Palnadu Police

Palnadu Police Officially Maintained by Palnadu Police. "Call 1930 to report a cyber crime within 24 hours of its occurrence"

అసభ్య ప్రవర్తన ఆనందం కాదు... అది చట్టరీత్యా నేరం... పరివర్తనే శాశ్వత పరిష్కారం — నరసరావుపేట డీఎస్పీ శ్రీ ఎం. హనుమంతరావు ...
31/05/2026

అసభ్య ప్రవర్తన ఆనందం కాదు... అది చట్టరీత్యా నేరం... పరివర్తనే శాశ్వత పరిష్కారం — నరసరావుపేట డీఎస్పీ శ్రీ ఎం. హనుమంతరావు గారు,.

🚩 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మహిళా మరియు శిశు భద్రత విభాగం ఐజీపీ శ్రీమతి బి.రాజకుమారి, ఐపీఎస్ గారి మార్గదర్శకత్వంలో, పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ బి. కృష్ణారావు ఐపీఎస్ గారి సూచనల మేరకు నేడు నరసరావుపేట మహిళా పోలీస్ స్టేషన్‌ ఆవరణలో “ఆపరేషన్ పరివర్తన సదన్” కార్యక్రమం నిర్వహించబడింది.

* సమాజంలో మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేయడం, లైంగిక నేరాల పునరావృతిని నిరోధించడం, అలాగే నేరాలకు పాల్పడిన వారిలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

* కార్యక్రమంలో లైంగిక నేరాలకు సంబంధించిన చట్టపరమైన పరిణామాలు, బాధితులపై నేరాల ప్రభావం, సామాజిక బాధ్యత,వ్యక్తిత్వ వికాసం,కోప నియంత్రణ,నైతిక విలువలు, చట్టాలను గౌరవించే జీవన విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

* ఈ సందర్భంగా మానసిక వైద్యులు, న్యాయ నిపుణులు మరియు పోలీసు అధికారులు పాల్గొని విలువైన సూచనలు, సలహాలు అందించారు. ప్రతి వ్యక్తి మహిళలు మరియు చిన్నారుల గౌరవం,భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడినట్లయితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

* “ ఆపరేషన్ పరివర్తన సదన్ ” కార్యక్రమం ద్వారా నేరస్తుల లో సానుకూల ఆలోచనా విధానాన్ని పెంపొందించి, వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో శాంతి, భద్రత, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

👉 డీఎస్పీ శ్రీ ఎం. హనుమంతరావు గారు మాట్లాడుతూ...

* ఈ సందర్భంగా ఎస్.ఓ.ఎస్. (Sexual Offenders Sheets) నమోదైన వ్యక్తులతో నరసరావుపేట డీఎస్పీ శ్రీ ఎం. హనుమంతరావు గారు ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు.

* ఆయన మాట్లాడుతూ, గతంలో బాలురు, బాలికలు కలిసి స్వేచ్ఛగా ఆడుకునే వాతావరణం ఉండేదని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారుల భద్రతపై ప్రతి కుటుంబం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు.

* లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు ప్రస్తుతం అత్యంత వేగంగా జరుగుతోందని, అరెస్టుల అనంతరం 60 రోజుల లోపు చార్జిషీట్లు దాఖలు చేసి,90 రోజుల లోపు విచారణ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వలన ఇలాంటి కేసులు ఏడాది లోపే తుది తీర్పుకు వచ్చే అవకాశాలు పెరిగాయని తెలిపారు.

* అదేవిధంగా, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు సమాజంలోని ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం మీపై రౌడీషీట్లు కాకుండా ఎస్.ఓ.ఎస్.షీట్లు మాత్రమే ఉన్నాయని, భవిష్యత్తులో మళ్లీ నేరాలకు పాల్పడినట్లయితే రౌడీషీట్లు తెరవబడతాయని హెచ్చరించారు.

