Nalgonda Bheem army

Nalgonda Bheem army Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nalgonda Bheem army, Political organisation, Nalgonda.

08/02/2026

Jai Bhim 💙🙏🔥

నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ , ప్రశ్నించే గొంతుక , అనేక పోరాటాలు సాగిస్తూ, గెలుపైన, ఓటమైనా ప్రజలతోనే నా జీవితం...
11/06/2024

నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ , ప్రశ్నించే గొంతుక , అనేక పోరాటాలు సాగిస్తూ, గెలుపైన, ఓటమైనా ప్రజలతోనే నా జీవితం ప్రజలలోనే నా జీవనం అంటూ యువతలో, జన సైనికులందరిలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగుతున్న జన నేత భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వనం మహేందర్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💙💐🎂 BhimArmy Telangana

-Nalgonda Bheem army

05/06/2024

ఎవరీ రావణుడు..?

""""""""""""""""""""""""""""""""
16 నెలల జైలు శిక్షను అనుభవించిన
ఈ వీరుడు ఎవరు ?
""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
నేటికి అక్రమ కేసులను బనాయిస్తున్నా
వెనకడుగు వేయని
ఈ యంగ్ అండ్ డైనిమిక్ లీడర్ ఎవరు ?
_____________________________.______
భీమ్ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ పై ఎవరు దాడి చేశారు అనేది ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు కానీ అంచనా వేయడం పెద్ద కష్టమైన పని ఏమి కాదు . గత కొంత కాలం నుండి బిజెపి ఆర్ఎస్ఎస్ లు ఉత్తరప్రదేశ్ పైన తమ శక్తినంతా కేంద్రీకరించి పనిచేస్తున్నాయి . వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఎలాగైనా ఉత్తర్ ప్రదేశ్ లోని మొత్తం 80 పార్లమెంట్ సీట్లు గెలవాలనే ది బిజెపి ఆర్ఎస్ఎస్ ల లక్ష్యం . అందు కొరకు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు సంస్థలు . 80 పార్లమెంటు సీట్లు గెలవడానికి లేదా సాదించడానికి ఎవరు అడ్డంకిగా ఉన్నారనుకున్నా , వారిని సామ, దాన, భేద, దండోపాయాల ప్రకారంగా ఎదుర్కుంటారు . భీమ్ ఆర్మీ నాయకుడు ఆర్ఎస్ఎస్ బీజేపీలకు కొరకరాని కొయ్యగా మారాడు . ముఖ్యంగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో భీం ఆర్మీ ప్రభావం ఉంది . ఇదే ప్రాంతం లో రైతు ఉద్యమ ప్రభావం కూడా ఉన్నది.

పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో పార్లమెంట్ సీట్లు గ్యారెంటీ చేసుకోవాలంటే చంద్రశేఖర్ లాంటి వారిపై దాడి చేయడం పాలకవర్గాలకు అవసరం అయ్యింది . ఇది మొదలు మాత్రమే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇంకా ఎందరి మీద ఎన్ని దాడులు జరుగుతాయో తెలవదు . గతంలో ఈ పశ్చిమ ఉత్తరప్రదేశ్ లొనే ఎన్నికలకు ముందు మతకలహాలు రెచ్చగొట్టబడ్డాయి . పార్లమెంటు ఎన్నికల సమయం వరకు ఇంకా ఇటువంటి దాడులు పెరగవచ్చు .

నిజం మాట్లాడితే నచ్చదు ప్రశ్నిస్తే ఎదురు దాడులు కాల్పులు ఇది ప్రజాస్వామ్యమా...
బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వాల్ల టెర్రరిజమా...?
ఇలా ప్రశ్నించే గొంతుకలను ఎందరిని చంపుతురు ఎందరిపై దాడులు చేస్తరు..

చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ రావణ్.....
ఇప్పడా పేరు ఒక సంచలనం, ఒక ప్రభజనం. స్వతంత్ర అనంతర భారతదేశంలో అతి తక్కువ కాల వ్యవదిలో దేశ రాజకీయాలను శాసించగలిగే స్థాయికి చేరగలిగిన సామాన్యుడు (దన ,కుల,మత అధికార, వారసత్వ అండ లేకుండా) ఎవరైనా వున్నారంటే ... ఆ వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ మాత్రమే. బహుశా భారతదేశ చరిత్రలో అటువంటి వ్యక్తిని దేశంచూసి ఎరుగదు. అంతటి ప్రభంజన శక్తి చంద్రశేఖర్ఆజాద్ రావణ్ . మనువాదపు గుండెల్లో భూ ప్రకంపనాలను సృష్టిస్తున్న టెర్రబుల్ లీడర్ .

