04/09/2026
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి*
*ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలి*
*చిన్న విగ్రహాలను ఏర్పాటు చేయాలి*
*జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*
రానున్న వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాగు నీటికి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి కోరారు.
కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ చతుర్థి ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఎల్ నినో ప్రభావం ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా, ప్రధానంగా తాగునీటి అవసరాల కోసమే వినియోగించాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. రాబోయే కాలంలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి వనరులను సంరక్షించుకోవడం అత్యవసరమన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల కోసం తాగునీటి అవసరాలకు కేటాయించిన నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న హెచ్ ఎన్ ఎన్ ఎస్ కాలువ, తడకనపల్లి, ఉలిందకొండ హెచ్ ఎన్ ఎన్ ఎస్ కాలువ, గార్గేయపురం చెరువులో గణేష్ నిమజ్జనం ప్రత్యామ్నాయ మార్గాలని కలెక్టర్ కమిటీ సభ్యులకు సూచించారు. ఈసారి పెద్ద పరిమాణంలోని వినాయక విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనానికి సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, సాధ్యమైనంత వరకు చిన్న పరిమాణంలోని విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రకృతి విపత్తులు, నీటి కొరత వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించాలని అన్నారు. చిన్న విగ్రహాల ఏర్పాటు ద్వారా నిమజ్జన ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు నీటి వినియోగాన్ని కూడా తగ్గించవచ్చని తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నిమజ్జన ప్రదేశాల వద్ద ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, అవసరమైన బారికేడ్లు, లైటింగ్, పారిశుద్ధ్య సదుపాయాలు, అత్యవసర సేవలు, పోలీసు బందోబస్తు వంటి ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో చ