05/06/2026
చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్థులను అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు
కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మచిలీపట్నం ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీ జి. శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో, సీసీఎస్ మచిలీపట్నం సీఐ శ్రీ కె.వి.ఎస్. వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగదీష్ గారు మరియు సీసీఎస్ మచిలీపట్నం ఎస్ఐ నాగరాజు గారు మరియు సీసీఎస్ సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి నేరాలను నియంత్రణలో భాగంగా ఎస్పీ గారి ఉత్తర్వులు ప్రకారం జాయింట్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా, ఈరోజు ది.05.06.2026 వ తేదీన మధ్యాహ్నం సుమారు 01:00 గంట ప్రాతంలో మచిలీపట్నం పాండురంగ హై స్కూల్ ఏరియా నందు జాయింట్ వెహికల్ చెకింగ్ లో భాగంగా ఇద్దరు అనుమానితుల్ని అదుపులో తీసుకుని విచారించగా వారు గత నెల ది.11.05.2026వ తేదీన రాత్రి సుమారు 08.00 గంటల ప్రాంతంలో మచిలీపట్నంలోని కలెక్టర్ బంగ్లా వెనుక గల ఎస్.జి.ఓ. కాలనీ సమీపంలో ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళా మెడలో నుంచి రెండు బంగారు చైన్లు బలవంతముగా లాక్కొని బైక్ పై పారిపోయినట్లు, అదే విధంగా గతంలో కూడా మచిలీపట్నం L.E.F చర్చి మరియు చిలకలపూడి లోని కొబ్బరితోట సమీపం లో చైన్ స్నాచింగ్ చేసినట్లు నేరమును అంగీకరించినారు.
నిందితులు వివరాలు
1.మహ్మద్ ఖాజా మొయినుద్దీన్, వయస్సు 43 సం"లు, మసీదు సెంటర్, ఎన్.జి.ఓ. కాలనీ, కైకలూరు.
2 . మహ్మద్ హిమామ్ షరీఫ్, వయస్సు 49 సం"లు, మసీదు సెంటర్, ఎన్.జి.ఓ. కాలనీ, కైకలూరు.
ప్రాధమిక విచారణలో భాగముగా నిందితులు మచిలీపట్నం మరియు చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వీటిలో:
1 . మచిలీపట్నం పీఎస్ క్రైమ్ నం.113/2026, సెక్షన్లు 134, 304(2) BNS
2 . మచిలీపట్నం పీఎస్ క్రైమ్ నం.116/2025, సెక్షన్లు 134, 304(2) BNS
3 . చిలకలపూడి పీఎస్ క్రైమ్ నం.150/2025, సెక్షన్లు 304, 307 r/w 3(5) BNS
రికవరీ ప్రాపర్టీ వివరాలు:
సుమారు Rs.8,50,000/- విలువ గల 60 గ్రాములు బంగారపు వస్తువులు మరియు నేరానికి ఉపయోగించిన pulsar మోటార్ సైకిల్ దర్యాప్తులో భాగంగా మచిలీపట్నం వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులోని ప్రతిభ కనపరిచిన సీసీఎస్ మచిలీపట్నం సీఐ శ్రీ కె.వి.ఎస్. వరప్రసాద్, మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగదీష్ గారు మరియు సీసీఎస్ మచిలీపట్నం ఎస్ఐ నాగరాజు గారు మరియు సీసీఎస్ సిబ్బంది అయిన సీసీఎస్ PC's హర్ష, రామకృష్ణ, రవి మరియు రామ్ ప్రసాద్ లను కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు అభినందించినారు.
Andhra Pradesh Police