Mucherla

Mucherla Mucherla.com – Mucherla is a Village in Krishna district in Andhra Pradesh, India. It falls under Pedana Mandal

Mucherla is village located in Pedana (mandalam), Krishna (district) of Andhra Pradesh State

29/01/2023
బిఎస్ఎన్ఎల్ (BSNL) ఇంటర్నెట్ మన ముచ్చర్లలో..*****************************************మన ఊరిలో కొంతమంది ఉద్యోగులు(work fr...
26/03/2022

బిఎస్ఎన్ఎల్ (BSNL) ఇంటర్నెట్ మన ముచ్చర్లలో..
*****************************************
మన ఊరిలో కొంతమంది ఉద్యోగులు(work from home), విద్యార్థులు(online classes), ఇతర అవసరాల కోసం మన అందరి అభ్యర్థన మేరకు BSNL వాళ్ళు ఫైబర్(Fiber to Home) ద్వారా ఇంటి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి ముచ్చర్ల లో ఇప్పటికే 5 మందికి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది.

ఇన్స్టలేషన్ చార్జెస్, నెలవారీ బిల్లు ఉంటుంది.
BSNL కనెక్షన్స్ కావల్సిన వాళ్ళు సంప్రదించండి.
1) మోహన్ గారు(BSNL)
2) నరహారశెట్టి వేంకటేశ్వర రావు(బాబు) గారు

04/01/2022

మన ముచ్చర్ల గ్రామ దేవత శ్రీ గంగానమ్మ అమ్మ వారి ఆలయ 1వ వార్షికోత్సవం జనవరి 8 న, వేడి నైవేద్యాలు జనవరి 16 న
******************************************************
ముచ్చర్ల గ్రామ ప్రజలు, ఆడపడుచులు గ్రామ ప్రజలు, భక్తులు వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి.
🙏గమనిక : కార్యక్రమ పూర్తీ వివరాలకు క్రింది వీడియో చూడగలరు 🙏

Development Activities at Sri Vittal Ashramam from 2013 to 2019.
31/07/2020

Development Activities at Sri Vittal Ashramam from 2013 to 2019.

Development activities at Sri Panduranga Vittal Ashramam, Mucherla (2013 to 2019). Visit Temple Directions : https://goo.gl/maps/qXuTktTLzz82

జూన్ 10 2020, ఉదయం 8:30  గంటలకు గ్రామ దేవత శ్రీ గంగానమ్మ అమ్మ వారి ఆలయ స్లాబ్ పనులు ..ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చి సహ...
29/05/2020

జూన్ 10 2020, ఉదయం 8:30 గంటలకు గ్రామ దేవత శ్రీ గంగానమ్మ అమ్మ వారి ఆలయ స్లాబ్ పనులు ..
ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చి సహకరిస్తున్న గ్రామ ప్రజలకు, ఆడపడుచులకు, బంధువులకు, దాతలకు కృతజ్ఞతలు. 🙏🙏

గ్రామ దేవత శ్రీ గంగానమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం-----------------------------------------------------------------------మ...
20/01/2020

గ్రామ దేవత శ్రీ గంగానమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం
-----------------------------------------------------------------------
మన ఊరి క్షేమం కోసం మరియు అందరి కోరిక అయినటువంటి గ్రామ దేవత శ్రీ గంగానమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం చెయ్యటానికి అమ్మవారి అనుగ్రహం కలిగినది

నేపథ్యం:
-------------
గ్రామ దేవత శ్రీ గంగానమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఊరికి ఎత్తుకి దిగువలో ఉండటం ఊరికి మంచిది కాదు అని చాల మంది వాస్తు తెలిసిన వాళ్ళు చెప్పటం మరియు హెచ్చరించడం జరిగింది. ఆలయానికి వెళ్లే రోడ్ కూడా చాల ఇరుకుగా ఉండటం, వారం వారం అమ్మవారికి నైవేద్యం పెట్టె వారికీ చుట్టూ తిరగటానికి ఇబ్బందిగా ఉన్నది.
వందల మందికి అన్నం పెట్టిన మన ఊరు మెల్ల మెల్లగా కళ తప్పిపోవటం కూడా కారణం. మన గ్రామ దేవత ఐన అమ్మ వారు బాగుంటేనే మన గ్రామం, గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో బాగుంటారు అని మన ఊరి ప్రజల ప్రగాఢ నమ్మకం.

ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు:
---------------------------------------------
* ది.18-01-2020 (శుక్రవారం) - అమ్మవారు అనుగ్రహం కలిగి మా అభిప్రాయాన్ని ఎప్పటినుంచో ఆలయం పునర్నిర్మించాలి బలంగా కోరుకుంటున్న మోటెపల్లి కోటేశ్వరరావు (కోటయ్య) గారి దంపతులకి చెప్పటం, వారు చాల సంతోషించి దీవించి సంపూర్ణ మద్దతు ఉంటుంది అని తెలియచేసారు.
* ది. 19-01-2020 (శనివారం) - ముందుగా గ్రామ పెద్దలు, ఊరిలో ఉన్న ఇంటి ఇంటికి తిరిగి శ్రీ గంగానమ్మ అమ్మ వారి ఆలయ నిర్మాణం గురించి చెప్పటం సంతోషంగా అందరు ఊరి మంచి కోసం స్వచ్చందంగా ఒప్పుకోవటం జరిగింది.
* ది. 19-01-2020 (శనివారం) - పెనుమల్లి గ్రామ దేవత ఆలయం కట్టించిన అర్జా నగేష్ గారిని కలవటం, వారి సూచనలు సలహాలు తీసుకోవటం జరిగింది. వారి సూచన ప్రకారం కూరాడా సిద్ధాంతి గారిని ఫోన్ ద్వారా సంప్రదించటం జరిగింది
* ది. 20-01-2020 (ఆదివారం) - మన గ్రామ యువకులు కూరాడా గ్రామం వెళ్లి కూరాడా సిద్ధాంతి గారిని వెళ్లి కలవటం, రేపు ఆలయాన్ని చూడటానికి ఉదయం 10 గంటలకు వస్తాను అని చెప్పారు।
* ది. 20-01-2020 (ఆదివారం) - ఆలయాన్ని చూడటానికి సిద్ధాంతి గారు వస్తున్నారు అనే విషయాన్నీ పెద్దలకు స్వయంగా, గ్రామ ప్రజలకు డప్పు, మైక్ ద్వారా చెప్పటం జరిగింది
* ది. 21-01-2020 (సోమవారం) - సిద్ధాంతీ గారు వచ్చి ఆలయ పరిసరాలను చూసి ఆలయ పునర్మించటానికి సూచనలు ఇచ్చారు.

** ఇంకా అమ్మ వారి విగ్రహాన్ని పూజలు చేసి పక్కన పెట్టడం, శంకుస్థాపన కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి.**

"ఒక్కరు కడితే అది ఇల్లు..ఊరు మొత్తం కలిసి కడితే అది గుడి" మన ఊరి గ్రామ దేవత ఆలయ పునర్నిర్మాణం కోసం మన అందరి సహాయ సహకారాలు కావాలి.జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఇలాంటి మంచి కార్యక్రమంలో కుల వర్గ రాజకీయాలకు అతీతంగా ఉందాం.

నోట్ : గ్రామ ప్రజలు అందరిని సంప్రదించి అమ్మ వారి ఆలయ కమిటీ వేస్తున్నారు. కమిటీ లో ఉండాలి అనే ఆసక్తి ఉన్నవారు మీ పేర్లు ఇవ్వగలరు.

