16/02/2026
ఇది ముమ్మాటికీ Danasari Seethakka అక్క చేసిన కుమారస్వామి కుటుంబానికి చేసిన రాజకీయ ద్రోహమే..!
ఇది ప్రజల విశ్వాసంపై చేసిన దాడి,
ఇది ప్రత్యక్ష రాజకీయ ద్రోహం. 🔥✊
పార్టీలకు అతీతంగా నిలబడ్డ నిజమైన ప్రజానాయకుడునల్లెల కుమారస్వామి అన్న
పార్టీ ఏదైనా సరే, మనిషి ముఖ్యం అన్న సిద్ధాంతంతో నడిచిన వ్యక్తి.
న్యాయం, గౌరవం, విలువలు ఇవే ఆయన రాజకీయ పునాది ఈరోజు సీతక్క కాంగ్రెస్ పార్టీలో ఈ స్థాయిలో ఉన్నారంటే,
దానికి పునాది వేసింది ఒక్కరే కుమారస్వామి అన్న.
కాంగ్రెస్‌లోకి సితక్క రావద్దు అని అన్నాడు ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తే ప్రతివాడిని
కూర్చోబెట్టి, మాట్లాడి, ఒప్పించి,
సీతక్క ఎమ్మెల్యే కావడానికి తన నిరంతరం కృషి చేసిన నాయకుడు
అలాంటి నాయకుడి మరణం తరువాత,
“మీ కుమారుడిని మున్సిపల్ చైర్మన్ చేస్తాం” అని మాటిచ్చి, ఈరోజు ఆ మాటను కాలరాయడం ఏంటి ? సీతక్క గారు.
ఇది వ్యక్తిగత మోసం మాత్రమే కాదు,ఇది ములుగు ప్రజలపై చేసిన బహిరంగ అవమానం.కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా
పార్టీని జిల్లాలో నిలబెట్టిన నాయకులకు విలువ లేదా..?
ములుగు జిల్లా ఉద్యమంలో జరిగిన
ప్రతి పోరాటానికి వెన్నుగా నిలిచిన నాయకుడు నల్లెల కుమారస్వామి అన్న.
అలాంటి నాయకుడి కుమారుడిని ఈరోజు గెలిస్తే, కాంగ్రెస్ ను గెలిపిస్తే భారత్ ను ఛైర్మన్ చేస్తాం అని అంటేనే కదా ఈరోజు ములుగులో మీకు మున్సిపాలిటీ ఎన్నికలో పట్టం కట్టారు,మీరు ఇచ్చినమాటను ఎందుకు పక్కన పెట్టారు సీతక్క గారు.
ఇది రాజకీయ హత్య,ఇది ప్రజాస్వామ్యానికి అవమానం,ఇది ఒక కుటుంబాన్ని మోసం చేయడం కాదు,ములుగు జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని తొక్కేయడమే గుర్తుపెట్టుకోండి.
Mulugu District
Telangana Congress