* ఒకరికి పడిన శిక్ష సమాజంలోని ఇతరులకు హెచ్చరికగా, మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరిలో సానుకూల పరివర్తన రావాలని,మీలో వచ్చే మార్పు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
* కార్యక్రమం ముగింపు లో హాజరు అయిన వారితో ప్రతిజ్ఞ చేయించారు.
🔰 ఈ కార్యక్రమంలో నరసరావుపేట డిఎస్పి M. హనుమంతరావు గారితో పాటు నరసరావుపేట సీనియర్ న్యాయవాది నజీమా గారు,డాక్టర్ సుస్మిత ఎం.డి
(సైక్రియాటిస్ట్) గారు,RVR కాలేజీ లెక్చరర్ రాజ్యలక్ష్మి గారు, నరసరావుపేట మహిళా పోలీస్ స్టేషన్ CI సుభాషిని గారు, నరసరావుపేట ఒకటవ పట్టణ CI SK.T. ఫిరోజ్ గారు, నరసరావుపేట రూరల్ CI M.V. సుబ్బారావు గారు, దాచేపల్లి CI M.రాజేష్ గారు మరియుపోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.























🚨 పల్నాడు జిల్లా పోలీస్ 🚨 పెట్టుబడుల కోసం అపరిచితుల మాటలు నమ్మొద్దు..! ▪️ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ లాభాలు వస్తాయని చె...
31/05/2026

🚨 పల్నాడు జిల్లా పోలీస్ 🚨
పెట్టుబడుల కోసం అపరిచితుల మాటలు నమ్మొద్దు..! ▪️ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ లాభాలు వస్తాయని చెప్పే ప్రకటనలను నమ్మవద్దు. ▪️ సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ లింకుల ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ▪️ రిజిస్ట్రేషన్ లేని యాప్‌లు, వెబ్‌సైట్లలో డబ్బులు పెట్టి మోసపోవద్దు. ▪️ తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పేవారిని నమ్మకండి. ▪️ అనుమానాస్పద లింకులు, QR కోడ్లు, APK ఫైళ్లు ఓపెన్ చేయవద్దు. ▪️ సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 కు కాల్ చేయండి లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి. జాగ్రత్తగా ఉండండి – మీ డబ్బు, మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది.



















#పల్నాడుపోలీస్

30/05/2026

//మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతున్న ప్రత్యేక కార్యాచరణ “ఆపరేషన్ దండయాన”. – పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి. కృష్ణారావు ఐపీఎస్ గారు,.//

🚩 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు,మహిళా మరియు శిశు భద్రత విభాగం ఐజీపీ B.రాజకుమారి ఐపిఎస్ గారి మార్గదర్శకత్వంలో పల్నాడు జిల్లా పోలీసులు మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల నివారణ, దర్యాప్తు, పర్యవేక్షణ మరియు వేగవంతమైన పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న “ఆపరేషన్ దండయాన” కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.

🔰 పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి. కృష్ణారావు ఐపీఎస్ గారు మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, బాధితులకు వేగవంతమైన న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అన్ని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

👉 "దండయాన" కార్యక్రమ ప్రధాన లక్ష్యాలు మరియు పోలీసు అధికారులకు ఆదేశాలు...

🫟 శక్తి బృందాలు :- మహిళల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లాలో మొత్తం 5 శక్తి బృందాలను ఏర్పాటు చేసి, శక్తి యాప్ వినియోగం, మహిళా భద్రత, సైబర్ నేరాలు మరియు కొత్త నేర ధోరణులపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,942 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

🫟 సాంకేతిక ఆధారిత భద్రతా చర్యలు:- ఈవ్ టీజింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా నిర్వహించడంతో పాటు, అల్లరి మూకలు మరియు నేరస్తుల కదలికలను నియంత్రించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలతో విస్తృత స్థాయి పెట్రోలింగ్ చేపడుతున్నట్లు తెలిపారు.

