TDP Nandyal

TDP Nandyal CBN Army - Social media Team of Telugu Desam party

03/12/2025
నంద్యాలలో పవిత్ర జగజ్జనని అమ్మవారి దేవాలయం ఉన్న జగజ్జనని నగర్ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది - NMD ఫిరోజ్ఏళ్ళ తరబడి ప్రజలు...
24/07/2024

నంద్యాలలో పవిత్ర జగజ్జనని అమ్మవారి దేవాలయం ఉన్న జగజ్జనని నగర్ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది - NMD ఫిరోజ్

ఏళ్ళ తరబడి ప్రజలు జీవిస్తున్న రోడ్లు లేక,డ్రైనేజీ కాల్వలు లేక, ఉన్న రోడ్లన్నీ గుంతల మయం, మురికి నీళ్లు రోడ్ల పై ప్రవహిస్తూ,ఇళ్ల మధ్య ఓపెన్ డ్రైనేజీ నీటి వల్ల రోగాలు, వీధి కుక్కలు పందుల భేడదతో జగజ్జనని నగర్ ప్రాంత ప్రజలు బాధలు వర్ణనతీతం.

కొంతమంది భూ బకాసురులు ఆక్రమ వెంచర్లు వేసి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు పొందకుండా ఎలాంటి సౌకర్యలు కల్పించకుండా పేద మధ్యతరగతి ప్రజలను సొంతింటి ఇళ్లు /ప్లాట్ పేరుతో లక్షలు కాజేసి దగా చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం - NMD ఫిరోజ్ గారు, నంద్యాలజిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి

నంద్యాల పట్టణంలోని వార్డు పర్యటనలో భాగంగా NMD ఫిరోజ్ గారు 6వ వార్డు చేరుకోవడంతో వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు

NMD ఫిరోజ్ గారు జగజ్జనని నగర్ , ఆత్మకూరు బస్టాండ్ ఏరియా , ఫాతిమా మసీదు లైన్ వీధి వీధినా పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ వార్డు నందు ఏళ్ళ తరబడి ప్రజలు జీవిస్తున్న రోడ్లు లేక,డ్రైనేజీ కాల్వలు లేక, ఉన్న రోడ్లన్నీ గుంతల మయం, మురికి నీళ్లు రోడ్ల పై ప్రవహిస్తూ,ఇళ్ల మధ్య ఓపెన్ డ్రైనేజీ నీటి వల్ల రోగాలు, వీధి కుక్కలు పందుల భేడదతో బాధపడుతున్నమని ప్రజలు తెలియజేయడంతో వెంటనే అధికారులకు సమస్యలను తెలియజేసి వాటిని పరిష్కరించాలని కోరారు మరియు రాబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏజెండాలో తప్పక చేర్చాలని కోరారు.

ఈ సందర్భంగా నంద్యాల ప్రజానీకానికి వెంచర్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వెంచర్ లో స్థలం కొనేటప్పుడు వాటిలో రోడ్లు , కాలువలు , వాటర్ పైప్ లైన్లు సరిగ్గా ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని ప్రభుత్వ అప్రూవల్ ఉందో లేదో తెలుసుకొని కొనాలని సూచించారు

కొంతమంది భూ బకాసురులు ఆక్రమ వెంచర్లు వేసి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు పొందకుండా ఎలాంటి సౌకర్యలు కల్పించకుండా పేద మధ్యతరగతి ప్రజలను సొంతింటి ఇళ్లు /ప్లాట్ పేరుతో లక్షలు కాజేసి దగా చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటమాన్నారు..

ఈ వార్డు నందు ఖాళీ స్థలాలలో మురికి నీరు నిలవ ఉండడంతో అక్కడ నివసించే ప్రజానీకానికి ఇబ్బందిగా మరియు వ్యాధులు సోకే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే కాళీ స్థలాలు ఉన్నాయో వారు వెంటనే నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలని లేకపోతే వారికీ ప్రభుత్వం తరుపున నోటీసులు అందజేసి కఠిన చర్యలు తీసుకుంటామని హేచ్చరించారు.

అనంతరం వార్డు ప్రజలు తమ సమస్యలు విని సానుకూలంగా స్పందించిన NMD ఫిరోజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 6 వార్డు బూత్ కన్వీనర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు మరియు మున్సిపల్ , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

నంద్యాల పుణ్యక్షేత్రల నిలయం & వ్యాపార కేంద్రమైన పట్టణం పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని రైల్వేస్టేషన్నందు అభివృద్...
19/07/2024

నంద్యాల పుణ్యక్షేత్రల నిలయం & వ్యాపార కేంద్రమైన పట్టణం పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని రైల్వేస్టేషన్నందు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, నూతనంగా నిర్మిస్తున్న 30 అడుగుల వెడల్పు రోడ్డును 40 అడుగులకు పెంచి నిర్మించాలని రైల్వే ఉన్నత అధికారులను కోరిన NMD ఫిరోజ్ గారు.

