Telugu Desam Party: Nandigama

Telugu Desam Party: Nandigama Official Page of TDP Nandigama

02/06/2026

కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. సింహాచలం కోరిన మేరకు సొంతఇల్లు, కుళాయి సదుపాయం కల్పిస్తానని భరోసా ఇచ్చారు.






Tangirala sowmya

02/06/2026

కల్లు గీత కార్మికుడు సింహాచలం తో ముచ్చటిస్తూ తాటి చెట్ల నిర్వహణ, కల్లు సేకరణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు..








Tangirala sowmya

ఓటరు జాబితా సవరణపై సీఎం చంద్రబాబు గారు కీలక భేటీగుంటూరు జిల్లా, మంగళగిరి, టీడీపీ కేంద్ర కార్యాలయం, 02/06/2026.ఓటరు జాబిత...
02/06/2026

ఓటరు జాబితా సవరణపై సీఎం చంద్రబాబు గారు కీలక భేటీ

గుంటూరు జిల్లా, మంగళగిరి, టీడీపీ కేంద్ర కార్యాలయం, 02/06/2026.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే సర్‌పై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంతో పాటు సంస్థాగత నిర్మాణంపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించారు.

అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాలో మిస్ కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు.

బూత్ స్థాయి నుంచి పకడ్బందీగా ఓటరు నమోదు, సవరణ చేపట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

18 ఏళ్లు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.

డూప్లికేట్, మరణించిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు.

ఇంటింటి సర్వే ద్వారా కచ్చితమైన ఓటరు జాబితా రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.

బూత్ కమిటీలను బలోపేతం చేసి పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేయాలన్నారు.

ఓటరు జాబితానే ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయిస్తుందని సీఎం అన్నారు.

ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు కూడా హాజరై సూచనలు చేశారు.

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

సవరణలో అధికారులకు కార్యకర్తలు పూర్తిగా సహకరించాలని పిలుపునిచ్చారు.








Tangirala sowmya

SIRపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్. హాజరై దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వర్క్ షాప్ లో ప...
02/06/2026

SIRపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్. హాజరై దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వర్క్ షాప్ లో పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పరిశీలకులు,





Tangirala sowmya

02/06/2026

డేటా సెంటర్లు మంచివి కావని అంటూ కొంతమంది సృష్టిస్తున్న అపోహలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

"డేటా సెంటర్లు మంచివి కావు" అంటూ అమెరికా ఉదాహరణ చెబుతున్నారు. అమెరికాను చూసుకుంటే, మన దేశంలో వన్ నేషన్ - వన్ గ్రిడ్ ఉంది. అమెరికాలో అది లేదు.

నీటి విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం గోదావరి నుంచి దాదాపు 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇది వియత్నాం లేదా బ్రెజిల్ దేశాల మొత్తం వార్షిక నీటి వినియోగంతో సమానం.

మేము నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అవసరం. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్, ఒక గిగావాట్ డేటా సెంటర్ కంటే 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది.

కానీ ప్రతి ఒక్కరూ డేటా సెంటర్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప, థర్మల్ పవర్ ప్లాంట్ల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి యువతతో ఈ విషయాలపై చర్చించడం, వారి భయాలు మరియు అపోహలను తొలగించడం చాలా ముఖ్యం.





Tangirala sowmya

02/06/2026

స్పోర్ట్స్ కోటా మెరిట్ లిస్టును దాచేశారని చేస్తున్న ఫేక్ ప్రచారం పచ్చి అబద్ధం..

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 382 మంది జాబితా మొత్తం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.





Tangirala sowmya

02/06/2026

ఇటీవల గొడ్డలి పార్టీ చేసిన 5 ఘటనలు ప్రజలు తెలుసుకోవాలి.

మొదటిది: డీఎస్సీపై గొడ్డలి పార్టీ గొడ్డలి వేటు..

గత గొడ్డలి పార్టీ పాలనలో ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 241 కేసులను పరిష్కరించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టాం. అత్యంత పటిష్టంగా ఈ నియామక ప్రక్రియను నిర్వహించాం.

కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టాం. 40 వేల ప్రశ్నలు, 25 రకాల ప్రశ్నాపత్రాలతో ఎక్కడా అక్రమాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అయినప్పటికీ ఫ్రస్టేషన్‌లో ఉన్న వైసీపీ, ఈ ప్రక్రియను వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోంది.

అయితే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం వల్ల, వస్తున్న ఆరోపణలకు గట్టిగా సమాధానం ఇవ్వగలిగాం.







Tangirala sowmya

02/06/2026

సొంత బాబాయిని చంపి ఆ నేరాన్ని కూడా మా పైన వేయబోయాడు జగన్మోహన్ రెడ్డి. అతని పీఏ దగ్గరే వేలకోట్ల రూపాయలు అవినీతి సొమ్ము దొరికింది. అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకెన్ని వేల కోట్ల అవినీతి సొమ్ము ఉందో లెక్కేలేదు..





Tangirala sowmya

02/06/2026

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఖండించారు.

డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను నోటిఫై చేయగా, అందులో 3 శాతం క్రీడా కోటా కింద 421 పోస్టులను కేటాయించాం. ఈ నియామక ప్రక్రియలో 3,600 మంది అభ్యర్థులు మొత్తం 5,326 దరఖాస్తులు సమర్పించగా, తుది ఎంపికలో 382 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 39 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి.

అన్ని పోస్టులు భర్తీ కాకపోవడమే ఎంపికలు పూర్తిగా అర్హత, ప్రాధాన్యత, ప్రభుత్వ నిబంధనల ఆధారంగానే నిర్వహించబడినట్లు స్పష్టం చేస్తోంది.






Tangirala sowmya

• ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 65, 887 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం ...
02/06/2026

• ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 65, 887 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం పర్యటనలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

• నియోజకవర్గాల అభివృద్ధిపై దిశానిర్దేశం చేసేందుకు నేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

• రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యం.. ముంబయి సదస్సులో స్పష్టం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• ఉపాధ్యాయ నియామకాలపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలను ఎండగడుతూ విశాఖ తీరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన డీఎస్సీ అభ్యర్థులు

• కోటిమంది భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాలు యోగాంద్ర కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు.. మంత్రి సత్య కుమార్ యాదవ్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/QE0HV





Tangirala sowmya

Address

Nandigama
518501.

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Nandigama posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Nandigama:

Share