జారీయ భద్రత చట్టం కింద 16 నెలలు జైలులో వుంచిన....లెక్కచేయకుండా..మరలా..దళిత బహుజన ముస్లీం హక్కులకు పరిరక్షణ కొరకు పాలకులతో...పోరాడు
తున్న ఎనర్జిటిక్ లీడర్ చంద్రశేఖర్ఆజాద్ .

అందమైన శైలిలో మీసం త్రిప్పి - చేతికి కడియం - కళ్ళకు రేబాన్ సన్ గ్లాస్ అద్దాలు - మిలటరి స్టైల్ లో హైర్ కటింగ్ మెడలో రాయల్ బ్లూ షాల్ (కండువా ).అచ్చం సినిమా హీరోలా కనపడే ఈ ఉద్యమ హీరో ప్రస్థానాన్ని తెలుసుకోవడం దళితుల చారిత్రక అవసరం .

ఆజాద్ - బయోగ్రఫీ - 1986
~~~~~~~~~~~~~~~~~~~~~

అది 1986 సంవత్సరం.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సహరాన్ పూరు జల్లాలో చట్మల్ పూరు కు సమీపంలో ధడ్కౌలి గ్రామంలో గోవింద దాసు , కమలేష్ దేవి లకు 1986 డిసెంబర్ 3 న ,రెండవ సంతానంగా చంద్రశేఖర్ఆజాద్ జన్మించారు.తొలి సంతానంగా భగత్ సింగ్ ,ఆఖరి సంతానంగా కమల్ కిషొర్ లు జన్మించారు.

తండ్రి పోరాటం
~~~~~~~~~~~~~~~
ఆజాద్ తండ్రి గోవింద దాసు స్కూల్ హెడ్ మాస్టర్.
ఠాకూర్లు కూర్చొనే కుర్చీలలో గోవింద దాసుకు కూర్చోడానికి అనుమతి లేదు.త్రాగడానికి వేరే నీళ్ళ కుండ వుండేది.తోటి ఉపాధ్యాయుల నుండి వివక్షతను ఎదుర్కొనే వారు.కళాశాల అసమానతల కు వ్యతిరేకంగా గోవింద దాస్ పోరాడారు.బాంసెఫ్ సంస్థలో కీలక కార్యకర్తగా వున్నారు.

1998 లో సహరాన్ పూరుకు కాన్షీరాంవచ్చినప్పుడు
ఆజాద్ కు 8 సంవత్సరాలు.అప్పట్లో దళితులు వూరి బయట వాహనాలను నడపడానికి వీలులేదు.
ఆ విషయాన్ని కాన్షీరాం దృష్టికి వచ్చినప్పుడు దళితు లకు దేనినైన ఉపయోగించుకొనే హక్కుందన్నారు.

న్యాయవాదిగా ఆజాద్
~~~~~~~~~~~~~~~~~
2007 లో డెహ్రడూన్ DAV కళాశాలనుండి LAW లో పట్టబద్రుడైయ్యాడు.తర్వాత సత్యం అనే ప్రగతి శీల విధ్యార్ది సంస్థంలో వున్నారు.2011లొ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళాలనుకున్నాడు.
అయితే సహరాన్పూరు ఆసుపత్రిలో అనారోగ్యంతో
వున్న తన తండ్రి వద్దనే వుండిపోవలసి వచ్చింది ..ఆ సమయంలో దళితులపై జరిగే అన్యాయాలను ఆజాద్ కు వివరించేవారు. దళితులపై జరిగే అకృత్యాలను పేపర్ల లో చూసి అజాద్ దళిత నాయకునిగా మారారు

భీమ్ఆర్మీ ఆవిర్భావం 2015
~~~~~~~~~~~~~~~~~~~
2012 లో ఆజాద్ స్వస్థలానికి వచ్చినప్పుడు ఇంటర్ కళశాల విద్యార్దులు తమపై జరిగే వివక్షతలను వివరించారు.ఠాకూర్ విధ్యార్దులు తాగక ముందు దళిత విధ్యార్దులు నీళ్ళు త్రాగడానికి అనుమతిలేదు.
అలా త్రాగడానికి ప్రయత్నించిన ఒక దళితవిద్యార్ది చేతిని విరిసారు.దళిత విధ్యార్దుల పుస్తకాలను ద్వంసం చేసేవాళ్ళు.డబ్బులను దొంగిలించే వాళ్ళు.

