My Miryalaguda జై మిర్యాలగూడ

My Miryalaguda జై మిర్యాలగూడ మిర్యాలగూడ జిల్లా సాధన సంకల్పం.

   #జైమిర్యాలగూడ✊✊
21/02/2024


#జైమిర్యాలగూడ✊✊

 #నా_మిర్యాలగూడ 34వ  #జిల్లాగా మార్చడానికి వేసే చివరి అడుగుఈ నేల, గాలి, నీళ్లు ఎలా పడితే అలా వాడిన మనకు నిజమైన కృతజ్ఞత చ...
29/10/2023

#నా_మిర్యాలగూడ 34వ #జిల్లాగా మార్చడానికి వేసే చివరి అడుగు
ఈ నేల, గాలి, నీళ్లు ఎలా పడితే అలా వాడిన మనకు నిజమైన కృతజ్ఞత చూపే గొప్ప అవకాశం.
నీ చిరునామాను నువ్వే గొప్పగా మార్చి భవిష్యత్తు తరాలకు అందించే సమయం.
ఓట్ల పండుగకు కురుసే నోట్ల వర్షానికి తడిసే బ్రతుకులు కావు, పుట్టుకతోనే పోరాటం నేర్పిన మహోన్నత జీవితాలు అని ఋజువు చేసే సదావకాశం.
చేసే కష్టానికి,అనుభవించే జీవితానికి పొంతనలేని మన బతుకులలో ఆవ గింజంత మార్పుకు చేసే ప్రయత్నం .
#జిల్లా_సంకల్ప_యాత్ర
ప్రతి #మిర్యాలగూడ మట్టి బిడ్డ అడుగు -
#మిర్యాలగూడ_జిల్లా వైపు ...
#జిల్లా_సంకల్ప_యాత్ర
సాగర్ రోడ్ బైపాస్ నుండి
శ్రీ అంబెద్కర్ గారి విగ్రహం వరకు.

26/10/2023


#జైమిర్యాలగుడ✊✊

#మిర్యాలగూడ_జిల్లా గా సాధించే దిశగా 30-10-2023 ఆదివారం రోజు #మిర్యాలగూడ సాగర్ రోడ్డులో గల బైపాస్ జంక్షన్ నుంచి #మిర్యాలగూడ రైతు మార్కెట్ రోడ్డు వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వరకు జరగబోయే #మిర్యాలగూడ_జిల్లా_సంకల్ప_యాత్ర ను విజయవంతం చేద్దాం ...

నీ మెదడుకు మట్టి కప్పిన రోజు..నీ ఆలోచనకు ముసుగు వేసిన రోజు...నీ బాధ్యతను బొంద పెట్టిన రోజు.నీ భవిష్యత్తును గంగలో కలిపిన ...
11/10/2023

నీ మెదడుకు మట్టి కప్పిన రోజు..
నీ ఆలోచనకు ముసుగు వేసిన రోజు...
నీ బాధ్యతను బొంద పెట్టిన రోజు.
నీ భవిష్యత్తును గంగలో కలిపిన రోజు..
2016 అక్టోబర్ 11 న కొత్త జిల్లాల ఏర్పాటులో నిన్ను నిర్లక్ష్యం చేస్తూ నిన్ను జిల్లా చేయాలన్న ఆలోచన కూడా చేయని రోజు

10/10/2023


#జైమిర్యాలగూడ✊✊

Election Code అమలు లో ఉన్న కారణంగా *నల్లజెండా* ఎగురవేసి, గుమికూడి నిరసన తెలపడం వీలుకాదు...కావున
*రేపు అనగా అక్టోబర్ 11 నాడు ఉదయం 10* *గంటల వరకు నల్లటి బ్యాడ్జిలు చొక్కా జేబుకు ధరించి,మన సోషల్ మీడియా స్టేటస్ గా* పెట్టి అందరూ నిరసన తెలుపగలరని ప్రార్థన...
గా పాటిద్దాం...🙏🙏🙏🙏

22/09/2023

మన- #నీమిర్యాలగూడ భవిష్యత్తు కోసం ఈ నెల 27 వ తారీకు బుదవారం రోజున ఒక్క 3 గంటలు స్వచ్ఛంద #మిర్యాలగూడ బంద్ కి సహకరిద్దాం.. #మిర్యాలగూడజిల్లా సాధన కోసం మన వంతు ప్రయత్నం చేద్దాం..

#జైమిర్యాలగూడ✊✊

జిల్లా కేంద్ర ఆసుపత్రి అవ్వాల్సిన నీవు 200 పడకల ఆసుపత్రికే పరిమతమై పరవశించి పోతున్నావా?? #నామిర్యాలగూడ...నీ పరావశాన్ని చ...
05/05/2023

జిల్లా కేంద్ర ఆసుపత్రి అవ్వాల్సిన నీవు 200 పడకల ఆసుపత్రికే పరిమతమై పరవశించి పోతున్నావా??
#నామిర్యాలగూడ...
నీ పరావశాన్ని చూసి నవ్వుకుంటున్నారు నీవు అక్కున చేర్చుకున్న నీ బిడ్డలు...