🔷నంద్యాల పర్యటనకు విచ్చేసిన రైల్వే ఉన్నత అధికారులను NMd ఫిరోజ్ గారు కలిసి మాట్లాడుతూ పుణ్య క్షేత్రాలు మరియు వ్యాపార పరంగా ముఖ్య కేంద్రమైన నంద్యాల రైల్వేస్టేషన్ నందు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రయాణికుల కొరకు 2వీలర్, 4 వీలర్ పార్కింగ్,కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

🔷 అదే విధంగా పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నూతనంగా నిర్మిస్తున్న 30 అడుగుల వెడల్పు రోడ్డును 40 అడుగులకు పెంచి నిర్మించాలని రైల్వే ఉన్నత అధికారులను కోరారు.

🔷రోడ్ల పై చిన్న చిన్న షాపులు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్థులకు ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా జిల్లా పరిషద్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర మంత్రివర్యులు NMD ఫరూక్ గారు పాల్గొన్నారు*🔷...
19/07/2024

ఉమ్మడి కర్నూలు జిల్లా జిల్లా పరిషద్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర మంత్రివర్యులు NMD ఫరూక్ గారు పాల్గొన్నారు*

🔷ఈ సమావేశంలో రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు NMD ఫరూక్ గారు మాట్లాడుతూ ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా అభివృద్ధి కోసం చేప‌ట్టాల్సిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌డం జ‌రిగింది.

🔷ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న అన్ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తాన‌ని మంత్రి హామీ ఇచ్చారు.

🔷ఈ స‌మావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ వెంకటేష్,ఎంపీ బైరెడ్డి శ‌బ‌రి,ఉమ్మడి కర్నూలు జిల్లాశాస‌న‌స‌భ్యులు, కర్నూలు నంద్యాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్, ఇత‌ర ఉన్న‌తాధికారులు, జెడ్పీ స‌భ్యులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

*ముచ్చుమర్రి మైనర్ బాలిక కుటుంబానికి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందజేసిన   రాష్ట్ర మంత్...
19/07/2024

*ముచ్చుమర్రి మైనర్ బాలిక కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు NMD ఫరూక్ గారు*

*నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో మైనర్ బాలిక వాసంతి అదృశ్యం కేసు నేపథ్యంలో వారి కుటుంబం వద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కును రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ గారు అందజేశారు*

*ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు,జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా గారు, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి గారు, ఎమ్మెల్యే గిత్త జయసూర్య తదితరులు పాల్గొన్నారు.

18/07/2024
*నంద్యాల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన  శ్రీమతి రాజకుమారి గనియా IAS గారిని తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్...
18/07/2024

*నంద్యాల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి రాజకుమారి గనియా IAS గారిని తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి NMD ఫిరోజ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పాగుష్పం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.*

🔷 *ఈ సందర్భంగా NMD ఫిరోజ్ గారు నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి పై పలు విషయాలను కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది*

*మొహర్రం ఇస్లామిక్ నూతన సంవత్సరంలో నంద్యాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మదరాసా దారుల్ ఉలూం సాబీలుల్ హుదా  మౌలానాలు & ...
18/07/2024

*మొహర్రం ఇస్లామిక్ నూతన సంవత్సరంలో నంద్యాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మదరాసా దారుల్ ఉలూం సాబీలుల్ హుదా మౌలానాలు & విద్యార్థులు 2రోజుల పాటు ఉన్న నఫీల్ ఉపవాసాల ముగింపు ఇఫ్తార్ కార్యక్రమంలో NMD ఫిరోజ్ గారు పాల్గొన్నారు*

🔷*ఈ సందర్భంగా ఇఫ్తార్ సమయం నందు నిర్వహించిన ప్రత్యేక దువా కార్యక్రమం లో NMd ఫిరోజ్ గారు పాల్గొని, మగ్రీబ్ నమాజ్ అనంతరం మదరాసా విద్యార్థులతో & వారి గురువులతో ఆత్మీయంగా మాట్లాడారు. మదరాసా నిర్వాహకులు NMd ఫిరోజ్ గారికి ఘనంగా సత్కరించడం జరిగింది.*

Address

Nandyal
Nandyala
518501

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Nandyal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to TDP Nandyal:

Share