ఆజాద్ తొలి నిరసన
~~~~~~~~~~~~~~~~~~
కళాశాల అసమానతలకు వ్యతిరేకంగా కళాశాల బయట నిరసన చేపట్టాడు.ఆ సమయంలో వినయ్ రతన్ సింగ్ కలిసారు.భీమ్ఆర్మీ ఆ విదంగా ప్రారంభ
మైయింది.దళితులకు 1.విద్యాబోదన -
2 .అగ్రకుల హింసకు ప్రతిగా హింస చేయడానికి అవసరమైన బోదన శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా
భీమ్ఆర్మీ అనే అంబేడ్కర్ సంస్థను చంద్రశేఖర్ఆజాద్
,వినయ్ రతన్ సింగ్ ,కమల్ సింగ్ లు అనే ముగ్గురు దళిత యువకులు స్థాపించారు.

350 పైగా ఉచిత పాఠశాలను (భీమ్ శాల )నెల
కొల్పారు.దళితులే కాదు ముస్లీంలు ఇతర వెనుకబడిన వర్గాలు కూడా భీమ్ శాల లో(బడులు ) చేరారు.

వివాహానికి గుర్రంపై వూరేగిన వరునిపై ఠాకూర్లు దాడి చేసినప్పుడు భీమ్ఆర్మీ ఎస్కార్ట్ గా నిలబడింది.
ఆత్మగౌరవ సంకేతంగా
" ద గ్రేట్ చమర్ " అనే సైన్ బోర్డ్
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఆజాద్ స్వస్థలం ధడ్కౌలి వెలుపల ఒక సైన్ బోర్ద్ వుంచారు.

" ధడ్కౌలి యొక్క గర్వించదగిన చమర్స్
మిమ్మల్ని స్వాగతించారు "

అనే బోర్దును వుంచినప్పుడు ఠాకూరులుఅభ్యంతరం
తెలిపారు. సైన్ బోర్డ్ ప్రక్కన ఆజాద్ నిల్చోన్నప్పుడు అది మరింత ప్రాముఖ్యతను నొంది దళితనాయకుని
గా...గుర్తింపు నొందారు.

2016 - అంబేడ్కర్ విగ్రహ స్థాపన కు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అభ్యంతరం చెప్పిన ఠాకూర్లు
~~~~~~~~~~~~~~~~~~~~
సహరాన్ పూరులోని షబ్బీరుపూరులో సంత్ రవిదాస్ ఆలయంలో అంబేడ్కర్ విగ్రహాన్ని స్థాపించదలచి పరిపాలకు చెప్పారు.దానికి ఠాకూర్లు అభ్యంతరం చెప్పారు.ఆలయంలో అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పడానికి వెలుతున్నప్పుడు పోలీసులు అడ్డుకున్నారు.తత్పలితంగా నెలపాటు షబ్బీర్ పూరులో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి

2017 - సహరాన్ పూరు దళితులు తిరుగుబాటు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సహరాన్ పూరులో ఠాకూర్లకు దళితులకు మద్య జరిగిన హింసాత్మక అల్లర్లు... 1915 లో .యోధుడు అయ్యంకాలి సారద్యంలో చెలరేగిన "పెరినాడు" అల్లర్లతో పోల్చదగినవి. 100ఏళ్ళ తర్వాత మరలా భారత దేశంలో జరిగినా... తొలి దళిత ప్రతిఘటన అల్లర్లుగా సహరాన్పూరు అల్లర్లను చెప్పుకోవచ్చు.

