30/04/2020
నాడు - మంచి మనోహర్.
నేడు - తప్పుచేసిన మనోహర్.
కారణము ఇదిగో. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మన పార్టీ నుండి వెళ్లిన వ్యక్తే. మన పార్టీలో అర్బన్ పార్టీ అధ్యక్షుడి హోదాతో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ గుడిలో ఉత్సవ కమిటీ సభ్యునిగా ఉన్న వ్యక్తే. మీ వ్యతిగతంగా ఏదో పదవులో, కాంట్రాక్టులో ఇవ్వకపోతే మీరు పార్టీ మారారు అనటం జగమేరిగిన సత్యం.
నాడు
కుప్పం కాంగ్రెస్ పార్టీ వారు మనోహర్ గారిని విమర్శిస్తే మీ స్పందన మొదటి ఫొటోలో ఉంది.
నేడు
మనోహర్ అవినీతి పరుడు అని మీరు పిర్వాదు చేశారు. అది రెండవ ఫోటోలో ఉంది.
నాడు మనోహర్ మంచోడు అని మీరు చేపింది నిజమైతే నేడు మీరు మాట్లాడింది తప్పే కదా ???
కుప్పం తిరుపతి గంగమ్మ గుడి ఈనాటిది కాదు. కొన్ని
వందల సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి. అటువంటి గుడి అభివృద్ధి కోసం ఆస్తులు కూడ గట్టడం, మూల ధనం ఏర్పాటు చేయడం, గుడి ఆవరణ చుట్టు పక్కల ఉన్న స్థలాలను చదును చేయుట, దగ్గర్లో ఉన్న స్థలాన్ని దాత
లతో ఒప్పించి గుడికి ఇప్పించడం వంటి పలు మంచి కార్యక్రమాలు మనోహర్ గారు చేసిన విషయం కుప్పంలో ఎవరిని అడిగినా చెబుతారు.
నాడు గుడికి మూల ధనం ఉంటే బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో మనోహర్ గారు గుడి కమిటీ ఆధ్వర్యంలో సుమారు కోటి రూపాయలు దాతలు ద్వారా సేకరించారు. ఆ కోటి రూపాయలను టౌన్ బాంక్ తో పాటు మరో రెండు బ్యాంక్ లలో ఫిక్సడ్ డిపాసిట్ చేసి, గుడి ఉత్సవాలు నిమిత్తం ఆ డిపాసిట్ మీద లోన్ తీసుకొని ఉత్సవాలకు వాడింది నిజం.
నేడు ఆరోపణలు చేస్తున్న మీరు కూడా నాటి ఆ కమిటీలో ఉన్నవారే, ఆయన అప్పుడు కుప్పం తెలుగుదేశం అర్బన్ అధ్యక్షుడు కూడా అటువంటి వారి సంతకం ఇంకొకిరికి ఎందుకు ఫోర్జరీ చేయాలి.?
సరే ఆయన పెట్టలేదు అనుకొందాం, ఇన్ని రోజులు ఎందుకు కేసు పెట్టలేదు?
తెలుగుదేశం ప్రభుత్వంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వలేదని, వై.యెస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో విద్యాసాగర్ చేరిన విషయం అందరికీ తెలిసిందే. వై.స్.ఆర్.సి.పి లో అక్కడి నాయకులతో సఖ్యత లేకపోవడంతో, సరైన గుర్తింపు, పదవి రాకపోయే సరికి, అసత్య ప్రచారాలు చేసి, తనని గుర్తించాలి అని తెగ తాపత్రయం పడుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే.
విద్యా సాగర్ అసత్య ప్రచారాలను తిరుపతి గంగమ్మ భక్తులు నమ్మక పోగా, ఇలాంటి ప్రచారాల వలన సాగర్ కి తగిన శాస్తి జరుగుతుంది అని అనుకొంటున్నారు.
మీరు ఓకప్పుడు ఉన్న తెలుగుదేశాన్ని, తెలుగుదేశం పార్టీ నాయకులని ఇలా అసత్య ప్రచారం చేసి బజారుకి లాగుతాం అని చూస్తున్నారు. రేవు వైకాపాకి ఇదే జరుగుతుందా అనేది వైకాపా వారికే వదిలేస్తున్నాం.
మీరు ఇకనైనా ప్రజల మధ్యన ఉండి ప్రజాసమస్యలు తీరుస్తుంటే మీకు మంచి పదవులు వస్తుంది, రావాలని కోరుకుంటాం.
కానీ ఇలా అసత్య ఆరోపణలు చేస్తే మీరు పదవులకోసమే పకులాడుతున్నారు అని అందరికి అర్థం అయిపోతుంది. ఆలోచించుకోండి. !!!