుతం కేవలం ఒక ఉద్యోగి మాత్రమే విధుల్లో ఉన్నారని, మిగిలిన సిబ్బంది సెలవుల్లో ఉన్నారని తెలిపారు.

హాస్టల్‌లో ఉన్న విద్యార్థులతో మాట్లాడగా, మెను ప్రకారం భోజనం అందించడం లేదని, నెలల తరబడి శుభ్రత పనులు జరగడం లేదని, వాటర్ ప్లాంట్ ఉన్నప్పటికీ పనిచేయడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులు అనారోగ్య సమస్యలతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.

ఈ సందర్భంగా కిషోర్ గుణుకుల మాట్లాడుతూ,...

“శ్వాస ఆడక మనిషి ప్రాణం పోయే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సాంఘీక సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలి. విద్యార్థులు చదువుకోవాల్సిన చోట ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి. లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనాలను అధికారులు నిర్లక్ష్యంతో దుర్గంధభరితంగా మార్చడం బాధాకరం.

గతంలో కోవూరు నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలో పరిస్థితులు బాగోలేవని తెలుసుకుని అక్కడే రాత్రి బస చేసి సమస్యలను తెలుసుకుందాం అని జనసేన తరపున చెప్పినపుడు ఎమ్మెల్యే Vemireddy Prashanthi Reddy గారు ఉదాహరణను ప్రస్తావించారు..

“మన ప్రియతమ నెల్లూరు రూరల్ హట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వినతి ఒకరోజు ఈ హాస్టల్‌లో ఉండి విద్యార్థుల పరిస్థితులను స్వయంగా పరిశీలిద్దాం... మేమంతా కూడా మీతో కలిసి ఉండేందుకు సిద్ధంగా ఉన్నాం”

దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎలా జీవిస్తున్నారు, ఏ ఆహారం తీసుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రదాన కారంయదర్శి కిషోర్ గునుకుల తో జనసేన పార్టీ నాయకులు శరవణ,కుమార్,ప్రశాంత్ గౌడ్,హేమచంద్ర యాదవ్, హరి,దివానం సురేష్,వర్షన్,బ్లూ బర్డ్ అదినేత వేముల శివకృష్ణ,రాఘవ,కరణం రవి, కుప్పం శ్రీనివాసులు, మురళి, పెంచలయ్య, మచ్చ చిన్న గురవయ్య, ప్రభ, జనార్ధన్, శివ, సాయిబాబా, యాకసిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh Ram Talluri Nadendla Manohar Naga Babu Ajaya Kumar Vemulapati Nara Lokesh

03/06/2026
03/06/2026

"న్యాయవాదులు తమ వృత్తితో పాటు పేదలకు న్యాయ సహాయం అందించాలి ఇది మీ సామాజిక బాధ్యత"

ఏఐడీఓ మోడల్ ఎగ్జామ్స్ అనంతరం...

Kishore Gunukula గారు - JanaSena Party

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (AILU) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏఐడీఓ మోడల్ ఎగ్జామ్స్ నిర్వహించారు. న్యాయవాద వృత్తిలోకి అడుగుపెడుతున్న అభ్యర్థులు ఈ మాక్ ఎగ్జామ్స్‌లో పాల్గొని పరీక్ష విధానాలను అవగాహన చేసుకునే అవకాశాన్ని పొందారు.
ఈ సందర్భంగా పాల్గొన్న అభ్యర్థులకు ఏఐడీఓ పరీక్షల నమూనా ప్రశ్నాపత్రాలను అందించి, పరీక్షా విధానంపై అవగాహన కల్పిస్తూ మోడల్ పరీక్ష నిర్వహించారు.
కార్యక్రమానికి సహకరించి కళాశాల వేదికను అందించిన శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల యాజమాన్యానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలా ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఏఐడీయూ మోడల్ ఎగ్జామ్ కార్యక్రమానికి సహకరించిన కళాశాల యాజమాన్యం, డా.శ్రీ పెద్దసెట్టి సునీల్ గారిని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల అభినందించారు.

కొత్తగా న్యాయ వృత్తిలోకి అడుగుపెడుతున్న యువ న్యాయవాదుల కోసం మోడల్ ఎగ్జామ్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

రానున్న పరీక్షల్లో పాల్గొంటున్న అభ్యర్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

న్యాయవాదులు తమ వృత్తి బాధ్యతలతో పాటు కొంత సమయాన్ని పేదలకు ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం అందించేందుకు కేటాయించాలని పిలుపునిచ్చారు.

జనసేన పార్టీ తరఫున పేదలకు న్యాయ సహాయం అందించడంలో సుమంత్ చేసిన సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు.

విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదని, పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడంలో పెద్దసెట్టి సునీల్ గారు చేస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.

ఇంటర్, డిగ్రీ, పీజీ చదువులను మధ్యలో ఆపేసిన లేదా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అవసరమైన సహాయం అందించేందుకు కళాశాల యాజమాన్యం సిద్ధంగా ఉందని తెలిపారు.

సమాజంలో న్యాయం, విద్య అందరికీ చేరేలా ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు..

Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh Ram Talluri Nadendla Manohar Naga Babu Ajaya Kumar Vemulapati JanaSena Shatagni

02/06/2026

మర్చిపోయినట్టు ఉన్నారు! గుర్తు చేద్దాం..


02/06/2026

తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి చూస్తే #పంచెలు తడిసిపోయే పరిస్థితి...
పంచెలు ఊడదీసి కొడతాను" అని గతంలో పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ నాయకుల గురించి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద సభ ఇక్కడ పెడుతుంటే, మన ఉనికి కోల్పోతామేమో అన్న భయం కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది.





02/06/2026

కవిత గారికి జెండా లేదు, ఎజెండా లేదు. ముందు మంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న సొమ్ముకు లెక్క చెప్పండి, తర్వాత ఇతరుల గురించి మాట్లాడండి.

— కిషోర్ గునుకుల, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, వన్ టు వన్ డిబేట్ విత్ సాస్ టీవీ.






Pawan Kalyan JanaSena Party

02/06/2026

"వీధిలో గాడిదకు వచ్చింది, నీకు వచ్చింది వయసు పొన్నా ప్రభాకర్... కానీ బుద్ధి మాత్రం పెరగలేదు."

— కిషోర్ గునుకుల, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, వన్ టు వన్ డిబేట్ విత్ సాస్ టీవీ.





02/06/2026

Address

27-1-1086, Balaji Nagar, Lakshmi Nagarext
Nellore
524002

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919494852971

Website

Alerts

Be the first to know and let us send you an email when జనసేన పార్టీ నెల్లూరు జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to జనసేన పార్టీ నెల్లూరు జిల్లా:

Share