🫟 ఫాస్ట్ ట్రాక్ దర్యాప్తు :- మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులను ప్రాధాన్యత ఆధారంగా దర్యాప్తు చేసి, నిర్దేశిత గడువులోపు చార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2025 నుండి ITSSO సంబంధిత 100% కేసుల్లో 60 రోజుల లోపే చార్జ్ షీట్లు దాఖలు చేయబడినట్లు వెల్లడించారు.

🫟 కోర్టు మానిటరింగ్ సెల్ :- మహిళలపై జరిగిన ఘోర నేరాల్లో వేగవంతమైన విచారణలు మరియు దోష నిర్ధారణల కోసం ప్రత్యేక కోర్టు మానిటరింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో నమోదైన కేసుల్లో 30 దోష నిర్ధారణలు నమోదుకాగా, వాటిలో 15 కేసుల్లో జీవిత ఖైదు, మరో 6 కేసుల్లో 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు విధించబడినట్లు పేర్కొన్నారు.

🫟 ఆపరేషన్ ట్రేస్ :- తప్పిపోయిన బాలికల ఆచూకీ కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న “ఆపరేషన్ ట్రేస్” ద్వారా జూన్ 2024 నుండి ఏప్రిల్ 2026 వరకు నమోదైన 191 కేసుల్లో 190 మంది బాలికలను గుర్తించి కుటుంబాలకు చేర్చినట్లు తెలిపారు. మిగిలిన ఒక బాలికను కూడా త్వరలో గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. AI ఆధారిత CCTV-360 సాంకేతిక వ్యవస్థ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు.

🫟 లైంగిక నేరస్తుల పర్యవేక్షణ :- మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడిన నిందితులపై మొత్తం 144 SOS షీట్లు నిర్వహిస్తూ, వారి కదలికలు మరియు ప్రవర్తనపై నిరంతర నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్, సాంకేతిక పర్యవేక్షణ మరియు CCTV-360 వ్యవస్థ ద్వారా నిరంతర మానిటరింగ్ కొనసాగుతోందని పేర్కొన్నారు.

🫟 సఖి వన్ స్టాప్ సెంటర్:- హింస లేదా అమానుష ఘటనలకు గురైన మహిళలు, బాలికలకు ఒకే చోట వైద్య, న్యాయ, మానసిక మరియు పోలీస్ సహాయ సేవలు అందించేందుకు సఖి వన్ స్టాప్ సెంటర్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరమైన మహిళలు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

📞 హెల్ప్‌లైన్ నంబర్లు :
* చైల్డ్ హెల్ప్‌లైన్ – 1098
* మహిళా హెల్ప్‌లైన్ – 181
* అత్యవసర సేవలు – 112

👉 పల్నాడు జిల్లా పోలీసులు మహిళలు మరియు చిన్నారుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, నేరాల నివారణతో పాటు బాధితులకు తక్షణ సహాయం మరియు వేగవంతమైన న్యాయం అందించేందుకు కట్టుబడి ఉన్నారని జిల్లా ఎస్పీ శ్రీ బి. కృష్ణారావు ఐపీఎస్ గారు తెలిపారు. ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి, మహిళలు మరియు పిల్లల రక్షణకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని ఆయన కోరారు.
# Narasaraopet

🚩 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి ని పురస్కరించుకొని పల్...
28/05/2026

🚩 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు ఘనంగా నివాళులర్పించారు .

ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు IPS గారు మరియు ఇతర పోలీసు అధికారులు కలిసి ఎన్టీఆర్ గారి చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

🎤ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ

🔰1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నందమూరి తారక రామారావు గారు అసాధారణ క్రమశిక్షణ,పట్టుదలతో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా
ఎదిగారన్నారు.

🔰కేవలం సినీ రంగంలోనే కాకుండా, రాజకీయాల్లోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి అయ్యారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

🔰పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. క్రమశిక్షణ, సేవాభావం, ప్రజల పట్ల అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.

