BYS Madanapalli

BYS Madanapalli The Motto of This Organization is Taking People Problems Limelight And Do Best For The People.

15/10/2024
ప్రచురణార్థం/ ప్రసారార్థం తేదీ.18-2-2024, మదనపల్లె - ఈరోజు బహుజన యువసేన బి వై ఎస్ మదనపల్లి ఆధ్వర్యంలో మన విలువైన ఓటు, మన...
18/02/2024

ప్రచురణార్థం/ ప్రసారార్థం
తేదీ.18-2-2024, మదనపల్లె -
ఈరోజు బహుజన యువసేన బి వై ఎస్ మదనపల్లి ఆధ్వర్యంలో మన విలువైన ఓటు, మన మదనపల్లి జిల్లా సాధనకై, కార్యక్రమంగా ప్రచార రతాన్ని ఇండిపెండెంట్, డైనమిక్ కురువంక సర్పంచ్ అయిన, చిప్పిలి చలపతి గారు ప్రచార రతాన్ని ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ మదనపల్లి జిల్లా గా ప్రకటించి ఉంటే మదనపల్లి ప్రజలంతా ఎంతో అభివృద్ధి చెందేవారని, జిల్లా హోదా కలిగి ఉంటే పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుబడులు మదనపల్లిలో పెట్టే వారిని, దానివలన యువతకు ఉపాధి కలిగి ఉండేదని పునీత్ అన్నారు, అలాగే జిల్లాకి కావలసిన అన్ని అర్హత కలిగి ఉన్న మదనపల్లి మీ జిల్లా కాకపోవడానికి కారణమైన పార్టీలకు గుణపాఠం నేర్పుతూ, అలాగే మదనపల్లి జిల్లా ఏర్పాటుకు సహకరించే పార్టీలను గుర్తిస్తూ, అంబేద్కర్ గారు తన రక్త మాంసాలని పరంగా పెట్టి తెచ్చిన మన ఓటును రాబోయే ఎన్నికల్లో ఆలోచనతో వినియోగించుకొని మన మదనపల్లిని జిల్లాగా మనమే సాధించుకోవాలని పునీత్ అన్నారు, అలాగే అంత మంచి కార్యక్రమాన్ని మంచి వ్యక్తి, స్నేహభావం తో నిత్యం సేవ చేస్తూ అందుబాటులో ఉండే వ్యక్తి చలపతి గారు చేతుల మీదుగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని పునీత్ అన్నారు, తరువాత జెండాను ఊపి కురువంక సర్పంచు గారు ప్రచార రథాన్ని ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో బి వై ఎస్ నాయకులు హరీష్, సుధాకర్,గొల్లపల్లి శశి, విద్యాసాగర్, ముబారక్, బాలు, జగ్గా, గాంధీ పురం శశి కుమార్, సాదిక్, భరత్, తదితరులు పాల్గొన్నారు

05/02/2024
01/02/2024

రెండు రోజుల క్రితం బహుజన యువసేన బి వై ఎస్ మదనపల్లి అధ్యక్షుడు జి పునీత్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈరోజు మదనపల్లి లోని ప్రవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ను dy dmho దేవ శిరోమణి గారు వారి టీం మరియు బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ తో కలిసి తనిఖీ చేయడం జరిగింది, తనిఖీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, సోమవారం నాడున బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ గారు రాయచోటిలో జేసీ గారికి మరియు డిఎంహెచ్వో గారికి మదనపల్లిలోని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయ దోపిడీ గురించి ఫిర్యాదు చేయడం జరిగిందని,ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు ఆసుపత్రుల్లో తనిఖీ చేయడం జరిగిందని, దాని ద్వారా మదనపల్లిలోని రెయిన్బో చిన్నపిల్లల హాస్పిటల్ మరియు ప్రవీణ్ న్యూరో హాస్పిటల్ కు రికగ్నైజేషన్ లేదని అనాథరైజుడ్ గా హాస్పిటల్ ను నడుపుతున్నారని, కావున వాటిని త్వరలో డి ఎంహెచ్వో గారు ఎస్పీ గారి బృందంతో వాటిని సీజ్ చేస్తారని, మరియు ఆధ్యా, మోడ్రన్ హాస్పిటల్ లో అవకతవకలు జరుగుతున్నాయని వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు, అలాగే ఇవి అనాథరైజ్డ్ హాస్పిటల్స్ కావడంతో వాటి గురించి వారికి ఇంతవరకు తెలియదని కేవలం పునీత్ గారి ఫిర్యాదు మేరకే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని, పునీత్ కు కృతజ్ఞతలు తెలిపారు, అలాగే అన్యాయం జరుగుతున్న మనకెందుకులే అని పట్టించుకోని పరుగులు తీస్తున్న సమాజంలో ఇలా ప్రజలకు అన్యాయం, ప్రమాదం జరుగుతున్న విషయాల పట్ల పెద్ద వహించి వెలుగులోకి తీసుకొచ్చిన పునీత్ కార్యక్రమం చేశారనిదేవ శిరోమణి గారు కొనియాడారు, ఈ హాస్పిటల్స్ ఏ కాకుండా అన్ని హాస్పిటల్స్ పై తనిఖీ నిర్వహించి అర్హత లేని హాస్పిటల్స్ ను వెంటనే మూసివేసి అలాగే దోపిడీ చేస్తున్న హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు, ఈ కార్యక్రమంలో బహుజన్ అధ్యక్షుడు పునీత్, బహుజన యువసేన నాయకులు సుధాకర్, చిరంజీవి, శివకుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు

నిన్నటి రోజున అనగా29/01/2024 న రాయచోటిలో జాయింట్ కలెక్టర్ గారికి మరియు DMHO గారికి మదనపల్లి లోని ప్రవేట్ కార్పొరేట్ హాస్...
30/01/2024

నిన్నటి రోజున అనగా29/01/2024 న రాయచోటిలో జాయింట్ కలెక్టర్ గారికి మరియు DMHO గారికి మదనపల్లి లోని ప్రవేట్ కార్పొరేట్ హాస్పిటల్ గురించి ఫిర్యాదు చేస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బహుజన్ యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్నిన్నటి రోజున అనగా29/01/2024 న రాయచోటిలో జాయింట్ కలెక్టర్ గారికి మరియు DMHO గారికి మదనపల్లి లోని ప్రవేట్ కార్పొరేట్ హాస్పిటల్ గురించి ఫిర్యాదు చేస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బహుజన్ యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్

24/01/2024

ఈరోజు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు బహుజన్ యువసేన బి వై ఎస్ మదనపల్లి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి మదనపల్లిలో ప్రవేట్ కార్పొరేట్ మరియు ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాలు అరాచకాల గురించి ఫిర్యాదు చేయడం జరిగింది, బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ మదనపల్లి లోని ప్రవేట్ కార్పొరేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలను నిలువుగా దోపిడీ చేస్తున్నారని, హిందువులైన ముస్లింలైన క్రిస్టియన్ లైన్ కలిసి చేతులెత్తి మొక్కే దేవుడు డాక్టర్ లేనని, దేవుడు లాంటి డాక్టర్లు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి, క్యాష్ చేసుకుంటూ వైద్యాన్ని ఒక వ్యాపారంగా మార్చేశారని పునీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు, మదనపల్లిలోని ఆద్య కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో తప్పుడు రిపోర్ట్స్ తో ఆపరేషన్ చేయాలంటూ డబ్బులు వసూలు చేస్తూ, ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేసినా కూడా డబ్బులు వసూలు చేస్తున్న ఆద్య హాస్పిటల్ యాజమాన్యం అని పునీత్ చెప్పారు, ఆపరేషన్లు పేద ప్రజలకు ఉపయోగపడాలని ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు తండ్రి అయినా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అమలుపరిచారని అలాంటి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకున్న డబ్బులు వసూలు చేయడం ఏమిటని పునీత్ ప్రశ్నించారు, ప్రవీణ్ న్యూరో హాస్పిటల్ యాజమాన్యం అయితే బెంగళూరు చెన్నై సిటీలో వంటి స్థాయిలో డబ్బులు వసూలు చేస్తూ, బిల్స్ డిస్చార్జ్ అమరు ఇవ్వమంటే ఇవ్వడానికి నిరాకరిస్తూ ప్రశ్నించిన వారిని దూషించిన గతంలో కూడా జరిగాయని పునీత్ చెప్పారు, మరీ ముఖ్యంగా చిన్నపిల్లల హాస్పిటల్ అయినా రెయిన్బో హాస్పిటల్ అక్కడైతే చిన్నపిల్లలు ఏ సమస్య మీదకు వెళ్ళినా కూడా ఐసీయూలో చేర్పించాలని తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసి వేలకు వెళ్ళు గుంజుకోవడం జరుగుతుందని పునీత్ తెలిపారు, ప్రవేట్ హాస్పిటల్స్ ఇలా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకోవడానికి వెళ్తే అధికారులు వైద్యులు ఇక్కడ వాటికి సంబంధించిన డాక్టర్లు లేరని బయట ఉన్న ప్రైవేట్ డాక్టర్లు తో కమిషన్లకు కుమ్మక్కై గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చిన పేషెంట్లను వీరే ప్రవేట్ హాస్పిటల్కు తరలిస్తున్నారని, డాక్టర్లు లేక వైద్యం అందించకపోవడమే కాకుండా బయట హాస్పిటల్ కు పంపించడం ఏమిటని పునీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు కావున స్థానిక సబ్ కలెక్టర్ గారు సంబంధించిన అధికారులు, ప్రజా సంఘాల నాయకులు మరియు ఎమ్మెల్యే అభ్యర్థులు వీటి గురించి ప్రశ్నించి పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేయాలని, ఉన్నతాధికారులు వీటి పైన చర్యలు తీసుకోని పక్షాన హాస్పిటల్ దగ్గరే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని పునీత్ తెలిపారు, ఈ కార్యక్రమంలో బి వై ఎస్ నాయకులు సుధాకర్, నవీన్, ఆది, షరీఫ్,గొల్లపల్లి శశి, దేవేష్, శాండీ,బాలు,సాదిక్, హరి, సోము, మురళి,వేణు తదితరులు పాల్గొన్నారు

09/01/2024

ఈరోజు అనగా 9/1/ 2024న బహుజన్ యువసేన bys ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల్లో పట్టించుకోకుండా విరుద్ధంగా స్కూల్స్ మరియు కాలేజీలను నడుపుతున్న విద్యాసంస్థలను సందర్శించడం జరిగింది, ఈ సందర్భంగా బహుజన యువసేన bys అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ ఈనెల తొమ్మిదవ తేదీ నుండి 18 వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించిందని, కానీ కొన్ని ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యాసంస్థలు మరీ ముఖ్యంగా పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నవ చైతన్య భారతి మరియు కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా సెలవులు ప్రకటించకుండా పాఠశాలలను నడుపుతున్నారు, అని పునీత్ అన్నారు, సెలవులు ప్రకటించేది విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం, విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి లోనవకూడదని కానీ ఇలాంటి విద్యాసంస్థలు సెలవులు రోజుల్లో కూడా పాఠశాలలు నడుపుతూ విద్యార్థులని మానసికంగా ఇబ్బంది పెడుతూ అలాగే టీచర్లను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని పునీత్ కోరారు, ఇలాంటి విద్యాసంస్థలను సందర్శించినప్పుడు ఎందుకు మీరు చట్ట విరుద్ధంగా చేస్తున్నారని విద్యాసంస్థల యాజమానాలను పులి ప్రశ్నించగా వారు విద్య ఉన్నత అధికారైన పురుషోత్తం గారే వారిని విద్యాసంస్థల్ని నడుపుకోమన్నారని అందుకే మేము సర్వదినంలో కూడా విద్యాసంస్థలు నడుపుతున్నామని విద్యాసంస్థల యాజమాన్యాలు చెప్పారని ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న ఉన్నత అధికారే ఇలా ప్రవేట్ మరియు యాజమాన్యాలకు సపోర్ట్ చేయడం ఏమిటని పునీత్ మండిపడ్డారు, ఇప్పటికైనా ఇలాంటి విద్యాసంస్థలకు ఉన్నత అధికారులు స్కిట్టుగా సర్కులర్ పంపించి, వినని పక్షాన ఆ స్కూల్ రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని పునీత్ కోరారు, ఈ కార్యక్రమంలో బి వై ఎస్ నాయకులు చిరు,నవీన్, మోహన, కురవంక కుమార్,నిరంజన్, బాలు, పూర్ణ, జగ, దేవీష్,శాండీ తదితరులు పాల్గొన్నారు

నిన్నటి రోజున అనగా 6/01/2024న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని తిరుపతి లోని వారి ఇంట్లో త...
07/01/2024

నిన్నటి రోజున అనగా 6/01/2024న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని తిరుపతి లోని వారి ఇంట్లో తంబళ్లపల్లి మల్లయ్యకొండ మాజీ చైర్మన్ మద్ది రెడ్డి గారు మరియు కురవంక సర్పంచ్ చలపతి గారితో కలిసి మర్యాద పూర్వకంగా కలిసి మదనపల్లి లోని ఆలయ సమస్య గురించి చర్చించిన బహుజన యువ సేన BYS అధ్యక్షులు పుణీత్ కుమార్, చాలా సానుకూలంగా స్పందించి, చాలా ఆప్యాయంగా మాట్లాడిన మంత్రి గారు.

Address

Gollapalli
Madanapalle
517325

Telephone

+917799578575

Website

Alerts

Be the first to know and let us send you an email when BYS Madanapalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BYS Madanapalli:

Share