నీ పరవశాన్ని చూసి ఆనందపడాలో.....
నీ అమాయకత్వాన్ని చూసి ఆరాటపడాలో...
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే వారందరినీ అందలమెక్కించిన నీ నిష్కల్మశమైన మనసుని చూసి మోదించాలో....
నీ పలుకుబడిని,నీ ప్రతిష్టని పరిపరి విధాలుగా పంచుకు వాడుకొని తమ పరపతిని పెంచుకున్న ఉత్సంగులందరి బరువును సైతం మోస్తున్న నీ ఓపికను చూసి.....
నీకు ఎలా మొక్కాలో తెలియని అయోమయంతో,వాళ్ళు బ్రతికుండగానైన జిల్లా గా నిన్ను చూస్తామో లేదో అనే భయం తో బాధపడుతున్నారు...
నీవు జన్మనిచ్చిన నీ #మిర్యాలగూడ బిడ్డలు.....

  #జైమిర్యాలగుడ ✊✊ధన్యవాదములు సర్...మీరు తల్చుకుంటే నిజంగా  #మిర్యాలగూడ_జిల్లా అవడం అనేది చాలా చిన్న విషయం...తప్పకుండా వ...
03/02/2023


#జైమిర్యాలగుడ ✊✊
ధన్యవాదములు సర్...
మీరు తల్చుకుంటే నిజంగా #మిర్యాలగూడ_జిల్లా అవడం అనేది చాలా చిన్న విషయం...
తప్పకుండా విజయం సాధించాలి అని ఆ శివయ్యని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...

17/12/2022

#మా_మిర్యాలగూడెం గోస - #మా_జిల్లా మాగ్గావాలే

కాసుకు
#నా_మిర్యాలగూడ
కరెన్సీకి
#నా_మిర్యాలగూడ
కాంట్రవర్సిలేని
#నా_మిర్యాలగూడ
కొత్తవారి కాంటెస్టుకు
#నా_మిర్యాలగూడ

పోరుకు
#నా_మిర్యాలగూడ
ప్రొటెస్టుకు
#నా_మిర్యాలగూడ
ప్రోగ్రాంలకు
#నా_మిర్యాలగూడ
పోరాటానికి
#నా_మిర్యాలగూడ

రాజకీయానికి
#నా_మిర్యాలగూడ
రాజకీయనాయకులకి
#నా_మిర్యాలగూడ
రాజీపడడానికి #నా_మిర్యాలగూడ
రాచరికానికి
#నా_మిర్యాలగూడ

ఓటుకు
#నా_మిర్యాలగూడ
నోటుకు
#నా_మిర్యాలగూడ
మాటకు
#నా_మిర్యాలగూడ
పాటకు
#నా_మిర్యాలగూడ

అవసరానికి
#నా_మిర్యాలగూడ
అవకాశానికి
#నా_మిర్యాలగూడ
అందుబాటులో
#నా_మిర్యాలగూడ
ఆదుకోవడానికి
#నా_మిర్యాలగూడ

అడగలేని
#నా_మిర్యాలగూడ
అడుక్కోలేని
#నా_మిర్యాలగూడ
అణకువైన
#నా_మిర్యాలగూడ
అణచివేయబడుతున్న #నా_మిర్యాలగూడ

జిల్లా స్థాయికి తక్కువ కాని
#నా_మిర్యాలగూడ అయినా
జిల్లాల జోలికి పోని
#నా_మిర్యాలగూడ
జిల్లాలు ఎన్నైనా సరే మా
జిల్లా మాగ్గావాలని అడుగుతున్న #నా_మిర్యాలగూడ

కాంగ్రెస్సైనా,కామ్రేడైనా,కారోడైనా,కాషాయమైనా #నా_మిర్యాలగూడ

ఎవరికి తక్కువ చేసింది
#నా_మిర్యాలగూడ
ఎవరిని ఎప్పుడు మర్చింది

ఎవరిని ఎప్పుడు విడ్చింది


దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుష్యులోయ్
నా #మిర్యాలగూడ
అంటే ప్రదేశం కాదోయ్
#నామిర్యాలగూడ
అంటే ప్రకాశమోయ్

ప్రజలకోసం ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులారా
ప్రజల ఆకాంక్షను నెరవేర్చకపోతె
ప్రకాశం ప్రకోపమై,ప్రచండమై ప్రజ్వరిల్లుతుంది...


#జై_మిర్యాలగూడ✊✊

Address

Miryalaguda
508207

Website

Alerts

Be the first to know and let us send you an email when My Miryalaguda జై మిర్యాలగూడ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category