PS Mahabubnagar I Town

PS Mahabubnagar I Town Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PS Mahabubnagar I Town, Police station, Mahabubnagar I Town Police Station, Mahabubnagar District, Telangana, Mahabubnagar.

15/11/2025

హోంగార్డ్ ఎస్. లక్ష్మయ్య గారు 21 సంవత్సరాల విశిష్ట సేవ అనంతరం పదవీ విరమణ

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ విభాగానికి చెందిన హోంగార్డ్ ఎస్. లక్ష్మయ్య (నంబర్ 592) గారు 21 సంవత్సరాల విశిష్ట సేవ అనంతరం ఈరోజు పదవీ విరమణ (రిటైర్మెంట్) పొందారు.

ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ —
“హోంగార్డ్ ఎస్. లక్ష్మయ్య గారు తమ విధులను నిబద్ధత, క్రమశిక్షణతో నిర్వర్తించారు. పోలీస్ శాఖలో ఆయన సేవలు స్ఫూర్తిదాయకమైనవి. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని జిల్లా పోలీస్ శాఖ తరఫున ఆకాంక్షిస్తున్నాను,” అని తెలిపారు.
పోలీస్ శాఖ తరఫున హోంగార్డ్ ఎస్. లక్ష్మయ్య గారికి సన్మానం నిర్వహించబడింది.
ఆయన సేవలకు గుర్తింపుగా స్మారక చిహ్నం అందజేయబడింది.

ఈ కార్యక్రమంలో హోమ్ గార్డ్ కమాండెంట్ వెంకటేశ్వర్లు గారు, అడిషనల్ ఎస్పీ ఎన్.బి. రత్నం గారు, డి.ఎస్.పి DCRB జి.వి. రమణారెడ్డి డి.ఎస్.పి DTC గిరిబాబు ఆర్‌ఐలు నగేష్, కృష్ణయ్య, ఆర్‌ఎస్‌ఐ ఇందిరా, ఇతర హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana State Police

15/11/2025
15/11/2025

చిన్నారులు భవిష్యత్‌ కిరణాలు. వారిని పదిలంగా కాపాడుకుందాం..చెడు వ్యసనాలు, సైబర్ మోసాలు వారికి దరిచేరకుండా రక్షించుకుందాం. భావి భారత నిర్మాతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

15/11/2025

దేవరకద్ర పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపిఎస్
జిల్లా పోలీసు అధికారి శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ గారు ఈ రోజు దేవరకద్ర పోలీస్ స్టేషన్‌ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల రిజిస్టర్లు, శిక్షణా పుస్తకాలు, FIR రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజ్ మరియు స్టేషన్ పరిశుభ్రత వంటి అంశాలను సమీక్షించారు.

ఎస్పీ గారు సిబ్బందితో సమావేశమై, స్థానిక నేర నియంత్రణ పరిస్థితులు, మహిళల భద్రత, రాత్రి పహారా విధులు, సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాల గురించి ఆరా తీశారు. ప్రజలకు వేగవంతమైన మరియు న్యాయసమ్మతమైన సేవలందించడంలో ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ,
“పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే, ప్రతి కేసును పారదర్శకంగా విచారించడం అత్యంత అవసరం. ప్రజలతో మర్యాదపూర్వకంగా, మానవతా దృష్టితో వ్యవహరించాలి. ప్రతి పోలీస్ సిబ్బంది తమ విధులను కర్తవ్యభావంతో నిర్వర్తించి, నేరాల నిరోధక చర్యల్లో భాగస్వాములు కావాలి” అని సూచించారు.

ఎస్పీ గారు మహిళల భద్రత, షీ టీమ్ కార్యకలాపాలు, మరియు భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవల గురించి కూడా వివరించారు. ప్రజలలో పోలీసుల పట్ల విశ్వాసం పెంచేందుకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎస్‌ఐ నాగన్న, స్టేషన్ సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Telangana State Police

15/11/2025
15/11/2025

మా పెళ్లికి రండి! అంటూ అపరిచిత నంబర్ల నుంచి వచ్చే ఇన్విటేషన్లతో జాగ్రత్త. అందులోని స్పెషల్ వీడియోను చూసేందుకు లింక్ క్లిక్ చేయాలంటూ ఉన్న సందేశాన్ని నమ్మొద్దు. ఎవర్నీ నమ్మి ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయొద్దు.

15/11/2025

థ్రిల్‌కోసం వేగం పెంచితే ఏరికోరి ప్రమాదాలను కొనితెచ్చుకున్నవాళ్లు అవుతారు. రోడ్లు ఖాళీగా ఉన్నాయని స్పీడ్‌గా వెళ్లి ప్రమాదాలను స్వాగతించొద్దు. మీ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇతరుల్ని ఇబ్బంది పెట్టొద్దు.

15/11/2025

డేటింగ్ యాప్స్‌లో స్నేహాలతో జాగ్రత్తగా ఉండండి. అవతలి వ్యక్తుల చాటింగ్‌ను చూసి మోసపోవద్దు. మీ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు వారి చేతుల్లోకి వెళ్లనివ్వొద్దు. మంచిగా మాట కలిపి డబ్బులు కాజేసే మోసగాళ్లుంటారు జాగ్రత్త.

15/11/2025

"PRO శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన మహబూబ్‌నగర్ జిల్లా PRO ఎస్.శ్రీనివాసులకు రాష్ట్ర డిజిపి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం తీసుకోవడం జరిగింది"

హైదరాబాద్‌లోని పెట్లబుర్జ్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (CPTC) నందు మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లకు (PROs) నిర్వహించిన శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ శివధర్ రెడ్డి IPS గారు ప్రధాన అతిథిగా ముగింపు సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా ప్రజా సంబంధాల అధికారి ఎస్. శ్రీనివాసులు గారు శిక్షణలో సఫలంగా పాల్గొని, రాష్ట్ర డిజిపి శ్రీ శివధర్ రెడ్డి IPS గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రం స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి IPS గారు శ్రీనివాసులు గారిని అభినందిస్తూ, "ప్రజా సంబంధాల విభాగం పోలీస్ వ్యవస్థకు ముఖచిత్రం వంటిది. శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను జిల్లాలోని పోలీస్ ప్రజా సంబంధాల పనిలో ఉపయోగించి మరింత చురుకుగా పనిచేయాలని" సూచించారు.

ఈ కార్యక్రమంలో IGP (P&L) శ్రీ రమేష్ రెడ్డి IPS గారు, DCP (CAR) శ్రీమతి రక్షిత మూర్తి IPS గారు, శిక్షణా సమన్వయకర్త శ్రీ మధుసూదన్ గారు, మరియు తెలంగాణ సురక్ష బృందం సభ్యులు పాల్గొన్నారు.

Telangana State Police

Address

Mahabubnagar I Town Police Station, Mahabubnagar District, Telangana
Mahabubnagar
509001

Telephone

+919440795706

Website

Alerts

Be the first to know and let us send you an email when PS Mahabubnagar I Town posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category