18/08/2023
*అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలి*
🔶 *ఆర్డీవో కార్యాలయం మీద బిజెపి ధర్నా*
*అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో స్థానిక RDO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.*
🔶 *ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని,*
🔶 *దళిత బంధు వెంటనే అమలుపరచాలన్నారు.*
🔶 *అర్హులైన పేద బీసీలందరికీ బీసీ బందు అమలు చేయాలని,*
*🔶నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలన్నారు.*
*🔶కొత్త రేషన్ కార్డులు పెన్షన్లను మంజూరు చేయాలని*
*🔶నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు.*
*సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని మరిచి ప్రాజెక్టులు, అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.*
*ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, obc మోర్చా జిల్లా అధ్యక్షులు కొండా భవానీ ప్రసాద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతరాజ సిద్దు, మండల అధ్యక్షులు పులకరం బిక్షం, గుండ వినయ్ కుమార్, బీపంగి జగ్జీవన్, రావిల్ల కాశమ్మ, చింతా ముత్యాలరావు, కనకయ్య, మైనం మల్లయ్య, వంగూరి రాఖి, ఆవుల మధు, ఏరుకొండ హరి, గాలి శ్రీనివాస్, గుండెబోయిన శేఖర్, వంగూరి రవి బ్రహ్మచారి, నెవెర్స్ నీరజ, హైమావతి, కవిత శ్రీదేవి, దుర్గ,పబ్బు నరేందర్ గౌడ్, ఊట్కూరి బాలాజీ, సముద్రాల వెంకటేష్, సుధాకర్, నవీన్,కటకం శ్రీధర్, లోహిత్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.*