07/12/2022
*SC,ST,BC,మైనారిటీ విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం..*
త్వరలో ప్రగతి భవన ముట్టడి..
*మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు టిడిపి టిఎన్ఎస్ఎఫ్ 1500 మంది విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ధర్నా*..
*సంజయ్ కుమార్. తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంటు అధ్యక్షులు*
*TNSF రాష్ట్రఅధ్యక్షులు పర్లపల్లి రవీందర్,* లు మాట్లాడుతూ
▪️పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని TNSF అధ్వర్యంలో. IB చౌరస్తా నుంచి ర్యాలీ గా వెళ్లి మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడం జరిగింది..
ఈ సందర్భంగా *బి సంజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు*
*టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్,లు మాట్లాడుతూ*..
▪️ గత రెండు సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా విద్యార్థి నాయకుడు గా అసెంబ్లీ లో అడుగు పెట్టిన mla బాల్క సుమన్ రావు గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు ఒక్క రోజు కూడా అసెంబ్లీ లో.మాట్లాడా లేదు మరియు స్కాలర్షిప్ బకాయిలు దాదాపు 3300 కోట్లు నిధులు విడుదల చేయక విద్యార్థుల జీవితాలతో చెలగటమడుతున్నాడు Mla మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి అని అన్నారు.
▪️ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు బకాయిల మీద ఆధారపడి చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈబిసి మైనారిటీ విద్యార్థులను విద్యకు దూరం చేసే దురుద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారని,గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో, వివిధ కోర్సులను పూర్తి చేసినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
▪️ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉప ఎన్నికల మీదున్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదని అన్నారు.
▪️ అదేవిధంగా విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చినా అని చెప్పుకునే బాల్క సుమన్ కు తెలంగాణ రాష్ట్రంలో అదే విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించక పోవడంతో ఇబ్బందులు పడుతుంటే కనబడడం లేదా అని ప్రశ్నించారు..
▪️ బాల్క సుమన్ నిజంగా విద్యార్థి ఉద్యమ నాయకుడు అయితే ఫీజు బకాయిల జాప్యం విషయంలో కేసీఆర్ ను నిలదీయాలని డిమాండ్ చేశారు..
▪️ ఎక్కడో ఉన్న హర్యానా బీహార్ రాష్ట్రాల్లో ఉన్న రైతుల బాధలు కనిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల బాధలు ఎందుకు కనిపించట్లేదని ప్రశ్నించారు.
▪️ నిజామాబాద్ గడ్డమీద ముఖ్యమంత్రి కూతురు కవితమ్మ ఎంపీగా ఓడిపోయిన తర్వాత కేవలం 17 నెలల్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాజకీయ భద్రత కల్పించిన ముఖ్యమంత్రి గారికి రాష్ట్రవ్యాప్తంగా కవితమ్మ లాంటి అనేకమంది పేద బిడ్డలు ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు..
▪️ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో పరిస్థితి దారుణంగా ఉందని, సరైన వసతులు లేక, మెస్ చార్జర్ లు పెంచక పోవడంతో పౌష్టికాహారం అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు నరక కూపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు..
▪️ కావున పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అదేవిధంగా ప్రగతి భవన్ ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో.. తెలుగు యువత పెద్దపల్లి పార్లమెంటు అధ్యక్షులు వాసాలా సాగర్
TNSF....శివగౌడ్,
వాసాల సంపత్
సాయి రామ్ పోల్కర్ వాజీద్ Savinder savinderchowhan................ పాల్గొనడం జరిగింది.