Telugu Desam Party: Narsipatnam

Telugu Desam Party: Narsipatnam Official Page of TDP Narsipatnam

02/06/2026

ఇటీవల గొడ్డలి పార్టీ చేసిన 5 ఘటనలు ప్రజలు తెలుసుకోవాలి.

మొదటిది: డీఎస్సీపై గొడ్డలి పార్టీ గొడ్డలి వేటు..

గత గొడ్డలి పార్టీ పాలనలో ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 241 కేసులను పరిష్కరించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టాం. అత్యంత పటిష్టంగా ఈ నియామక ప్రక్రియను నిర్వహించాం.

కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టాం. 40 వేల ప్రశ్నలు, 25 రకాల ప్రశ్నాపత్రాలతో ఎక్కడా అక్రమాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అయినప్పటికీ ఫ్రస్టేషన్‌లో ఉన్న వైసీపీ, ఈ ప్రక్రియను వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోంది.

అయితే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం వల్ల, వస్తున్న ఆరోపణలకు గట్టిగా సమాధానం ఇవ్వగలిగాం.



నంద్యాలలో విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్త జంబులయ్య. వైసీపీ పెద్దలే చేయించి తిరిగి డ్రామాలు ఆడిస్తున్నారు. వచ...
02/06/2026

నంద్యాలలో విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్త జంబులయ్య. వైసీపీ పెద్దలే చేయించి తిరిగి డ్రామాలు ఆడిస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసమే ఈ నాటకాలు. ఇలాంటివి జగన్ కు కొత్త కాదుగా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్లి చూడండి.


01/06/2026

తమ కార్యకర్త చేత తమ తండ్రి విగ్రహాలను నరికించి, ప్రభుత్వంపైనే కుట్ర చేసి దొరికిపోయాడు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు.


01/06/2026

సుపరిపాలనను వెనక్కు లాగేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది..

బాబాయి వివేకానందరెడ్డిని హత్య చేసి గుండెపోటు అన్నారు. పోస్టుమార్టం తర్వాత తెలిసింది అది గుండెపోటు కాదు, గొడ్డలి పోటు అని.. ఒక్క ఛాన్స్ అన్నారు, మోసం చేశారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు కూడా ఆడారు..



01/06/2026

డీఎస్సీ-2025లో ఎంపికైన ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి, తమ ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్న వారే. డీఎస్సీ నిర్వహణపై అవాస్తవాలు ప్రచారం చేయవద్దు. ఏమైనా చెప్పాలనుకుంటే వాస్తవాల ఆధారంగానే మాట్లాడండి.

జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్ల కష్టపడి చదివి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల మనోభావాలు దెబ్బతింటాయి. అందువల్ల టీచర్లెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

శాఖాపరంగా ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సూచించండి. వాటిని పరిశీలించి సరిదిద్దుకోవడానికి, నేర్చుకోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం.


• నేటి నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం. ఫలించిన సీఎం చంద్రబాబు పట్టుదల • సింగపూర్ బ...
01/06/2026

• నేటి నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం. ఫలించిన సీఎం చంద్రబాబు పట్టుదల

• సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ లో చిరాగ్ తో కలిసి స్వర్ణ పథకం సాధించిన కోనసీమ కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

• నంద్యాల జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసం వైసీపీ కార్యకర్త పనే.సీసీ కెమెరాల ఫుటేజీ తో బట్టబయలైన సైకో బ్యాచ్ నాటకం. వైసీపీ తీరుపై ధ్వజమెత్తిన ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• నేడు కాకినాడ జిల్లా చామవరం లో "ప్రజావేదిక" లో పాల్గొని ,ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

• పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రేపటి నుంచి ఆరు రోజులపాటు రష్యాలో పర్యటించనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/oc1l


31/05/2026

డీఎస్సీ నియామకాల్లో టెట్‌కు 20 శాతం, డీఎస్సీ పరీక్ష మార్కులకు 80 శాతం వెయిటేజ్ కల్పించే విధానాన్ని అమలు చేశాం. ముఖ్యమంత్రి గారు 13-06-2024న తీసుకున్న నిర్ణయం మేరకు జీఓ నెం. 27 జారీ చేసి, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాం. - విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్..


31/05/2026

ప్రతి అంశాన్ని ఆన్ లైన్లో పొందుపరిచాం.. వెబ్ సైట్లల్లో పెట్టాం..గడిచిన డీఎస్సీల నిర్వహణ అనుభవంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. 154 టీసీఎస్ ఐయాన్ సెంటర్లల్లో ఈ డీఎస్సీ పరీక్షను నిర్వహించాం. - విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్.


30/05/2026

గత 5 ఏళ్లుగా ఒక్క డీఎస్సీ కూడా లేక, నానా ఇబ్బందులు పడి, ఒక్క పూట భోజనం చేసి, కష్టపడి చదివి నేడు టీచర్ ఉద్యోగాలు సాధించుకున్న యువతపై... నీ ఫేక్ ఆరోపణలతో రాక్షసుడిలా విరుచుకుపడి పైశాచిక ఆనందం పొందుతున్నావా ?


30/05/2026

పదేళ్లుగా కష్టపడి, ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సంపాదించుకున్న ఉద్యోగం ఇది. మేము డబ్బులు కట్టి ఉద్యోగాలు పొందామని మాట్లాడి మమ్మల్ని అవమానపరిస్తే... ప్రజా క్షేత్రంలోనే మీకు బుద్ధి చెబుతాం .


Address

Narsipatnam

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Narsipatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Narsipatnam:

Share