🔰ఆయనకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రదానం చేసిందన్నారు. ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది మే 28 వ తేదీన ఎన్టీఆర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.

🔰1996 జనవరి 18న ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ, నటుడిగా,మహోన్నత నాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. ఆయన ఆశయాలు, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధత నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమన్నారు.

🔰 ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్ పి గారితో పాటు అదనపు ఎస్పీ (అడ్మిన్) JV. సంతోష్ గారు,AR DSP మహాత్మా గాంధీ రెడ్డి గారు, MT RI యువరాజ్ గారు, వెల్ఫేర్ RI L. గోపీనాథ్ గారు, హోంగార్డ్ RI S. కృష్ణ గారు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






_*//గోవుల అక్రమ రవాణా,గోవధ మరియు అక్రమ వధశాలల నిర్వహణపై కఠిన చర్యలు – పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్ గార...
26/05/2026

_*//గోవుల అక్రమ రవాణా,గోవధ మరియు అక్రమ వధశాలల నిర్వహణపై కఠిన చర్యలు – పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్ గారు,.//*_

🚩 రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా పల్నాడు జిల్లాలో ఎవరైనా పశువుల అక్రమ రవాణా, గోవధ, జంతు హింస మరియు అనుమతులు లేకుండా అక్రమంగా వధశాలలు నిర్వహించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధానికి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్ గారు తెలిపారు. ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపారు.

📍జంతు సంక్షేమ పరిరక్షణ మరియు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాలపై (PCA Act,1960) ప్రజల్లో అవగాహన కల్పించడం,ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం, నిఘా పెంచడం,చెక్ పోస్ట్ ల ఏర్పాటు వంటి చర్యలు కొనసాగనున్నాయని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

📍 పల్నాడు జిల్లా నందు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 20 ప్రదేశాలలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయనున్నట్లు,ఈ చెక్ పోస్ట్ ల నందు పోలీసు, వెటర్నరీ,రెవిన్యూ మరియు యానిమల్ హస్బెండరీ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించనున్నారు.

📍 ఈ చెక్ పోస్ట్ లు ది.27.05.2026 వ తేదీ బుధవారం ఉదయం నుండి ది.28.05.2026 వ తేదీ అర్ధరాత్రి వరకు నిర్వహించనున్నారు.

📍జిల్లాలో ఏర్పాటు చేయనున్న చెక్‌పోస్టు లను బలోపేతం చేసి, ముఖ్య రహదారులు, గ్రామీణ మార్గాలు మరియు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

📍 వాహన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

📍అంతేకాకుండా సీసీ కెమెరాలు, మొబైల్
పెట్రోలింగ్, డ్రోన్ నిఘా వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ అక్రమ రవాణా మరియు గోవధను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

📍గోవుల అక్రమ రవాణా లేదా గోవధ పేరుతో ఎవరైనా అల్లర్లు,గొడవలు, తగాదాలు సృష్టించడం,మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం కూడా చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
కావున పల్నాడు జిల్లా ప్రజలు జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని సూచించారు.

📍 దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం మరియు వీడియోలను పోస్ట్ చేసిన యెడల వారి పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొనబడతాయని తెలిపారు.

📍ఇప్పటికే జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మత పెద్దలు, గ్రామ పెద్దలు మరియు ప్రజాప్రతినిధులతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి,సామాజిక మరియు మత సామరస్యాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

📍జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా పశువుల రవాణా,గోవధ లేదా అనుమతి లేని వధశాలలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

📍ప్రజలు పోలీసు శాఖకు సహకరించి జిల్లాలో శాంతి భద్రతలు,సామాజిక సామరస్యం మరియు జంతు సంక్షేమ పరిరక్షణకు తోడ్పడాలని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్ గారు కోరారు..

*పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం*
*నరసరావు పేట*

26/05/2026

// అంతర్ రాష్ట్ర ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 03 సవర్ల బంగారు చైను ను రికవరీ చేసిన చిలకలూరి పట్టణ పోలీసులు //

📍పల్నాడు జిల్లా నరసరావు పేట సబ్ డివిజన్ చిలకలూరి పేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి చిలకలూరి పేట పట్టణం నందు జరిగిన చైన్ స్నాచింగ్ పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు,ఇద్దరు దొంగలు ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి,వారిని అరెస్ట్ చెయ్యడం జరిగింది.

🚩 ఈ రోజు ది.25.05.2026 వ తేదీ చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుల అరెస్ట్ వివరాలను వెల్లడించిన చిలకలూరిపేట పట్టణ సిఐ పి.రమేష్ గారు

👉 ఈ సందర్భంగా సీఐ గారు మాట్లాడుతూ....

• నిందితుడు షేక్ కృపారావు @ భాష, తండ్రి హుస్సేన్,
37సం,కులం : దూదేకుల,
వడ్డీ పాలెం, విజయనగర్ కాలనీ, ఒంగోలు టౌన్, ప్రకాశం జిల్లా (A1) అను అతనిపై ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో 36 కేసులు నమోదు అయినట్లు, వాటిలో చైన్ స్నాచింగ్ కేసులు మరియు గంజాయి కేసులు ఉన్నట్లు, ఇతనిపై ఒంగోలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు సస్పెక్ట్ షీట్ ఉన్నట్లు తెలిపారు.

• మల్లెల కొండారెడ్డి తండ్రి వెంకటనారాయణ రెడ్డి, కులం:రెడ్డి, 41 సం, చాకిరాల గ్రామం, కనిగిరి మండలం, ప్రకాశం జిల్లా(A2) హనుమద్దాయి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో 41 కేసులు నమోదు అయినట్లు వాటిలో చైన్ స్నాచింగ్ కేసులు మరియు మోటార్ సైకిల్ దొంగతనాల కేసులు ఉన్నట్లు, ఇతనిపై కనిగిరి పోలీస్ స్టేషన్ నందు సస్పెక్ట్ షీట్ ఉన్నట్లు తెలిపారు.

• పోలీసులు వీరి వద్ద నుండి 03 సవర్ల బంగారు చైన్ రికవరీ చేసి రిమాండ్ కు పంపడమైనది.

🔰 కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు

ఫిర్యాది అయిన జయరాం విజయలక్ష్మి భర్త వీరయ్య,56సం,
కులం : వైశ్య, బ్యాంకు కాలనీ చిలకలూరిపేట పట్టణం అను ఆమె ది.03/01/2026 వ తేదీన ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద గల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి దర్శనం అనంతరం తన బంధువైన శ్రీనివాస రావు మోటార్ సైకిల్ పై బ్యాంకు కాలనీలో మెయిన్ రోడ్డు మీద దింపగా ఫిర్యాది తన ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా ఫిర్యాది వెనక వైపు నుండి గుర్తు తెలియని వ్యక్తి (A1) తన ముఖానికి మాస్క్ వేసుకొని హెల్మెట్ పెట్టుకుని మోటార్ సైకిల్ మీద వచ్చి ఫిర్యాది మెడలో ఉన్న మూడు సవర్ల బంగారు చైన్ లాక్కొని వెళ్ళగా చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇచ్చిన రిపోర్టుకు గాను Cr.No : 01/2026 U/Sec 304(2) BNS గా కేసు నమోదు చేసినట్లు, A1 దొంగతనం చేయుటకు A2 నెంబర్ లేని యూనికాన్ మోటార్ సైకిల్ ఇచ్చినట్లు, దొంగతనం చేసిన తరువాత చైను ని కనిగిరి నందు ఉన్న A2 అయిన కొండారెడ్డి వద్ద ఉంచినట్లు, తరువాత A1 అయిన షేక్. కృపారావు @ బాషా కర్ణాటక రాష్ట్రంలో చిత్రదుర్గ మరియు గౌరూబీదానూరు పోలీస్ స్టేషన్ పరిధిలలో కొండారెడ్డి ఇచ్చిన మోటార్ సైకిల్ తో చైన్ స్నాచింగ్ చేయగా కర్ణాటక పోలీస్ వారు ఇద్దరినీ పట్టుకొని జైలుకు పంపినట్లు, జైలు నుండి వచ్చిన తరువాత చిలకలూరిపేట పట్టణ పోలీస్ వారికి రాబడిన సమాచారం మేరకు చిలకలూరిపేట పట్టణ సిఐ గారి పర్యవేక్షణలో రెండు బృందాలు ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు ముద్దాయిలను తన సిబ్బంది సహాయంతో ది.25.05.2026 వ తేదీన ఉదయం 10:50 గంటలకు APSRTC బస్టాండ్ వద్ద పట్టుకొని భారీ వద్దనుండి మూడు సవర్ల బంగారం రికవరీ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు నందు హాజరు పరచడం జరిగింది.