రాణాప్రతాప్ సింగ్ జన్నదినం సందర్భంగా ఠాకూర్లు చేపట్టిన వూరేగింపు దళితవాడ మీదుగా వెలుతున్నప్పుడు DJ సౌండ్ ని బిగ్గరగా పెట్టడం , అంబేడ్కర్ ముర్దాబాద్ అని అరవడం చేసినప్పుడు గ్రామపెద్ద ,ఉపాధ్యాయుడు అభ్యతరం చెప్పాడు.

దానికి ఆగ్రహించిన ఠాకూర్లు తుపాకులు ,బాంబులు, మారణాయుదాలను చేతపట్టుకుని గుంపులు ,
గుంపులుగా దళితవాడ వైపు వెళ్ళి...55 దళిత ఇండ్లను తగలబెట్టారు.అనేకమందిని గాయపరిచారుఒకళ్ళపై ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు.ప్రభుత్వం ,
పోలీసులు ఠాకూర్లకు అండగా నిలబడ్డారు.దళితులు నిస్సహాయులుగా మిగిలిపోయారు.

నిరసనగా 500 మంది బౌద్దమత స్వీకరణ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఠాకూర్ (రాజపుత్ర )హింసకు నిరసనగా 3 గ్రామాల దళితులు (500 మంది ) ప్రదర్శనగా వెళ్ళి హిందు దేవుళ్ళ ప్రతిమలను, క్యాలెండర్లను పెద్ద కాలువలో నిమజ్జనం చేసారు.అనంతరం 150 కుటుంబాలు
బౌద్దధీక్షనొందారు.ఈచర్య1927లో బ్రాహ్మణ
అకృత్యాలకు నిరసనగా అంబేడ్కర్ చేపట్టిన మనుస్పృతిని ధగ్దంతో పోల్చదగింది.హిందు దేవుళ్ళ ప్రతిమలను పగులకొడుతున్నారని పోలీసులకు ఠాకూర్లు సమాచారం అందించిన పలితం లేకుండా పోయింది.

పోలీసు స్టేషన్ కి నిప్పుంటించిన దళితులు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
షబ్బీరుపూరులో దళితులపై ఠాకూర్లు సాగించిన హింసాత్మక దాడులకు వ్యతిరేకంగా కొంత కాలం తర్వాత సహరాన్ పూరులో సమావేశానికి పోలీసులను అనుమతి కోరారు.పోలీసులు అనుమతించక పోవడంతో దళితులు ఆగ్రహం చెందారు.

ఠాకూర్లు,పోలీసులు ,ప్రభుత్వం చర్యలకు విసిగి వేసారి పోయిన దళిత యువత ఆగ్రహం ఒక్కసారిగా
కట్టలు తెంచుకుంది. అంతే దళితుల కోపానికి పోలీసు స్టేషన్ ,పోలీసు వాహనాలు...బస్సులు
తగలబడిపోయాయి.పోలీసులు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్ఖుకుని పరుగులుతీసారు.అదనపు బలగాల కోసం ఉన్నతాధికారులకు సమాచారం అందిన...వాళ్లు సహారాన్పూరుకు చేరుకోవడానికి
3గంటలు సమయం పట్టిందంటే ...ఏ స్థాయిలో హింసాత్మక అల్లర్లు జరిగాయో... వూహించు
కోవచ్చు.పోలీసులు సహరాన్పూరుకు చేరకుండా
రహదార్లపై పెద్ద చెట్లను అడ్డంగా పడేసారు.

అజ్ఞాతంలోనికి వెళ్లిన ఆజాద్.
-----------------------------------------
ఆజాద్ తలకు 25000 నగదును
ప్రకటించిన పోలీసులు
_______________________________

సహారాన్పూరు హింసకు ఆజాద్ ని బాద్యుడను చేస్తూ... 44 FIR లలో ఆజాద్ పేరును చేర్చారు.
అలాగే ఆజాద్ తలపై 25000 బహుమతిని
ప్రకటించింది.సంబందంలేని దళితులపై అక్రమ కేసులను పెట్టారు.నక్సలైట్ గా ముద్రవేసి ఆజాద్ ని ఎన్ కౌంటర్ చేయాలని చూసారు..కానీ కుదరలేదు.

