08/02/2025
“ఎం కే కన్వెన్షన్ లో మున్నూరుకాపు వివాహ పరిచయ వేదిక ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ను ప్రారంభించిన మున్నూరుకాపు సంఘం నాయకులు”
కేసముద్రం. ఫిబ్రవరి 08 : కేసముద్రం లోని అమీనపురం “ఎం కే కన్వెన్షన్ లో నిర్వహిచిన ఈనాడు పెళ్లిపందిరి ఆద్వర్యంలో ఉచితంగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమాన్ని మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షులు నీలం శ్రీనివాస్ , జిల్లా ప్రధాన కార్యదర్శి చందా గోపి, జిల్లా ముఖ్య సలహా దారుడు తుంపిళ్ళ శ్రీనివాస్, కేసముద్రం మండల మున్నూరుకాపు గౌరవ సలహాదారుడు రావుల మురళిలు ఘనంగా ప్రారంబిచారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నీలం శ్రీనివాస్, చందా గోపి లు మాట్లాడుతూ తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరిలో అన్నికులలకు చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అవివాహితుల కోసం వేలాది ప్రొఫైళ్లను అందుబాటులోకి తెచ్చి మెరుగైన సేవలు అందిస్తున్నదని, దానిలో భాగంగా మున్నూరుకాపు వివాహ పరిచయ వేదిక ఉచితంగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కోసం కేసముద్రం మండల కేంద్రంలో ఈ కార్యకమం రెండు రోజుల పాటు ఏర్పాటు చేయడం సంతోషకరం అని అన్నారు . తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తూ తగిన భాగస్వామిని వెతకడంలో ఈ వివాహ వేదిక మీకు ఎంతో సాయపడుతుంది పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కమటం స్వామి, కోశాధికారి సింగంశెట్టి ఏకాంతం, వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుల సుధాకర్, ముత్యాల శివ కుమార్ ,కముటం పెద్ద స్వామి, తోట నాగన్న , లక్కకుల సత్యనారాయణ , కొంతం సదానందం , పెళ్లి పందిరి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.