28/08/2019
భూ సంబంధిత పెండింగ్ సమస్యలు ధరణి ద్వారా పరిష్కరించి అర్హులైన రైతులకు పట్టా దార్ పుస్తకాలు జారీ చేయాలని జాయింట్ కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయాదిత్య భవన్ లో జాయింట్ కలెక్టర్ చంద్ర శేఖర్ ధరణి ద్వారా పెండింగ్ భూ సమస్యల పై నల్గొండ,మిర్యాలగూడ డివిజన్ లకు చెందిన తహసీల్దార్ లు,డి.టి.లు,వి.ఆర్.ఓ.లు,ఆర్.ఐ., లు,కంప్యూటర్ ఆపరేటర్ లు ,సర్వేయర్ లతో సమీక్షించారు.ఉదయం నల్గొండ డివిజన్,మధ్యాహ్నం మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ వారీగా సమీక్ష నిర్వహించి డివిజన్, మండలం,గ్రామం వారీగా పెండింగ్ లో వివాదాలు లేని ఖాతాలు ధరణి ద్వారా నమోదు చేసి పూర్తి చేయటంలో కొన్ని మండలాలు వెనుక బడి ఉన్నట్లు, జాయింట్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ నెల 31 పెండింగ్ ఖాతాలు,డిజిటల్బసంతకాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
పట్టాదారు పాసు పుస్తకాల జారీ విషయంలో సమస్య పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించమని హెచ్చరించారు.
ఈ సమావేశంలో డిఆర్ ఓ రవీంద్రనాథ్,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఏ.డి.శ్రీనివాసులు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ క్టర్ గోపాల్,ఆర్డీఓ లు జగదీశ్వర్ రెడ్డి(నల్గొండ),జగన్నాథ రావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి మోతిలాల్ తదితర అధికారులు పాల్గొన్నారు