👉 ఈ దర్యాప్తులో నిందితులను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన చిలకలూరిపేట టౌన్ ఎస్సై శ్రీ A. సోమేశ్వర రావు గారిని మరియు పోలీసు సిబ్బందిని సిఐ P. రమేష్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

పోలీస్ సిబ్బందిలో మానసిక దృఢత్వం పెంపొందించేందుకు హార్ట్ ఫుల్‌నెస్ మెడిటేషన్ శిక్షణ📍 జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోపోలీస్ ...
25/05/2026

పోలీస్ సిబ్బందిలో మానసిక దృఢత్వం పెంపొందించేందుకు హార్ట్ ఫుల్‌నెస్ మెడిటేషన్ శిక్షణ

📍 జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోపోలీస్ అధికారులు మరియు సిబ్బందిలో మానసిక ప్రశాంతత,ఒత్తిడి నియంత్రణ,సేవా సామర్థ్యాల పెంపు లక్ష్యంగా నిర్వహించిన మూడు రోజుల “హార్ట్ ఫుల్‌నెస్ మెడిటేషన్ శిక్షణ కార్యక్రమం” ఈరోజు ప్రారంభమైనది.

📍జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు పల్నాడు జిల్లాలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమాన్ని సబ్ డివిజన్ లోని డీఎస్పీ లు పర్యవేక్షించారు.

📍రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచనలు, రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖలో విధి నిర్వహణ సమయంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడులు,సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

📍ఈ మూడు రోజుల శిక్షణలో హార్ట్ ఫుల్‌నెస్ ఇన్స్టిట్యూట్ నిపుణులు పోలీస్ సిబ్బందికి ధ్యానం, యోగా, మానసిక నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు.

ముఖ్యంగా :

* విధి నిర్వహణలో ఒత్తిడిని తగ్గించే పద్ధతులు,భావోద్వేగ నియంత్రణ, మానసిక ప్రశాంతత సాధన, ప్రజలకు మెరుగైన సేవలందించే విధానాలు, ధ్యానం ద్వారా వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.

📍దీనిలో ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించి, మానసిక స్థిరత్వం కోసం ప్రతిరోజూ ధ్యానం యొక్క ఆవశ్యకతను సూచించారు.

📍ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు(నరసరావు పేట,సత్తెనపల్లి,గురజాల సబ్ డివిజన్) సిబ్బందితో పాటు జిల్లా పోలీస్ కార్యాలయ AR సిబ్బంది,అధికారులు పాల్గొన్నారు.