ఆజాద్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.పోలీసు ఆజాద్ ఆచూకిని గుర్తించి అక్కడికి చేరుకునే సమయానికి ఆజాద్ తప్పించుకునేవాడు.రహస్యంగా మీడియాకు ఇంటర్యూ ఇచ్చేవాడు.దళితులపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేస్తే...లొంగిపోతాననే సంకేతాలను మీడియా ద్వారా పంపాడు.

40 వేల మందితో డిల్లి జంతరమంతర్ వద్ద నిరసన
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సహరాన్పూరులో దళితులపై జరిగిన ఠాకూర్ల హింసను దేశానికి చాటడానికి అంబేడ్కర్ పోటోలతోబ్లూ జెండాలతో...ఆజాద్ మాస్క్ లను తొడిగిన వేలాది మంది భీమ్ఆర్మీ కార్యకర్తలు డిల్లి జంతర
మంతర్ వద్దకుచేరుకున్నారు.జైభీమ్ ఆవేశ నినాదాలతో జంతరమంతర్ రణరంగాన్ని తలపించింది.ఆజాద్ వస్తాడనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు వందల సంఖ్యలో
మోహరించారు.

దేశంలో ఎంతోమంది దళిత బహుజన నాయకులు వున్నా .. సహరాన్పూరు దళిత బహుజన శక్తులకు అండగా ఏ నాయకుడు ,నాయకురాలు ముందుకు రాలేదు.
ఆఖరికి ఉత్తరప్రదేశ్ రాష్త్రానికి 4 సార్లు
ముఖ్యమంత్రి అయిన మాయావతి కూడా ముందుకు
రాకపోవడం ఆశ్చర్యం.."నీసమస్యలను నీవే పరిష్కరించుకోవాలి ...వేరొకరు పరిష్కరించలేరు " అన్నా అంబేడ్కర్ సందేశంతో స్పూర్తిగా నవతరం బహుజనులు పోరాటానికి సిద్దమైయ్యారు.

వేలాది భీమ్ఆర్మీ సైనికుల మద్యలో ఒక్కసారిగా ఆజాద్ ప్రత్యక్షమవడంతో...జంతరమంతర్ రణభూమిగా మారిపోయింది. దళితులకు అన్యాయం చేసిన ప్రభుత్వం ,పోలీసులపై నిప్పులు చెరిగాడు.
నెల తర్వాత UP స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆజాద్ ను హిమాచల్ డల్హౌసి లో అరెస్ట్ చేసారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు పెట్టిన తీవ్రహింసలకు ఆజాద్ ఆరోగ్యం క్షీణించి, రక్తవ్యాది బారిన పడ్డాడు.ఆజాద్ పై పెట్టిన కేసులు రాజకీయంగా ఉద్దేశపూర్వకమైనవిగా బావించిన హిమాచల్ ప్రదేశ్ డల్హౌసి కోర్ట్ ఆజాద్ కు బైయిల్ ను మంజూరు చేసింది.

16 నెలల పాటు జైలు శిక్ష ~~~~~~~~~~~~~~~~~
ఒక రోజు తర్వాత యోగి ...ప్రభుత్వం కింద వుంచుకుని ఎటువంటి విచారణ లేకుండా ఒక ఏడాదిపాటు జాతీయ భద్రత చట్టం కింద జైలులో వుంచారు.

" .నేను బహుజనుల కోసం జీవితాంతం జైలులోనే వుండిపోవడానికి సిద్దం.నా గురించి మీరెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.కానీ దళితులకు మాత్రం ఎటువంటి పరిస్థితులలొ అన్యాయం జరగకూడదన్నా ఆజాద్ పిలుపు భీమ్ఆర్మీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపింది.

బిడ్డకోసం రోడెక్కిన వృద్దురాలు (ఆజాద్ తల్లి )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నా బిడ్డ న్యాయం కోసం పోరాడుతాడు తప్ప
అన్యాయంగా వ్యవహరించడు.తన బిడ్డతో పాటుగా జైలులో ఇతర బిడ్డల్ని కూడా విడుదల చేయాలని 75 ఏళ్ళ వృద్ద మాతృ హృదయం డిల్లీ జంతరమంతర్ వద్ద ధర్నాకు దిగింది.

పరుషులు జైలులో వున్నప్పుడు మహిళలు రోడ్లపై వుండాలి.మనమే ముందుండి పోరాడాలని అన్నారు.

