SFI madanapalli

SFI madanapalli Students Union

https://youtu.be/Z14paKpMSDAవిద్యార్థులను చితకబాదిన గుర్రంకొండ ABC స్కూల్ గుర్తింపును రద్దు చెయ్యాలని మదనపల్లి సబ్ కలెక్...
26/09/2022

https://youtu.be/Z14paKpMSDA

విద్యార్థులను చితకబాదిన గుర్రంకొండ ABC స్కూల్ గుర్తింపును రద్దు చెయ్యాలని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట SFI ఆధ్వర్యంలో ధర్నా

*యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రవేట్ డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకోవాలి*మదనపల్లి స్థానిక ఎస్ఎఫ్ఐ కార్...
23/09/2022

*యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రవేట్ డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకోవాలి*

మదనపల్లి స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయం నందు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ మాట్లాడుతూ యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా మదనపల్లి పట్టణంలో పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో యూనివర్సిటీ నిర్మించిన ఫీజుల కంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్. ఐ గా డిమాండ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు డిగ్రీ పరీక్షలు రెండు , నాలుగు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అనుదిగా చేసుకొని యూనివర్సిటీ నిర్ణయించిన పీజులు కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తూ పేద విద్యార్థులను ,వారి తల్లిదండ్రుల రక్త మాంసాలను పీల్చిపి చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అనేక సందర్భాల్లో కళాశాలపై చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఇలాంటి అధిక ఫీజులు వసూళ్లకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే యూనివర్సిటీ అధికారులు మదనపల్లి పట్టణంలో డిగ్రీ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి వాటిపై విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. పరీక్ష ఫీజులు, విద్యార్థులు అటెండెన్స్ పేరు తో ఎన్ని రూపాల్లో దోచుకోవడానికి అవకాశం ఉందో అన్ని రూపాల్లో విద్యార్థుల దగ్గరుండి వసూలు చేస్తున్నటువంటి కళాశాలపై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి గణేష్ , నాగేంద్ర , జయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అభినందనలతో.

కార్తీక్
ఎస్ఎఫ్ఐ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు

ఏ బి సి స్కూల్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మనోజ్ డిమాండ్గుర్రంకొండ మండల కేం...
23/09/2022

ఏ బి సి స్కూల్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మనోజ్ డిమాండ్

గుర్రంకొండ మండల కేంద్రంలో ఉన్న ఏబీసీ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఫీజులు కట్టలేదని ఇష్టానుసారంగా కొట్టి గాయపరచడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు అదేవిధంగా తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా జోకింగ్ కలుగజేసుకొని ఆ స్కూలు యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని వారి డిమాండ్ చేశారు గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వారి డిమాండ్ చేశారు కాబట్టి గతంలో ఎక్కడ లేని విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేప్పటి నుంచి విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని విద్యార్థుల పైన అటు తల్లిదండ్రుల పైన ఒత్తిడి చేసి ఫీజులు కట్టాలని వేధింపులకు చేయడం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఏబీసీ స్కూల్ యాజమాన్యం శేషాద్రి నాయుడు పై క్రిమినల్ కేసు నమోదు చేసి హ్యూమన్ రైట్స్ దీంట్లో జోక్యం చేసుకొని అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సుభాన్, హరిబాబు, హరికృష్ణ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

అభినందనలు
మనోజ్
ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అన్నమయ్య

26/04/2022
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అశోక్ కుమార్ ని అక్రమంగా అరెస్ట్ చేసిన కలకడ పోలీసులు.. రాష్ట్ర వ్యాప్తంగా వున్న రెండు లక్షల అర...
11/03/2022

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అశోక్ కుమార్ ని అక్రమంగా అరెస్ట్ చేసిన కలకడ పోలీసులు.. రాష్ట్ర వ్యాప్తంగా వున్న రెండు లక్షల అరవైవేల ప్రభుత్వ ఉద్యాగాలు భర్తీ చేయాలనీ వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో 12 వా తేదీన విజయవాడలో జరిగే ధర్నాకి వెళ్తున్న జిల్లాలో వివిధ విద్యార్ధి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషనులకి తరలిస్తున్న పోలీసులు.

23/02/2022

ద్రావిడ యూనివర్సిటీలో మహిళా వసతి గృహంలో భోజనం తిన్న ముప్పైమందికి పైగా విద్యార్థినీలు అనారోగ్యానికి గురవ్వడానికి కారణం అయిన సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద ధర్నా చేస్తున్న SFI-AISF-TNSF నాయకులు.అనంతరం వైస్ ఛాన్స్లర్ స్పందించి వారంలోపు విచారణ జరుపుతాం అని హామీ ఇవ్వడం జరిగింది

Address

టమాటో మార్కెట్ ఎదురుగా
Madanapalle
517297

Telephone

+919866500365

Website

Alerts

Be the first to know and let us send you an email when SFI madanapalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SFI madanapalli:

Share