06/11/2023
*ప్రజల హక్కులు కాలరాస్తున్న జగన్ పాలన*
*అధికారంతో మూసుకుపోయిన జగన్మోహన్ రెడ్డి కళ్ళను తెరిపిద్దాం.*
*జగన్మోహన్ రెడ్డి కేవలం ఓటమి భయంతోనే చంద్రబాబు గారిపై కొల్లు రవీంద్ర గారి పై అక్రమ మద్యం కేసులు* -
రుద్రవరం, కృష్ణారావు పేట, ఆర్ గొల్లపాలెం కు చెందిన *"బాబు ష్యూరిటి - భవిష్యత్ కు గ్యారెంటీ"* *ప్రజా వేదిక* కార్యక్రమం రుద్రవరం గ్రామంలో నిర్వహించారు. మహానాడు వేదికగా ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోను ప్రజలకు తెలియచేసి ఈ నియంత పాలనలో అవినీతి, అరాచకాలను, మహిళలకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశ పెట్టిన మహా శక్తి పథకాలను ప్రతి ఇంటికి వెళ్ళి వివరించడం జరిగింది....
ఈ సందర్బంగా స్థానిక ప్రజలు మంచినీటి సమస్య - ఇంటింటికి కొళాయి కావాలి అని కోరారు.
డ్రైనేజీ తెలుగుదేశం హయాంలో నిర్మిస్తే ఇప్పుడు 4 సంవత్సరాలనుండి కనీసం అందులో మట్టి తీయించకపోవడంతో డ్రైనేజీలు పుడిపోయి తీవ్ర డ్రైనేజీ సమస్య ఏర్పడిందని నీలిమ గారి దృష్టికి తెచ్చారు.
మినీ వాటర్ ట్యాంక్ నిర్మించాలి, కమ్యూనిటీ హాల్ సిదిలావస్థకు చేరుకుంది. దానిని పునర్ నిర్మించాలి కోరారు
తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్లు వేస్తే ఇప్పటివరకు ఒక్క రోడ్ వేయలేదు.. చిన్న చిన్న గోతులు కూడా పుడ్చలేదు దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమస్యలు తెలిపారు.
సమస్యలపై నీలిమ గారు స్పందిస్తూ టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
*ఈ సందర్బంగా కొల్లు నీలిమ గారు మాట్లాడుతూ*..
*అధికారంతో మూసుకుపోయిన జగన్మోహన్ రెడ్డి కళ్ళను తెరిపిద్దాం అని పిలుపు నిచ్చారు.*
జగన్ రెడ్డి నాలుగు సంవత్సరాల పాలనలో రాష్ట్రం ఏ రకంగా నాశనం అయిందో, కరెంట్ బిల్లులు,నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయో,కనీసం రోడ్లపై పడిన గుంతలను కూడా పూడ్చలేని దుస్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు.
ప్రజలపై చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. జగన్ రెడ్డి పేదవాడికి పది రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు గుంజుతున్నాడు అన్నారు.
అమ్మ ఒడి నాన్న బుడ్డికి సరిపోవటం లేదన్నారు. కనీసం పిల్లలు తినే పౌష్టిక ఆహారంలో కూడా అవినీతికి పాల్పడడం జగన్ రెడ్డి నైజం అన్నారు.
జగన్ రెడ్డికి దోచుకోవడం దాచుకోవడం తప్ప పాలన చేత కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో సైకో జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమేయాలన్నారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో మనమందరం చంద్రబాబు గారికి మద్దతు పలకాలన్నారు.
ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు, యువత ఉద్యోగ ఉపాధి లేకుండా చేశారు, యువత గంజాయికి బానిస అయ్యారు. మహిళలకు రక్షణ లేకుండ పోయింది పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి కేవలం ఓటమి భయంతోనే చంద్రబాబు గారిపై కొల్లు రవీంద్ర గారి పై అక్రమ మద్యం కేసులు పెట్టాడు.
చంద్రబాబునాయుడు గారు మరియు కొల్లు రవీంద్ర గార్ల పై అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధిస్తున్నాడు.
జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయారు.
జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నాడు.
తన సొంత బ్రాండ్లతో నకిలీ మద్యాన్ని పేద, బడుగు, బలహీన వర్గాల చేత తాగించి వారి ప్రాణాలను హరించి వేస్తున్నాడని, ఎన్నో వేల కుటుంబాలు ఈ నకిలీ మద్యం వలన రోడ్ న పడుతున్నాయని, మద్యం పాలసీ ద్వారా లక్షల కోట్లు దోచి వేసిన ఈ జగన్మోహన్ రెడ్డి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి మరియు కొల్లు రవీంద్ర గార్ల పై అక్రమ కేసులు పెట్టడం దారుణమని పేర్కొన్నారు.
జగన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఎంతగా అణచి వేయాలని చూసినా, పసుపు సైన్యం అంతకు రెండింతలు కసిగా పనిచేస్తుందన్నారు.
ప్రజలందరూ ఈ జగన్ చేసే అరాచకాలను చూస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వాళ్లే వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
*ఈ కార్యక్రమంలో గొర్రెపాటి గోపీచంద్, కుంచె నాని, కాగిత వెంకటేశ్వర రావు, లంకే నారాయణ ప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, కాగిత గోపాల్ రావు, నీలం రామకృష్ణ, నీలం రమేష్, దేవరపల్లి అనిత, గుమ్మడి విద్యా సాగర్, కరెడ్ల సుశీల, వసంత కుమారి, బుడ్డబ్బయ్, జయలక్ష్మి, రాజులపాటి సత్యనారాయణ, బండారు నాని, లింగం విజయ్, గోరిపర్తి సుబ్రహ్మణ్యం, కృష్ణ రావు పేట నాగేశ్వర రావు, భగవాన్, అప్పారావు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.*
*సమావేశం అనంతరం అక్రమకేసులను నిరసిస్తూ డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.*