జైలులో ఆజాద్ ప్రాణానికి ముప్పు ఉదన్న విషయమై ఆజాద్ తల్లిని మీడియా ప్రశ్నించినప్పుడు ... బాబాసాహెబ్అంబేడ్కర్ తన ప్రజల కోసం 4గురు బిడ్డల్నికోల్పోయారు.నాకు 3గురు కుమారులు. ఒకరికి ఏదైనా జరిగితే ... చనిపోవడానికి మరోఇద్దరు సిద్దంగా వున్నారంటూ సంచలన ప్రకటన చేసింది.

అలాగే...ఆజాద్ ని రావణ్ గా పిలుస్తారన్నప్పుడు...
రావణుడు గొప్ప విద్వాంసుడు.తన చెల్లెల కోసం రాముడుతో పోరాడిన వీరుడు.ఆజాద్ కూడా అన్యాయానికి గురైన బహుజనుల కోసం పోరాడు
తున్నడని ..అజాద్ తల్లీ తన అభిప్రాయన్ని వ్యక్తం చేసింది.

సెప్టెంబర్ 14 2018 న - విడుదల అయిన ఆజాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

16 నెలల తర్వాత ఆజాద్ విడుదలైనాడు.
సెప్టెంబర్ 13 2018 న రాత్రి 3-45 గంటలకు ఆజాద్ జైలు నుండి బయటకు వచ్చాడు.అప్పటికే వందలాది మంది దళిరులు సహారన్ పూరు నుండి ర్యాలీగా జైలు వద్దకు చేరుకున్నారు.దేశంలో తొలిసారిగా బహుజనుల పోరాట పలితంగా ఒక ఖైది ఈ రోజు విడుదల అయినాడు.ఇది భీమ్ఆర్మీ సైనికుల విజయం.ఉద్యమం అంతకు ముందు మాదిరిగానే కొనసాగుతుంది.మోది సింహాసాన్ని కూల్చే దాకా నేను నిదుర పోను..వాళ్ళను నిదుర పోనివ్వనని హెచ్చరించాడు.

ఆజాద్ ని జైలుకు పంపడం ద్వారా భీమ్ఆర్మీ అంతర్ధానమవుతుందని బావించిన పాలకులు షాక్ అయ్యేలా... భీమ్ఆర్మీ అంతకు పదింతలు రెట్టింపు అయింది.జైలు నుండి వచ్చిన ఆజాద్ మరింత ప్రాచుర్యాన్ని నొందారు.

కూల్చివేయబడిన సంత్ రవిదాస్
ఆలయ పునర్నిర్మాణం కోసం
~~~~~~~~~~~~~~~~~~~~~~~
500 ఏళ్ళనాటి సంత్ రవిదాస్ ఆలయాన్ని డిల్లీ డెవలెప్ మెంట్ అధారిటి 2019 లో కూల్చివేసి
నప్పుడు ..ఆజాద్ ఒక ప్రకటన చేసాడు." సంత్ రవిదాస్ ఆలయాన్ని కూల్చిన చోటే..తిరిగి నిర్మించడానికి నేను చావుకు సిద్దపడి వెలుతున్నాను.
నా వెంట ఎంత మంది వస్తారిొ..రండి" అన్న
పిలుపుకు....
20 లక్షల మంది బహుజనులు డిల్లిని ముట్టడించారు.ఆ సందర్బంగా చెలరేగిన హింసాత్మక అల్లర్లకు భయపడిన ప్రభుత్వం ఒక్క రోజులోనే ఆలయాన్ని ఉన్న చోటనే పునర్నిమిస్తామని ప్రకటన చేసింది.ఆజాద్ తో పాటు 90 మందిపై ప్రభుత్వం కేసులు బనాయించింది.ఆజాద్ ను వెళ్ళమని పోలీసులు పురమాయించినా.. ఆజాద్ కార్యకర్తలను విడిచివెల్లలేదు.ఆజాద్ నిబద్దత రాజకీయాలకు ఇదొక నిదర్శనం.

CAA - NRC 4 లకు వ్యతిరేకంగా
~~~~~~~~~~~~~~~~~~~~~~
CAA - NRC -కు వ్యతిరేకంగా డిల్లి జమా మసీదులో నిరసన చేస్తున్న నిరసన కారులకు మద్దతుగా ..వెళ్ళిన ఆజాద్ మసీదులో రాజ్యాంగాన్ని చదివారు.ఆ సందర్బంగా పోలీసులు అరెస్ట్ చేసి జైలులో వుంచారు.ఆ సమయంలో ఆజాద్ రక్తవ్యాదితో..అనారోగ్యానికి గురికావడం తో
ఆజాద్ కు 20 రోజుల తర్వాత కండిషనల్ బైయిల్ లబించింది.

