Rachala

Rachala రాచాల గ్రామ చరిత్ర చూస్తే పూర్వం 'రాజ?

ఈ రాచాల గ్రామం తన చరిత్రపుటల్లో అతిపురాతన చరిత్ర దాచుకుంది. పూర్వకాలంలో ప్రజలు ఈ గ్రామాన్ని 'రాజ్యశాల'గా పిలిచేవారు. కాలగమనంలో 'రాచాల'గా రూపాంతరం చెందింది.
కీ.శ. 6వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు ఈ గ్రామాన్ని పల్లవ రాజు వంశీయులు పరిపాలించారు. ఆ తర్వాతి కాలంలో యాదవులు, కందూరుబోడులు మరియు కాకతీయులు పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. చివరగా రాణి రుద్రమదేవి రాచాల పరిసర ప్రాంతాలను పరిపాలించ

ారు. ప్రతాపరుద్రుని సైన్యాధిపతి గోనగన్నారెడ్డి శత్రువుల బారి నుండి గ్రామాన్ని రక్షించేందుకు ప్రధానకూడలిలో రెండు అంతస్తులతో 60 అడుగుల పైనగల కోటబురుజును నిర్మించగా, గ్రామం చుట్టూ మరో 8 చిన్నచిన్న బురుజులు నిర్మించిన ఆనవాళ్ళు ఇప్పటికీ శిథిలావస్థలో కనిపిస్తాయి. ఈ గోనగన్నారెడ్డి కాలంలోనే ఈ గ్రామాన్ని "రాజ్యశాల"గా పిలిచేవారని, కాలగమనంలో "రాచాల"గా రూపాంతరం చెందిందని అంటారు. తర్వాత వనపర్తి సంస్థానాధీశుల పాలనలోకి వెళ్ళగా, ఈ గ్రామానికి చెందిన ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు గద్దెనాగేశం లాంటి వారు వనపర్తి రాజారామేశ్వరరావు ఆస్థానంలోని రాజవైద్యుల దగ్గర ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నారు.
12వందల సంవత్సరాల క్రితం చాళుక్యులు నిర్మించిన శివాలయం కూడా ఎంతో ప్రశస్తిని పొందిందని ప్రసిద్ధి. అతి పురాతనమైన ఆంజనేయస్వామి దేవాలయం మరియు మన తెలంగాణలో అరుదుగా కనిపించే దేవాలయాలలో సరస్వతి దేవాలయం ఈ రాచాల(రాజ్యశాల) గ్రామం సొంతం.
ఇంతటి పురాతన చరిత్ర కలిగిన గ్రామం ᖇᗩᑕᕼᗩᒪᗩ.

30/01/2025
30/01/2025
03/11/2024

U/17 & U/19 teams @ ZPHS Rachala in Rachala , Mahabubnagar , Telangana

3వ తారీకున జరగబోయే  #రాష్ట్రస్థాయి  #కబడ్డీ పోటీలకు మన  #రాచాల గ్రామం వేదిక కానుంది
02/11/2024

3వ తారీకున జరగబోయే #రాష్ట్రస్థాయి #కబడ్డీ పోటీలకు మన #రాచాల గ్రామం వేదిక కానుంది

02/09/2024

రాచాలాకు వచ్చే దారిలో పొన్నకల్ చెరువు అలుగు ఉదృతంగా పారుతుంది, ఇట్టి దారిని పొన్నకల్ గ్రామపంచాయతీ వారు మూసి వేస్తున్నారు కనుక ఎవరు కూడా ఈ దారికి రావద్దు
ముఖ్య పనులు ఏమైనా ఉంటే నాగయ్య పల్లి వయా దాసరిపల్లి వేముల మీదుగా వెళ్ళవచ్చు
గ్రామ ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోగలరు

02/09/2024

2020 లో అలుగు పారిన Rachala చెరువు మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత నేడు అలుగు దూకడం జరుగుతుంది.

Address

Mahbubnagar
509219

Website

Alerts

Be the first to know and let us send you an email when Rachala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share