22/05/2026
లేపాక్షిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు లేపాక్షి లోని వెలుగు కార్యాలయంలో బాలకృష్ణ గారి వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య మరియు మండల అధ్యక్షులు అభిలాష్ సమక్షంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన సేవల గురించి దిశా నిర్దేశం చేశారు. తరువాత ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించి వారి సమస్యను బట్టి , సమస్యకు పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారి వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య గారు మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వం పై అధికారులపై నమ్మకం, విశ్వాసం ఉండాలి, ప్రజా సమస్య పరిష్కారం వేదిక నమమాత్రం గా వ్యవహారిస్తారు అనే అపోహలు పోగొట్టాలి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సౌజన్య లక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాస్, మరియు అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్ అధికారులు, ఎన్ ఆర్ ఈ జీ ఎస్ సిబ్బంది, విద్యా శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, రోడ్లు భవనాల శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు కోడిపల్లి ఎంపీటీసీ గంగాధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు జయకృష్ణ రెడ్డి, మారుతీ ప్రసాద్, ప్రకాష్,సి టి ఆంజనేయులు,కిష్టప్ప, శంకరా, మాజీ సర్పంచ్ సిద్దార్థ్, వీరశేఖర్, నాగరాజు, అంగిడి అంజి, రాజశేఖరరెడ్డి,లక్ష్మీనారాయణ రెడ్డి, నరసింహాప్ప, వెంకటలక్ష్మి, అశ్వర్తప్ప,సిద్దలింగప్ప,వెంకటప్ప, రేవంత్, మూర్తి, గంగిరెడ్డి,ఐటీడీపి బాబా, మూర్తి, నరసింహారెడ్డి, డిష్ మంజు, నాయకులు మండల ప్రజలు పాల్గొన్నారు.
Venkatapuram Abi
Nandamuri Balakrishna