24/12/2024
పత్రికా ప్రకటన
తేది:24/12/2024
నారాయణ పేట
💥 కేంద్ర మంత్రి అమిత్ షాను భర్తరఫ్ చేయాలి
💥 బీజేపీ,కాంగ్రెస్ ఒకే తానులో ముక్కలే
💥 అమిత్ షా వ్యాఖ్యలపై మోడీ ఎందుకు మాట్లాడరు?
💥 తక్షణమే అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ బీఎస్పీ నిరసన ర్యాలీ
💥 అంబేద్కర్ అంటే బీజేపీకి అంత విషం ఎందుకు?
💥 బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్
బాబా సాహెబ్ అంబేద్కర్ అంటే బీజేపీకి అంత విషం ఎందుకని బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ ప్రశ్నించారు.అంబేద్కర్ గారిని అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై,బీఎస్పీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ,కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు. నాడు అంబేద్కర్ గారిని కాంగ్రెస్ అవమానిస్తే,నేడు బీజేపీ అవమానిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానిస్తూ అమిత్ షా మాట్లాడితే ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలన్నారు.అమిత్ షా కేంద్ర మంత్రి పదవి అంబేద్కర్ బిక్షనే అన్న విషయం మరిచిపోరాదన్నారు.మోడీ గారికి అంబేద్కర్ పట్ల,రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్న అమిత్ శా ను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య,జిల్లా ఇంచార్జీ వెంకటేష్ ముదిరాజ్,జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్,నారాయణ పేట అసెంబ్లీ అధ్యక్షులు ఎర్ర హన్మంతు,మక్తల్ అసెంబ్లీ ఇంచార్జీ పాలెం వెంకటయ్య,అధ్యక్షులు గువ్వల తిరుపతి,సోషల్ మీడియా ఇంచార్జీ అశోక్,పేట మండల అధ్యక్షులు రమేష్,బీఎస్పీ నాయకులు గౌతం, సయ్యద్ మహమూద్,అజయ్,రాము,చెన్నయ్య,హన్మంతు,వీరన్న,రాజు,రవి యాదవ్,అరవింద్,జడల బాల్ రాజ్, మక్తల్ మండల అధ్యక్షులు పరుశురాం, కృష్ణ మండల అధ్యక్షులు మల్లికార్జున్,తిరుపతి, భీములు,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు