25/09/2023
*NSUI మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెరుమాండ్ల చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో తరుని N.G.O గారి సహకారంతో డిగ్రీ విద్యార్థినిలకి అవగాహన సదస్సు ఏర్పాటు.*
ఈ సందర్బంగా తరుని స్వచ్చంద సంస్థ(N.G.O) అధినేత మమతరఘువీర్ గారి ఆదేశాల మేరకు వచ్చిన సంస్థ సభ్యులు జ్యోతి గారు అమ్మాయిలతో మాట్లాడుతూ నేటి పోటీ సమాజంలో అందరూ సమానంగా బ్రతకాలంటే సమాజం మీద అవగాహనతో పాటు నేటి రోజులలో చిన్న నుండి పెద్ద వరకు అమ్మాయిల మీద జరుగుతున్న దాడులని ధైర్యంగా ఎదురుకుంటు ముందుకు వెల్లలన్నారు. పాత కాలలాగా ఇప్పడు కూడా కొన్ని బాల్య వివాహాలు జరుగుతున్నాయని అలా చేయడం వలన వారి జీవితం నాశనం అవడంతో పాటు ఆరోగ్య పరంగా కూడా చాలా సమస్యలు ఎదురుకొని ఆఖరికి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఇంతటి నాగరికత వచ్చాక కూడా ఇలాంటివి జరగకుండా పిల్లల తల్లిదండ్రులు, సమాజ పెద్గలు యువత కూడా వారికి అర్ధమయ్యేలా చెప్పి బాల్య వివాహాలు జరగకుండా తగు జాగ్రత్తలూ తీసుకోవాలన్నారు. వాటితో పాటు N.G.O తరపున అమ్మాయిలకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అందిస్తామని తెలిజేశారు.
*ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ అందరికి సామాజిక బాధ్యత ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు. మేము మహబూబాబాద్ జిల్లాలో యువతి,యువకులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వారి తరపున మేము ముందుండి పోరాడతామని తెలిపారు. నేటి రోజులలో అమ్మాయిలు జాగ్రతతో పాటు ధైర్యంగా అన్నిటిని ఎదురుకొని సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు.
*కళాశాలలో , పాఠశాలల్లో ఎక్కడ అమ్మాయిలకు ఎవరితో అయిన శారీరక,మానసిక వేధింపులు ఉంటే మాకు కానీ , పోలీస్ వారికి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని కోరుకుంటున్నాం అన్నారు.*
ఈ కార్యక్రమంలో యూవజన కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ జీలుగుల భాస్కర్ మరియు NSUI జిల్లా నియోజకవర్గ నాయకులు పట్ల చందు పవన్ మరియు N.G.O సభ్యులు భవానీ,అంజలి పాల్గొనడం జరిగింది.
Venkat Balmoor