📍జిల్లా వ్యాప్తంగా హోంగార్డు స్థాయి నుండి అదనపు ఎస్పీ స్థాయి వరకు అన్ని స్థాయి పోలీస్ సిబ్బందికి దశలవారీగా ఈ హార్ట్ ఫుల్‌నెస్ మెడిటేషన్ శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. Dgp Andhra Pradesh AP Police

🚩 ఈ రోజు దాచేపల్లి నందు మాదక ద్రవ్యాల నిర్మూలన,రోడ్ సేఫ్టీ,ఈవ్ టీజింగ్,మహిళల భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన దాచే...
24/05/2026

🚩 ఈ రోజు దాచేపల్లి నందు మాదక ద్రవ్యాల నిర్మూలన,రోడ్ సేఫ్టీ,ఈవ్ టీజింగ్,మహిళల భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన దాచేపల్లి సిఐ శ్రీ M.రాజేష్ గారు.

✓ పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు దాచేపల్లి లైబ్రరీ సెంటర్ నందు గల షాదిఖానా నందు ఈ రోజు స్థానిక మహిళలతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐ గారు మాట్లాడుతూ ...

📢 గ్రామాలలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

🚭 మాదక ద్రవ్యాల వినియోగం - మానవ మనుగడకు హానికరం 🚭

👉 మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికి, కుటుంబాలకు, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అందువలన ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉండాలని సూచించారు.

👉 గ్రామంలోని యువత ప్రవర్తన, నడవడిక తదితర అంశాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని,ప్రస్తుత సమాజంలో యువత చాలా తేలికగా మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నట్లు తెలిపారు.

👉 వీరిలో 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు వారు ఎక్కువగా ఉంటున్నారని వారు గంజాయి,డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడి మానసిక నియంత్రణ కోల్పోయి తమ వ్యసనాలను తీర్చుకోవడానికి నేర ప్రవృత్తి వైపు మళ్లి నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు.
కావున తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని తెలిపారు.

👉 మీ పరిసరాలలో గంజాయి మాదకద్రవ్యాలను ఎవరైనా వినియోగించిన లేదా విక్రయించిన సదరు సమాచారాన్ని దగ్గరలోని పోలీసు వారికి కానీ 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు గాని తెలియజేయాలని తెలిపారు.

🚨 “ రోడ్డు భద్రత అందరి బాధ్యత – నియమాలు పాటిద్దాం,ప్రాణాలు కాపాడుకుందాం ” 🚨..

రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పిస్తూ ..

🔹హెల్మెట్, సీట్‌ బెల్ట్ వాడకం పై అవగాహన కల్పించడం జరిగింది.

🔹ఓవర్‌ స్పీడ్, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల వచ్చే ప్రమాదాలు గురించి వివరించడం జరిగింది.

🔹 అదేవిధంగా మైనర్లు ఎట్టి పరిస్థితులలో డ్రైవింగ్ చేయరాదని పిల్లలపై ఉన్న మమకారంతో ఎవరు వాహనాలను ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించారు.

గౌరవమే మన సంస్కృతి - వేధింపులు కాదు
👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలికల మరియు మహిళల భద్రత కొరకు శక్తి యాప్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

👉 ఈ యాప్ మహిళల మరియు బాలికల భద్రత కొరకు ప్రత్యేకంగా రూపొందించినట్లు, అత్యవసర సమయంలో మహిళలు శక్తి SOS యాప్ యొక్క వినియోగం గురించి తెలియజేశారు.

👉 శక్తి యాప్ ఉపయోగాల గురించి బాలికలకు, విద్యార్థులకు,మహిళలకు అవగాహన కల్పించడం కొరకు శక్తి బృందాలు స్కూలు మరియు కాలేజీలలో కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.

🔸 బాలికలపై నేరాలు, వాటి నివారణ, సంభవించిన పక్షంలో స్పందించాల్సిన తక్షణ చర్యలు, ''గుడ్ టచ్ - బ్యాడ్ టచ్" వంటి కీలక అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.

🔹 వేధింపులు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన అంశాలు తెలియజేశారు.

🔸 మహిళలు,బాలికలు,
విద్యార్థినులు సొంతంగా తమ భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆపద సమయాల్లో పోలీస్ వారి సహాయం పొందటానికి 112 నెంబర్ లేదా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ కు కాల్ చేసే విధంగా గ్రామాలలో అవగాహన కల్పించాలని కోరారు.

