Mangalagiri-Tadepalli Municipal corporation

Mangalagiri-Tadepalli Municipal corporation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mangalagiri-Tadepalli Municipal corporation, Government Official, Gowtham Buddha Road, Amaravati, Mangalagiri.

Mangalagiri Tadepalli Municipal Corporation was formed on 23 March 2021 and second largest municipal corporation with 194.41 km2 (75.06 sq mi) area and 2,53,875 of voters in the state of Andhra Pradesh.

09/04/2026
09/04/2026
• స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంక్ లక్ష్యంగా SHG సభ్యులకు అవగాహన సమావేశం.• మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ  పరిధిలో క...
13/03/2026

• స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంక్ లక్ష్యంగా SHG సభ్యులకు అవగాహన సమావేశం.

• మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న స్వచ్ఛ మంగళగిరి 2.0.

మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షన్ నేపద్యంలో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు స్వయం సహాయక సంఘాలు (SHG) సభ్యులు మరియు రిసోర్స్ పర్సన్స్ (RP’s) కు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమీషనర్ అలీం బాషా ,అడిషనల్ కమీషనర్ శకుంతల స్వచ్ఛ సర్వేక్షణలో పట్టణ ర్యాంకింగ్ మెరుగుపరచడానికి చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. ముఖ్యంగా గృహ స్థాయిలో వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత చర్యలు మరియు ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో SHG సభ్యులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిలో హోమ్ కంపోస్టింగ్ పద్ధతిని ప్రోత్సహించాలని ,తడి మరియు పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ,ప్రతి వార్డులో పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలను చురుకుగా భాగస్వామ్యం చేయాలని ,ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే చర్యలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఆయన తెలిపారు.

అనంతరం అడిషనల్ కమీషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంక్ సాధించడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. SHG సభ్యులు మరియు RP’s తమ పరిధిలోని కాలనీలలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ హోమ్ కంపోస్టింగ్, వ్యర్థాల విభజన వంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని సూచించారు.

• కొనసాగుతున్న స్వచ్చ మంగళగిరి 2.O:

అదేవిధంగా నేడు స్వచ్చ మంగళగిరి 2.O కార్యక్రమం కూడా మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ని ఇస్లాం పేట ,నిడమర్రు అలానే తాడేపల్లి లోని డోలాస్ నగర్ సచివాలయముల పరిధి లో నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు కాలనీలలో పరిశుభ్రత చర్యలు చేపట్టి కరపత్రాలు అందచేసి ప్రజల్లో అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం లో డిప్యూటీ కమీషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి ని చెత్తరహిత నగరాలు గా తీర్చిదిద్దటమే లక్ష్యమని ఈ నేపద్యం లో నగరం లో వార్డులయందు ,పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం,ప్రజలను హోమ్ కంపోస్టింగ్ మరియు వ్యర్థాల విభజనలో భాగస్వామ్యం చేయడం వంటి చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మంగళగిరి–తాడేపల్లి ప్రాంతాన్ని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దడంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు మరియు స్వయం సహాయక సంఘాలు కలిసి సమన్వయముతో పనిచేస్తే స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంక్ సాధించగలమని అధికారులు తెలిపారు.

స్వచ్ఛ మంగళగిరి 2.0 మూడవ రోజు కార్యక్రమాలు కొనసాగింపు•పరిశుభ్ర మంగళగిరి లక్ష్యంగా స్వచ్ఛ మంగళగిరి 2.0.మంగళగిరి–తాడేపల్లి...
06/03/2026

స్వచ్ఛ మంగళగిరి 2.0 మూడవ రోజు కార్యక్రమాలు కొనసాగింపు

•పరిశుభ్ర మంగళగిరి లక్ష్యంగా స్వచ్ఛ మంగళగిరి 2.0.

మంగళగిరి–తాడేపల్లి: రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ * పరిధిలో నిర్వహిస్తున్న **స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమం మూడవ రోజు నేడు పట్టణంలోని ద్వారకా నగర్,రూరల్ నందు ఆత్మకూరు,తాడేపల్లి లో పలు ప్రాంతాల్లో విస్తృతంగా కొనసాగింది.

ఈ కార్యక్రమాలలో అడిషనల్ కమిషనర్ శకుంతల ,డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ శానిటేషన్ కార్యక్రమాలను పర్యవేక్షించి, పరిశుభ్రత పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, డ్రైనేజీ కాలువలు మరియు ప్రజా ప్రదేశాల్లో శుభ్రత పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని ఆదేశించారు.

అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతకు మున్సిపల్ సంస్థ చేపడుతున్న చర్యలకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గృహ మాలిన్యాలను తడి–పొడి వ్యర్థాలుగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని ప్రజలకు సూచించారు.

డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు.ఇక డ్రైనేజీ కాలువలు మూసుకుపోకుండా నిరంతర శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని, వాహనాల ద్వారా వ్యర్థాల సేకరణను సమయపాలనతో నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ శకుంతల డిప్యూటీ కమీషనర్ శ్రీకాంత్ ,సెక్రటరీ శ్రీనివాసరావు మరియు కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమంలో భాగముగా అడిషనల్ కమీషనర్ శకుంతల గారి అధ్వర్యంలో...
06/03/2026

మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్
స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమంలో భాగముగా అడిషనల్ కమీషనర్ శకుంతల గారి అధ్వర్యంలో ఘన వ్యర్ధాలు విభజించటం, వార్డు లోని వివిధ రోడ్లు ను శుభ్రము చేయడం జరిగింది.
Cdma Andhra Pradesh
Swachha Andhra Corporation

మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ది:05.03.2026న శానిటేషన్ & ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్...
06/03/2026

మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్
స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ది:05.03.2026న శానిటేషన్ & ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్ కి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం జరిగింది, ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సర్వక్షణ వివిధ ఇండికేటర్స్ ను ఏలా సమర్థవంతంగా నిర్వహించడానికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమములో డిప్యూటి కమీషనర్ శ్రీకాంత్ గారు, అసిస్టెంట్ కమీషనర్ శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.
Cdma Andhra Pradesh
Swachha Andhra Corporation

Mangalagiri-Tadepalli Municipal corporation
05/03/2026

Mangalagiri-Tadepalli Municipal corporation

ప్రాపర్టీ టాక్స్ కట్టడం ప్రతి పౌరుడి బాధ్యత.సమయానికి పన్ను చెల్లిద్దాం, జరిమానాల భారం నుండి తప్పించుకుందాం.మన ఊరి అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం.

మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ   ఆలీo  భాష గారి మార్గదర్శకత్వంలో, నగరాన్ని శుభ్రంగా మరియు ఆరోగ్యక...
04/03/2026

మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్
కమిషనర్ శ్రీ ఆలీo భాష గారి మార్గదర్శకత్వంలో, నగరాన్ని శుభ్రంగా మరియు ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వచ్ఛ మంగళగిరి 2.0
కార్యక్రమం తో ఉత్సాహంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈరోజు స్థానిక కొత్త పేట సచివాలయం నందు చెత్త విభజన (Source Segregation) మరియు పరిశుభ్రతపై స్థానిక ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ కమిషనర్ మాట్లాడుతూ కేవలం పరిసరాల పరిశుభ్రత మాత్రమే కాకుండా, వ్యక్తిగత పరిశుభ్రత (Personal Hygiene) పాటించడం ఎంత ముఖ్యమో అలానే చెత్తను కూడా తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వలన కలిగే ప్రయోజనాలు గురించి మరియు సులభంగా ఎరుపు గా తయారుచేసుకోవచ్చా అని తెలియ చేశారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకూడని,
ప్లాస్టిక్ నివారించాలని తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె శంకుంతల గారు,వివిధ పార్టీల నాయకులూ,
శానిటరీ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు , మహిళ గ్రూప్ సభ్యులు, స్వచ్ఛ అంబాసిడర్లు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన కల్పించడం జరిగింది.

04/03/2026

In a part of swachh Mangalagiri 2.0 Today's conducted many programs like awareness on segregation, distillation and kalajatha program on cleanliness @ Chinakakani village.

04/03/2026

స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమంలో భాగంగా ఇ రోజు ఘండాలయ పేట సచివాలయం లో segregation గురించి అవేర్నెస్ campaign జరిగింది.

Holi Greetings to you all from MTMC.MTMC Extends warm and joyful wishes to all citizens on the auspicious occasion of Ho...
03/03/2026

Holi Greetings to you all from MTMC.
MTMC Extends warm and joyful wishes to all citizens on the auspicious occasion of Holi.
May this festival of colours bring happiness, harmony and prosperity to every home.Let us celebrate Holi in a safe,eco friendly,and responsible manner by avoiding plastic waste and using natural colour. Together,let us keep our city clean, Green and beautiful.

Address

Gowtham Buddha Road, Amaravati
Mangalagiri
522503

Alerts

Be the first to know and let us send you an email when Mangalagiri-Tadepalli Municipal corporation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mangalagiri-Tadepalli Municipal corporation:

Share