27/01/2025
కన్నీటి చుక్కలను బహిరంగంగా జారవెయ్యడానికి కనులు కంపించిపోయాయి.
మనసులోని బాధను, ఆక్రోశాన్ని బయట నాలుకకు చేరవెయ్యడానికి గొంతులు వణికిపోతూ.. దిగమింగి మనసులోనే గడ్డగట్టేలా చేసింది.
కాదని వచ్చిన కన్నీరు, బాధలు బయటకు చెప్పినవారినే.. బాధితులుగా మార్చి కేసుల్లో ఇరికించి నరకం అనుభవించేలా చేసిన భయానక రోజులు అవి..
రాజ్యాంగ ప్రాథమిక హక్కులు కూడా లేని దౌర్భాగ్యంతో చైతన్యవంతమైన ఆంధ్రా చేష్టలుడిగి మౌనంగా మూగబోయిన వేళ
దయతో ఒక్క అవకాశం ఇచ్చి, నిర్దయగా మారిన జ(గ)నాసురిని గుప్పెట్లో.. గుండెల్లో మంటలను చల్లార్చుకొనే దారి కనిపించక రోదిస్తున్న వేళ
2023 గణతంత్ర దినోత్సవం మరుసటి రోజు, విదేశాల్లో చదువుకొని హాయిగా పాల వ్యాపారం చేసుకోవాల్సిన పసి యువకుడు పాదయాత్ర అంటూ ప్రజాల్లోకి వచ్చాడు.
చేతిలో మైకు లాగేసి, నీళ్ల సీసాలతో దాడులు చేస్తూ.. వాహనాన్ని కూడా లాగేసుకొంటుంటే..
మొండి ధైర్యంతో..
తన ప్రాణాలు ప్రక్కనబెట్టి
అవమానాలు దిగమింగుతూ..
సమాజంలోని వారి ఒక్కొక్కరి సమస్య, సంఘాల సమస్యలు, ప్రాంతాల సమస్యలు, అట్టడుగు సామాజిక వర్గాల సమస్యలను ఏకరువుపెడుతుంటే..
సముద్రపు అలల కోతకు గురయ్యే ఒడ్డులా ఓపికగా విన్నాడు.
తానున్నాననే భరోసాగా నిలబడేసరికి.. జన తుఫాను మొదలైంది.
మాకేమీ వద్దు.. సైకో పోవాలి, మా పిల్లలకు ఉద్యోగాలే పరిష్కారం అనే గళాలను విన్న ఆ యువగళం తన మనసులో అప్పుడే బలంగా అనుకున్నాడు.
20 లక్షల ఉద్యోగాలు తెస్తా అన్నాడు.
మళ్లీ శంఖారావం పూరించాడు.
గెలిచిన వెంటనే ఆ బాధ్యత తీసుకున్నాడు. అమెరికా నుండి దావోస్ వరకు చుట్టేశాడు. ఆంధ్రాలో ఐటీ వస్తుంది అంటే నమ్మని రోజులను మార్చాడు. గూగుల్ నుండి టీసీఎస్ వరకు ఒప్పించాడు. లక్షలాది ఉద్యోగాల కోసం ప్రధానిని కూడా కలిసే తీరికలేక నిష్టూరపడుతూ.. కష్టపడుతున్నాడు.
రెండేళ్ల క్రితానికి నేటికి
ఎంత మార్పు, ఎంత స్వేచ్ఛ, ఎన్ని ఆశలు, ఎంత సానుకూలత అనేది మనం చూస్తున్నాం.
సమాజాన్ని చైతన్యం చేస్తూ.. ఒక్కటి చేసి నడిపించిన నాయకుడిగా.. మానవ వనరుల అభివృద్ధితో మొదలెట్టి పద్దతిగా పని చేసుకువెళుతున్నాడు.
యువగళం మొదలై రెండేళ్లు పూర్తయ్యి, యువకుల కలల సాధన దిశగా వెళుతున్న మన ఆంధ్రా ప్రయత్నాలు ఫలించాలని కోరుకొంటున్నా.
దృశ్యం : బిజెపి, జనసేన, టిడిపి నాయకులు నిన్న వైజాగ్ వచ్చిన సందర్భంగా స్వాగతం చెబుతున్నది.