🔹 మహిళ కానిస్టేబుళ్లతో కూడిన శక్తి బృందాల సేవలు గురించి వివరించారు.

👉 శక్తి యాప్ ఉపయోగం గురించి సచివాలయం మహిళా కానిస్టేబుల్స్ గ్రామాలలో మహిళలకు అవగాహన కల్పించాలని కోరారు.

👉 ఈ కార్యక్రమంలో దాచేపల్లి సిఐ M.రాజేష్ గారితో పాటు దాచేపల్లి ఎస్సై G.పాపారావు గారు,Sk. ఖాసిం వలి గారు, షాది ఖానా ప్రెసిడెంట్ పెదలాలా గారు,స్థానిక మహిళలు (100మంది)మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

🚨 పల్నాడు జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు 🚨శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు ప్రజల భద్రత లక్ష్యంగా జిల్లావ్యాప్తం...
24/05/2026

🚨 పల్నాడు జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు 🚨

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు ప్రజల భద్రత లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్స్‌కు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు.

నరసరావుపేట II టౌన్, దాచేపల్లి, క్రోసూరు, నాదెండ్ల, చిలకలూరిపేట టౌన్, గురజాల పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్స్‌కు చట్టపరమైన అవగాహన కల్పిస్తూ, సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

✅ ప్రజల భద్రతే మా లక్ష్యం
✅ నేర నియంత్రణే మా బాధ్యత

23/05/2026

🚩 //శాంతి భద్రతల పరిరక్షణ,చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా సత్తెనపల్లి పట్టణంలోని 21 వ వార్డు, కొత్తపేట నందు విస్తృత కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు.... //

🔰 పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం సత్తెనపల్లి సబ్ డివిజన్ సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లోని 21 వ వార్డు, కొత్తపేట నందు సత్తెనపల్లి సబ్ డివిజన్ ఇంచార్జ్ DSP M. హనుమంత రావు గారి పర్యవేక్షణలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు,సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

🔰 ఈ కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం నందు పోలీసు అధికారులను మరియు సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్స్,పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా... ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

🔰ఈ తనిఖీ లలో 21 వ వార్డు కొత్తపేట నందు సరైన పత్రాలు లేని
ద్విచక్ర వాహనాలు- 89
స్వాధీనం చేసుకున్నారు.

🔰 ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ వార్డు లోని ప్రజలతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

🔰 హెల్మెట్ వాడకం గురించి,వార్డు లోని పరిస్థితుల గురించి సత్తెనపల్లి ఇంచార్జ్ DSP M. హనుమంతరావు గారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించి, మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనర్థాల గురించి వివరించారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నట్లయితే 112 కు కాల్ చేయాలని తెలిపారు.

🔰రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు DSP గారు తెలిపారు.

🔰 అంతేకాకుండా వార్డు లోని రౌడీషీటర్లు,ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

🔰 పాత కేసుల నిందితుల తో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

🔰 వార్డులలో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని,గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, గొడవలు సృష్టించే వారి మీద జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం చట్ట పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

🔰 21 వ వార్డు, కొత్తపేట నందు జరిగిన కార్డన్ & సెర్చ్ కార్యక్రమంలో సత్తెనపల్లి ఇంచార్జ్ DSP M. హనుమంతరావు గారితో పాటు సత్తెనపల్లి టౌన్ సీఐ నాగల్లేశ్వర రావు గారు, సత్తెనపల్లి రూరల్ సర్కిల్ సీఐ
P.కిరణ్ గారు, పెదకూరపాడు సర్కిల్ సిఐ P.సురేష్ గారు,SI లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
#సత్తెనపల్లి_పోలీసులు























Address

Narasaraopet

Alerts

Be the first to know and let us send you an email when Palnadu Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Palnadu Police:

Share