PS Dhanwada

PS Dhanwada Telangana state police

16/06/2026

లాటరీ వచ్చిందని మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌, కాల్స్ వస్తే వాటిని ఖచ్చితంగా అనుమానించాల్సిందే. డబ్బు ఆశ చూపించి సైబర్ నేరగాళ్లు మీ ఖాతాను ఖాళీ చేసే ప్రయత్నమని గ్రహించండి. అత్యాశతో వాటికి స్పందిస్తే అంతే సంగతులు. లాటరీ మోసాలపై అవగాహన పెంచుకోండి.

16/06/2026

➡️జనగణన ధృవీకరణ పేరుతో వచ్చే నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండండి – మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోండి

✳️ సైబర్ మోసగాళ్లు జనగణన (Census) ధృవీకరణ పేరుతో నకిలీ లింకులు, సందేశాలు పంపిస్తూ ప్రజలను మోసం చేసి వారి వ్యక్తిగత, ఆర్థిక మరియు గోప్యమైన సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
✳️ధృవీకరించని లింకులపై క్లిక్ చేయవద్దు. ఆధార్ వివరాలు, OTPలు, PINలు, బ్యాంక్ ఖాతా సమాచారం, పాస్‌వర్డ్లు లేదా ఇతర గోప్యమైన సమాచారాన్ని అపరిచిత వ్యక్తులు లేదా వెబ్‌సైట్లతో పంచుకోవద్దు.
✳️ అధికారిక జనగణన అధికారులు ఎప్పటికీ ఫోన్ కాల్స్, సందేశాలు లేదా ఆన్‌లైన్ లింకుల ద్వారా OTPలు, PINలు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఇతర ఆర్థిక సమాచారాన్ని అడగరు.
✳️జనగణనకు సంబంధించినదిగా పేర్కొంటూ వచ్చే ఏ సమాచారాన్నైనా స్పందించే ముందు దాని ప్రామాణికతను తప్పనిసరిగా ధృవీకరించండి.
✳️అప్రమత్తంగా ఉండండి – సైబర్ భద్రతను పాటించండి. అనుమానాస్పద లింకులు, సందేశాలు లేదా సైబర్ మోసాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు తెలియజేయండి లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.

16/06/2026

A stranger behind a screen can be a real-world threat. Stay involved, stay aware, and encourage children to speak openly about their online interactions.
Monitor. Communicate. Protect.

Cyber Crime: 1930 | Childline: 1098

16/06/2026

ఈజీ మనీ అంటేనే మహామోసం అని గుర్తుంచుకోండి. సులభంగా డబ్బుల వస్తాయని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి. ఇంట్లో కూర్చుని సంపాదించవచ్చనే మాటలు నమ్మి మోసపోకండి. సైబర్ మోసాలపై అవగాహన, అప్రమత్తత అవసరం.

14/10/2025

Address

Dhanwada Police Station, Naryanpet District
Narayanpet

Website

Alerts

Be the first to know and let us send you an email when PS Dhanwada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category