06/04/2026
ఏప్రియల్ నెల మొదటి జనరల్ బాడీ మీటింగ్ కి హాజరు అయిన లయన్స్ సభ్యులకు ధన్యవాదములు, ఈ మీటింగ్ లో గత నెలలో జరిగిన క్లబ్ కార్యక్రమాలకు సహకరించిన డాక్టర్ ఎస్ సూర్యనారాయణ రెడ్డి గారికి, కాళ్ల బాబు గారికి గనిశెట్టి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది,
1) మే నెలలో మున్సిపల్ కార్మికులకు సభ్యుల సహకారం తో రేడియం స్టికర్ గల waist coat లు 120 @400 పంపిణీ చేయుటకు నిర్ణయం తీసుకున్నాము, ఈ మహా కార్యక్రమం లో భాగంగా విరాళం ఇచ్చిన దాతలు అందరికీ ధన్యవాదాలు, వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది.
2.) ఈ నెలలో కొనే వీర్రాజు గారి సహకారం తో హెల్త్ క్యాంపులు రెండు వాకర్స్ క్లబ్ సభ్యుల సమక్షంలో ఏర్పాటు చేయబడుతుంది 1 బురుగుంట చెరువు పార్క్ లో, 2 రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో.
3)జగ్గంపేట లయన్స్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని ఈ నెలలో ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరిగినవి, ఈ కార్యక్రమానికి మన లయన్స్ సభ్యులు జి తాతరాజు గారు 5000 సహకారం అందించి వారే ఈ కార్యక్రమానికి కో ఆర్డినేషన్ చేస్తారు. తేదీ త్వరలో ప్రకటిస్తారు.
4. చిరు వ్యాపారులకు మండు వేసవిలో వేడి నుండి రక్షణకు 10 మందికి అవసరమైన గొడుగులు మన సభ్యులు గమనించి అవి అవసరమైన వారికి అందిచే విధంగా
చేయాలని నిర్ణయించారు.
ప్రతి కార్యక్రమం లో సహకరిస్తున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ శుభరాత్రి.
లయన్స్ క్లబ్ మండపేట
PST TEAM