15/05/2026
💥💥 ఫ్లాష్... ఫ్లాష్... ఫ్లాష్... 💥💥
నంద్యాల పట్టణ ప్రజలకు తెలియచేయడం ఏమనగా స్వచ్ఛ సర్వేక్షన్ 2025- 26 కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ 100% నియంత్రించుటలో భాగంగా మీ వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్లు కాల్వల్లో కానీ రోడ్లపై, ఖాళీ స్థలాల్లో పడవేసి పర్యావరణానికి హానీ కలిగించకుండా ఉండుటలో భాగంగా మీరు వాడి పడేసిన మరియు వాడుతున్న ప్లాస్టిక్ కవర్లను మున్సిపాలిటి వారికి అప్పచెప్పినట్టు అయితే 2 KG ల ప్లాస్టిక్ కవర్లకు 1 KG బాంబినో సేమియా, 1 KG ప్లాస్టిక్ కవర్లకు 1 KG చెక్కెర, అర KG ప్లాస్టిక్ కవర్లకి 6 కోడి గుడ్లు అందచేయడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్లాస్టిక్ కవర్లు నియంత్రించుటలో మున్సిపల్ సిబ్బంది వారికి సహకరించవల్సిందిగా ఇందు మూలంగా తెలియచేయడం జరుగుతుంది.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్:
మురళీధర్ SS - 9849906654
శివ ప్రసాద్ రెడ్డి SI - 9849908002
లక్ష్మీ నారాయణ SI - 9849907458
ఇట్లు
మున్సిపల్ కమిషనర్
నంద్యాల పురపాలక సంఘం.