Pawan Kalyan - Pithapuram

Pawan Kalyan - Pithapuram Do Your Duty And Dissapear - Pawan Kalyan

మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి•  ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి•  ప్రాణ నష్టం సంభవిం...
27/10/2025

మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

• ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి

• ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి

• తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి

• గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులను గుర్తించి సురక్షిత ప్రదేశాలకు తరలించి వైద్య సేవలు అందించాలి

• పునరావాస కేంద్రాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలి

• పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలి

• మొంథా తుపాను ప్రభావం, సహాయక చర్యలపై కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి. నారాయణ గారు, అధికార యంత్రాంగంతో ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు వీడియో కాన్ఫరెన్స్

మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. ఆంబులెన్సులు, అత్యవసర సర్వీసులు సిద్ధం చేసుకోవాలని, ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచుకోవాలని సూచనలు చేశారు. మండలాల వారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి సమాచారం కోసం అత్యవసర ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. మొంథా తుపాను ప్రభావం, ముందస్తు సహాయక చర్యలపై జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి. నారాయణ గారు, స్పెషల్ ఆఫీసర్ శ్రీ కృష్ణ తేజ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లా పరిధిలోని 12 మండలాలపై ఉండనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికల ద్వారా తెలుస్తోంది. రేపు కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపానును ఎదుర్కొనేందుకు ప్రభావిత మండలాల పరిధిలో యంత్రాంగం పూర్తి సన్నద్దతో ఉండాలి. ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలి. ముందుగా తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇప్పటికే 260 పునరావాస కేంద్రాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, పాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లావ్యాప్తంగా గర్భిణి స్త్రీలు, బాలింతలు, వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇప్పటికే 142 మంది గర్భిణులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. వారికి అవసరం అయిన పౌష్టికాహారం, వైద్య సాయం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసిన విషయాన్ని ప్రజలకు తెలియపర్చండి. తుపాను పట్ల ప్రజల్లో భయాందోళనలు లేకుండా గ్రామాల్లో మైకుల ద్వారా తుపాను ప్రభావం, తీసుకుంటున్న సహాయక చర్యలను వివరించాలి. గజ ఈతగాళ్లను తీర ప్రాంతంతో పాటు లోతట్టు ప్రాంతాలు, వాగుల వద్ద సిద్ధంగా ఉంచాలి. గాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు నేల కూలే అవకాశం ఉంది. తక్షణం వాటిని పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో యంత్రాంగం శాటిలైట్ ఫోన్ల ద్వారా సమాచారం చేరవేయాలి.
• అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి
తుపాను ప్రభావం ఉన్న అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లు, వీర్వోలు అందుబాటులో ఉండాలి. పోలీసులు... ముంపు ప్రాంతాల్లో భద్రత చర్యల పర్యవేక్షణ పెంచాలి. పునరావాస కేంద్రాలకు వెళ్లే ప్రజల ఇళ్లకు సైతం భద్రత కల్పించాలి. ప్రజలు ఇళ్లలో లేని సమయంలో దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలతో ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలి. ఏలేరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలి. బలహీనంగా ఉన్న చెరువులు, వాగులు, కుంటల గట్లను గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలి. గండ్లు పడితే పూడ్చేందుకు వీలుగా ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలి.
తుపాను తీవ్రత ఉన్నందున మత్స్యకార గ్రామాలను మత్స్యశాఖ అధికారులు అప్రమత్తం చేయాలి. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా కట్టడి చేయాలి. మత్స్యకారుల బోట్లు దెబ్బ తినకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. కూరగాయలు, నిత్యవసర సరకుల సరఫరాకు అడ్డంకులు లేకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి.
• కాకినాడ జిల్లాకు రూ. కోటి అత్యవసర నిధి
తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అత్యవసర సాయం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ. 19 కోట్ల విడుదల చేసింది. అందులో కాకినాడ జిల్లాకు కోటి రూపాయిలు కేటాయించారు. ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో సౌకర్యాల కల్పన, ప్రజలకు నిత్యవసర సరుకుల పంపిణీ, ఇళ్లు కూలడం, దెబ్బ తినడం వంటి సంఘటనలు జరిగితే తక్షణ సాయం చేయడం వంటి చర్యలు తీసుకోవాల"ని దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్ లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి Pawan Kalyan ముఖ్యఅతిథిగా ప...
24/10/2025

రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్ లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి Pawan Kalyan ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం, కొండపావులూరులోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ(ఎన్.ఐ.ఆర్.డి)లో జరిగిన ఈ కార్యక్రమంలో అడవుల పరిరక్షణ, ఎకో టూరిజం, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్ర, మానవులు- జంతువుల సంఘర్షణ నివారణ చర్యలు తదితర అంశాలపై దిశానిర్ధేశం చేశారు.

ఈ వర్క్ షాప్ లో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ శ్రీ చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు శ్రీ మల్లిఖార్జున రావు, తదతరులు పాల్గొన్నారు.

PMO India Andhra Pradesh CM Ministry of Environment, Forest & Climate Change, Government of India Press Information Bureau - PIB, Government of India I & PR Andhra Pradesh Press Information Bureau, Vijayawada

1వ తేదీ నుంచి డి.డి.ఓ. కార్యాలయాలు ప్రారంభం పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సమావేశం....!
24/10/2025

1వ తేదీ నుంచి డి.డి.ఓ. కార్యాలయాలు ప్రారంభం పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సమావేశం....!

22/10/2025

Nature knows how to Elevate ⚡️⚡️💥💥🔥

06/10/2025

Record Alert ⚠️
OG Breakeven Completed Share175Cr +✅
OG Gross 300 Cr+✅
10 Days

01/10/2025

Swag kaa baap...💥💥

Manifested for the big moments… and here our audience has taken us ❤️
30/09/2025

Manifested for the big moments… and here our audience has taken us ❤️

Special song out tomorrowHuge Success Meet this Wednesday in Hyderabad🎟️ Ticket prices are being reduced — grab yours no...
28/09/2025

Special song out tomorrow

Huge Success Meet this Wednesday in Hyderabad

🎟️ Ticket prices are being reduced — grab yours now

28/09/2025

OG 3 Days Collections🔥🔥

The BOX OFFICE DESTRUCTOR leaves nothing but HOUSEFULL carnage behind 🙏🏻🙏🏻🔥🔥
27/09/2025

The BOX OFFICE DESTRUCTOR leaves nothing but HOUSEFULL carnage behind 🙏🏻🙏🏻🔥🔥

26/09/2025

They Call Him OG : Day 1 Collection

మంచి థియేటర్ లో చుడండి..
26/09/2025

మంచి థియేటర్ లో చుడండి..

Address

Mangalagiri

Alerts

Be the first to know and let us send you an email when Pawan Kalyan - Pithapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share