భారత్ బంద్ కు పిలుపు
~~~~~~~~~~~~~~~~~~~~~
అలాగే SC ST ఉధ్యోగుల పదోన్నతలో ...రిజర్వేషన్ చెల్లవంటూ సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిన నేపధ్యంలో
ఏప్రిల్ 2 న 2020 న ఆజాద్ భారత్ బంద్ కు పిలుపు నిచ్చారు.ఆ సందర్బంగా డిల్లిలో భీమ్ఆర్మీ కవ్వింపు చర్యలే డిల్లి అల్లర్లకు కారణంమని చార్జిషీట్ లో ఆజాద్ పేరును చేర్చారు.

అయినా సరే.. పాలకుల కుట్రలకు జడిసి ఆజాద్ వెనకడుగు వేయలేదు.కరోన మహమ్మారికి భయపడి దేశ నేతలందరు ఏసి గదులకు పరిమితమైతే ...
ఆజాద్ ఒక్కడే ప్రాణాలను పణంగా పెట్టి బాదితుల పక్షాన పోరాడుతున్నాడు.

అయ్యంకాలి తర్వాత బహుజన సమాజానికి రక్షకుడుగా వచ్చిన ఆజాద్ ని బహుజన సమాజం కాపాడుకోలేక పోతే... మరలా అటువంటి వీరుడు పుట్టడానికి చాలా కాలం వేచిచూడాల్సి వస్తుంది. ఇప్పుడు కనుక నీవు పోరాడ లేకపోతే ...మరెప్పటకీ పోరాడ లేవు.
ఒకవేళ కొంతకాలం తర్వాత పోరాడాలనుకున్నా అప్పుడు నీ కొరకు పోరాడే నాయకుడు వుండడు అండగా ప్రజలు వుండరు.ప్రజలు చైతన్యంతో కదులుతున్నప్పుడే వారితో కలసి నడవాలి .ఆగివున్నప్పుడు నీవు నడిచిన పలితం వుండదు.

ప్రస్తుతం 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందినరు...

ఈ సారి పార్లమెంట్ లో యుద్ధం జరగట్లేదు...
ఒక్క యుద్ధంమే పార్లమెంట్ కు వస్తుంది గుర్తుంచుకోండి 💙✊🤙...

నోట్:- ఇది ప్రతి ఒక్కరి కి తెలిసేలా షేర్ చేయండి...

జై భీమ్...
✍️✍️
నేను మీ మనోహర్ తంగిరాల
(భీమ్ వారియర్ నల్లగొండ)
BHIM ARMY

23/09/2021
11/07/2021
14/06/2021

वह लम्हा जिसने मेरी संवेदनाओं को अंदर से झकझोर दिया। जैसा कि हम जानते है कि दुनिया के किसी भी सामाजिक व राजनीतिक आन्दोलन में समाज के हर तबके का योगदान होता है चाहे वह गरीब हो या अमीर। हमारा बहुजन समाज आर्थिक रूप से बहुत कमजोर है बावजूद इसके यह समाज अपनी राजनीतिक, आर्थिक व सामाजिक बदलाव के सपने देख रहा है। 13 जून 2021 को उत्तराखंड जिला हरिद्वार में आज़ाद समाज पार्टी के प्रोग्राम में एक बाबा जी का वह प्यार मुझे अंदर से हिला के रख दिया जिसकी वजह से मैं रात भर सो नहीं पाया। यह वह लम्हा था जब महेंद्र सिंह जी ग्राम इक्कड़ कला, जिला हरिद्वार के रहने वाले और खेती व मजदूरी से अपने परिवार का भरण पोषण करने वाले मेरे भाषण व मीटिंग ख़त्म होने के बाद तत्परता से मेरे पास आये और अपने खून पसीने की कमाई से जुटाये 200 रुपये मुझे निकालकर दिये और मेरे हाथों को कसकर पकड़कर बहुत भावुक होकर मेरे चेहरे को देखते हुए बोले " बेटा तुम बहुजन समाज के आज़ाद सूरज हो, हमें विश्वास है कि तुम बहुजनों को एक दिन सत्ता में ज़रूर ले जाओगे, ये मेरा छोटा सा आर्थिक सहयोग है पार्टी को आगे बढ़ाओ " वह मेरे लिए महज रुपये नहीं बल्कि उनकी उम्मीद और विश्वास है। उनके शब्द मेरे बहुजन समाज के खोये हुये अतीत के इतिहास को वापस लाने का आह्वान से कम नहीं थे। यह घटना मुझे मान्यवर कांशीराम जी की याद दिलाती है जब उन्हें जगह-जगह से ऐसे समर्थन मिल रहे थे। उनके आन्दोलन से तैयार समाज हमें आगे बढ़ा रहा है। ऐसे बहुजन समाज में करोड़ों माताएं-बहने व पिता तुल्य बुजुर्ग हैं जो बहुजन नौजवनों के माध्यम से सत्ता का नया इतिहास लिखते देखना चाहते हैं। उन तमाम नौजवानों को मेरा साथ व विश्वास है आईये बहुजन समाज को हुक्मरान बनाते हैं। मैं वादा करता हूँ कि बहुजन समाज के सत्ता व स्वाभिमान के लिए मर सकता हूँ पर बिक नहीं सकता। बाबा महेंद्र सिंह जी का बहुत-बहुत आभार।

नेता नहीं बेटा आपका चन्द्र शेखर आज़ाद

आप सभी लोगों को बुद्ध पूर्णिमा की हार्दिक शुभकामनाएं जय भीम नमो बुद्धाय                      जय भीम                     ...
26/05/2021

आप सभी लोगों को बुद्ध पूर्णिमा की हार्दिक शुभकामनाएं

जय भीम नमो बुद्धाय

जय भीम




చలోఢిల్లీమార్చి 7న పార్లమెంట్ ముట్టడియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC లోకి ప్రై వేట్  రంగ నిపుణుల నియామకాలలో LATERN E...
04/03/2021

చలోఢిల్లీ

మార్చి 7న పార్లమెంట్ ముట్టడి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC
లోకి
ప్రై వేట్ రంగ నిపుణుల నియామకాలలో LATERN ENTRY MODE ను
వ్యతిరేకిస్తు
అలాగే ప్రై వేట్ రంగంలో కుడా
SC,ST,BC,మైనరిటి రిజర్వేషన్లను
అమలు చేయాలనే
డిమాండ్ తో



మార్చి 7న పార్లమెంట్ ముట్టడి

02/03/2021

మనువాద పాలకుల ఆలోచనలు అమలౌతున్న,గాని బహుజనులు(SC, ST, BC&మైనారిటీ) మొద్దు నిద్రలో నుండి లెవరయే,అయ్యా మనువాదా పాలకులారా ఇంకా చూస్తారేమి, తండ్రి బాబాసాహెబ్ డా,, బి ఆర్ అంబేడ్కర్ గారు రాసిన భారతరాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకువస్తే గాని ఈ బహుజనులకు సోయి రాదు, మొద్దు నిద్రలో నుడి లేవరు,(వెటకారంగా కాదు,బాధతో చెప్తున్న).
ఈ బహుజనులు, బహుజన ఉద్యమనిర్మాణంలో భాగస్వాములు కారు,బహుజన రాజ్యాధికారనికి కృషి చేయరు.బానిస బ్రతుకులతో ఆనంద పడే వారికి ఏమి చెప్పి,ఏమి లాభం.

✍️
Nalgonda bheem army
✊Jai Bheem✊

ఇదే నిజం రాజ్యాధికారం సాధించాలంటే ముందు చరిత్ర తెలుసుకోవాలి.

Follow
👇
Nalgonda Bheem army

01/02/2021

23/01/2021

New song





Address

Nalgonda

Website

Alerts

Be the first to know and let us send you an email when Nalgonda Bheem army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nalgonda Bheem army:

Share