TDP Adda Nandyala Gadda

TDP Adda Nandyala Gadda Jai TDP
Jai Janma Bhoomi
Jai Nara Chandra Babu Naidu
Jai Nara Lokesh
Johar Anna NTR

నంద్యాల : 02-06-2026ఎస్సీల సంక్షేమం, చట్టాల అమలుపై సమీక్షఈ రోజు (02-06-2026) మంగళవారం నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్...
02/06/2026

నంద్యాల : 02-06-2026
ఎస్సీల సంక్షేమం, చట్టాల అమలుపై సమీక్ష
ఈ రోజు (02-06-2026) మంగళవారం నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ శ్రీ కె.ఎస్. జవహర్ ఆధ్వర్యంలో ఎస్సీలకు సంబంధించిన చట్టాల అమలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు ఇతర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఎస్సీ కమిషన్ సెక్రటరీ ఎస్. చిన్న రాముడు, కమిషన్ సభ్యులు మేకల బిక్షమ్, డా. పి. గౌతం రాజు, డీఆర్వో రామునాయక్, ఆర్డీఓలు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
డీఐపీఆర్వో, నంద్యాల.

🔥 తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి."నేను అసలే మొండిదాన్ని... మంచిదాన్ని కాదు. నేను ...
02/06/2026

🔥 తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

"నేను అసలే మొండిదాన్ని... మంచిదాన్ని కాదు. నేను గెలిచాక ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రాకు పార్సిల్ పంపుతా" అంటూ కవిత చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని తీవ్రంగా ఖండిస్తుండగా, మరికొందరు రాజకీయ సందర్భంలో చూడాలని అంటున్నా రు.

👉 ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి, ప్రాంతీయ సామరస్యానికి ఎంతవరకు మంచివి?
👉 రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై మరింత బాధ్యత ఉండాలా?

మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి 👇

🔥 తెలంగాణపై పవన్ కళ్యాణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్!తెలంగాణ ఏర్పాటును గతంలో వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హైదర...
02/06/2026

🔥 తెలంగాణపై పవన్ కళ్యాణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్!

తెలంగాణ ఏర్పాటును గతంలో వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హైదరాబాద్‌లో "నవనిర్మాణ సభ" నిర్వహించడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

📌 ముఖ్యాంశాలు:
✅ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు.
✅ తెలంగాణ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసేలా గతంలో చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
✅ బీజేపీతో లోపాయికారీ ఒప్పందం నేపథ్యంలోనే తెలంగాణలో సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
✅ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పగించిన బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు.
✅ విశాఖ ఉక్కు కర్మాగారం వంటి కీలక సమస్యలపై పోరాడకుండా తెలంగాణలో రాజకీయాలు చేయడం సరైంది కాదన్నారు.

🗣️ "తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తి ముందుగా క్షమాపణ చెప్పాలి" అని మంత్రి స్పష్టం చేశారు.

ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి 👇

కర్నూలు జిల్లా...ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తుల ధ్వంసం...సీసీ కెమెరాల ఆధారంగా 18 మంది గుర్తింపు, అరెస్టు.ప్రభుత్వ, ప్ర...
02/06/2026

కర్నూలు జిల్లా...

ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తుల ధ్వంసం...

సీసీ కెమెరాల ఆధారంగా 18 మంది గుర్తింపు, అరెస్టు.

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం సహించం :

కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్.

కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు నడిరోడ్డుపై తీసుకెళ్లిన పోలీసులు

ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవాల సందర్భంగా కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు బస్సుల అద్దాలు ధ్వంసం చేసి నష్టం కలిగించిన ఘటనపై కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు మరియు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఘటనలో పాల్గొన్న 18 మంది వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశారు.

కోర్టుకు తరలించారు.

ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు.

విజయోత్సవాలు, పండుగలు, ఇతర వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు

నార్వేలో టీడీపీ జెండా రెపరెపలు..!ఐక్యరాజ్యసమితి మహిళా ప్రతినిధి బృందంలో భాగంగా నార్వేలో పర్యటిస్తున్న నంద్యాల ఎంపీ, టీడీ...
01/06/2026

నార్వేలో టీడీపీ జెండా రెపరెపలు..!

ఐక్యరాజ్యసమితి మహిళా ప్రతినిధి బృందంలో భాగంగా నార్వేలో పర్యటిస్తున్న నంద్యాల ఎంపీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరికి అక్కడి టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

"ప్రాంతాలు వేరైనా... మనసులు ఒక్కటే. దేశాలు వేరైనా... తెలుగుదేశం కుటుంబం ఒక్కటే" అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.

నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్‌లో ఉన్న దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహన్ని ధ్వంసం ...
31/05/2026

నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్‌లో ఉన్న దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహన్ని ధ్వంసం చేయబడిన ఘటన అత్యంత విచారకరం మరియు ఖండనీయమైన సంఘటన

ఈ దుర్ఘటనకు సంబంధించి నంద్యాల పట్టణంలోని బైటిపేటకు చెందిన చాకలి జంబులయ్య (47) అనే వ్యక్తి నంద్యాల 41వ వార్డుకు చెందిన వైసీపీ పార్టీ నాయకుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.ఇలాంటి సంఘటనలు సమాజంలో ఉద్రిక్తతలకు దారితీయకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

రాజకీయాలకు అతీతంగా నంద్యాల ప్రజలందరూ శాంతి, సామరస్యాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాము,పోలీసుల విచారణకు సహకరించాలని మరియు వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు ఎలాంటి వదంతులను నమ్మవద్దని నంద్యాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము

ఇట్లు,
Nmd ఫిరోజ్,
ప్రధాన కార్యదర్శి,
తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా

శాంతి భద్రతలు విఘాతం కలిగించేందుకు జగన్ యత్నిస్తున్నారు :- మంత్రి నారా లోకేష్గొడ్డలి పార్టీ కార్యకర్తలను సైకో జగన్ రంగంల...
31/05/2026

శాంతి భద్రతలు విఘాతం కలిగించేందుకు జగన్ యత్నిస్తున్నారు :- మంత్రి నారా లోకేష్

గొడ్డలి పార్టీ కార్యకర్తలను సైకో జగన్ రంగంలోకి దింపారు

జగన్నాటకాలు చూసి జనం ఛీకొట్టినా.. డ్రామాలు మానడం లేదు

నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి వైసీపీ నేతల అనుచరుడు

వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేసిన జమ్ములయ్య వైసీపీ నేతల అనుచరుడని తేల్చారు

ఎన్నిసార్లు దొరికిపోయినా కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా? : మంత్రి నారా లోకేష్

కార్యకర్తా! ఇప్పటికైనా నీ విలువ తెలుసుకో..నిన్న సాక్షాత్తు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కల్గిన  రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్ర...
31/05/2026

కార్యకర్తా! ఇప్పటికైనా నీ విలువ తెలుసుకో..

నిన్న సాక్షాత్తు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కల్గిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే అన్ని నినాదాలు పక్కనెట్టి "జై కార్యకర్త" అన్నారంటే నువ్వు ఎంత విలువైన వాడివో అర్థం చేసుకో.

నియోజకవర్గంలో వాడి, వీడి, మరొక్కడి గురించి మరీ సద్ది కూడు కట్టుకొని వెళ్లి నాయకుడి చెవుల్లో కట్టుకథలు చెప్పి మీ కాలం వృధా చేసుకోమాకండి. పార్టీ జెండా పట్టావు అంటేనే పార్లమెంట్ స్థాయిలో నీ దమ్ము ఎంటో చూపించే పనిలో ఉండాలి. ఎవడో వత్తాడు నీ కడుపు నింపి కుర్సిలో కూర్సోబెడతాడు అనే ఊహలు మాని తలకు రుమాల సుట్టి మూతి మీద ఉన్న మీసం మెలేయ్.

గ్రామాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలందరూ ఐక్యమత్యంగా ఉండాలి. కలిసి కట్టుగా ఫలాలైనా, ఫలితాలైనా, ప్రజాసేవ అయినా పంచుకొనేలా మెలగండి. అప్పుడేగా పైన కుర్సిలో ఉన్న నాయకుడు మీ గ్రామానికి,మీకోసం పరుగెట్టుకుంటూ వచ్చేది.

కార్యకర్త! నీకు మించిన స్ట్రాటజిస్ట్ గానీ, నీకు మించిన రౌడీ గానీ, నీకు మించిన తోపుగాని, నీకు మించిన ప్రజా సేవకుడు గానీ, నీకు మించిన జన బలం ఉన్నోడుగాని, నీకు మించిన దాన గుణం ఉన్నోడుగాని, నీకు మించిన మాటకారితనం ఉన్నోడుగాని, నీకు మించిన సోగ్గాడు గానీ నియోజకవర్గంలోనే లేడని తెలుసుకొని మసలుకో.

ఎలాంటి కల్మషం లేకుండా త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఒక నాయకుడిలా ఆలోచిస్తూ అడుగులు ఐకమత్యంతో వెయ్ ఆ ఆకాశమే దిగిరాక పోదా నీ పాదాల మీద వర్శించక పోదా!

లేయ్! ప్రణాళికలు రచించు వాటిని నెరవేర్చే నాయకుడిని, పార్టీని వెతుక్కో. శుక్ల పక్ష చంద్రుడిలా వికసించు.

#ఎవడోవేసేచిల్లరడబ్బులకునీఆత్మగౌరవంతాకట్టుపెట్టొద్దు
#చీకట్లోరాజకీయవ్యభిచారంచేసేనాయకులకంటేకార్యకర్తలగొగొప్పోడనిఅనుకుంటూఅడుగులుముందుకువేగంగావేగంగాకదుపు.
#జై_కార్యకర్త

మీ సోదరుడు
పరమేశ్వర రెడ్డి చిట్టెం
టీడీపీ రాష్ట్ర తెలుగుయువత అధికార ప్రతినిధి, బనగానపల్లె నియోజకవర్గం, నంద్యాల జిల్లా

31/05/2026

ఎవడిచ్చాడ్రా డబ్బు :- శాప్ చైర్మన్

Address

Nandyal
518501

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Adda Nandyala Gadda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share