ముచ్చెర్ల హరితహారం - 2019(ఉచిత మొక్కల పంపిణి)* కడియపు లంక నర్సరీ వెళ్ళటం (మొక్కల కోసం) : 27-07-2019(శనివారం )* మొక్కల పం...
25/07/2019

ముచ్చెర్ల హరితహారం - 2019(ఉచిత మొక్కల పంపిణి)
* కడియపు లంక నర్సరీ వెళ్ళటం (మొక్కల కోసం) : 27-07-2019(శనివారం )
* మొక్కల పంపిణి : 28-07-2019(ఆదివారం)
* స్థలం : పెనుమల్లి , పెడన మండలం
--------------------------------------------------------
Mucherla Harithaharam - 2019(Free Plant Distribution)
* Visiting Kadiyapu Lanka Nursery : 27-07-2019(Saturday)
* Plants Distribution : 28-07-2019(Sunday)
* Place - Penumalli, Pedana Mandalam

Interested to donate plants/participate in this good cause.
Call : 8125449686, 8328257465

Mucherla Harithaharam - 2019(Free Plant Distribution)* Visiting Kadium Nursery : 27-07-2019(Saturday)* Plants Distributi...
01/07/2019

Mucherla Harithaharam - 2019(Free Plant Distribution)
* Visiting Kadium Nursery : 27-07-2019(Saturday)
* Plants Distribution : 28-07-2019(Sunday)

Interested to donate plants/participate in this good cause.
Call : 8125449686

Mucherla Harithaharam(Free Plant Distribution)Last 3 years : 2016, 2017, 2018
01/07/2019

Mucherla Harithaharam(Free Plant Distribution)

Last 3 years : 2016, 2017, 2018

మాతృదేవోభవ పితృదేవోభవ - పుండరీకుడు కథ ---------------------------------------------------------------పుండరీకుడు ఒకసారి త...
22/01/2019

మాతృదేవోభవ పితృదేవోభవ - పుండరీకుడు కథ
---------------------------------------------------------------
పుండరీకుడు ఒకసారి తాను వెళ్ళేదోవలో కుక్కుటముని ఆశ్రమం దగ్గర నల్లగా, అతి వికారంగావున్న ముగ్గురు స్త్రీలు వాకిలి శుభ్రంచేసి, నీళ్ళుజల్లి, ముగ్గులు పెట్టటం, వారలా చేయగానే అత్యంత సౌందర్యవంతులుగా మారి వెళ్ళిపోవటం చూసి ఆశ్చర్యచకితుడై వారిని ప్రశ్నించగా వారు తాము గంగ, యమున, సరస్వతులనే నదులమని, తమలో మునిగినవారి పాపాలవల్ల తమకి ఆ దుస్ధితి వస్తుందని, కుక్కుటమునిలాంటి మహనీయుల సేవలో ఆ పాపాలుపోయి యధా స్ధితికి వస్తామని పేర్కొన్నారు. కుక్కుటమునికి అంత మహిమ తన మాతాపితరుల సేవతో వచ్చిందనికూడా తెలిపారు. పుండరీకుడు అప్పటినుంచి తన మాతాపితరులకు అత్యంత భక్తి శ్రధ్ధలతో సేవచేయసాగాడు.

ఒకసారి తన భక్తుని పరీక్షించదలచిన పాండురంగడు పుండరీకుడు మాతాపితరుల సేవ చేస్తున్న సమయంలో వచ్చి బయటనుంచి పిలిచాడు. పుండరీకుడు తానప్పుడు బయటకు వస్తే తన మాతా పితరులకు నిద్రా భంగమవుతుందని, అందుకని కొంతసేపు వేచి వుండమని తన చేతికి అందుబాటులో వున్న ఒక ఇటుకని విసిరి దానిమీద వేచి వుండమంటాడు. భక్త వశుడైన పాండురంగడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుకమీదే నుంచుని వుంటాడు. పుండరీకుని భక్తికి, మాతా పితరుల సేవాతత్పరతకు మెచ్చి వరముకోరుకోమనగా, అక్కడ ఇటుకమీద నుంచున్నట్లుగానే భక్తులకు దర్శనమిచ్చి బ్రోవమని కోరాడు.

* విఠలుడు అనే పేరు విట్టు లోంచి వచ్చిందంటారు. విట్టు అంటే కన్నడంలో, మరాఠీలో ఇటుక.

* విఠల = విఠ్ (ఇటుక), ఠల ( అంటే మీద నిలుచుని ఉన్న) అనే రెండు పదాల కలయిక = ఇటుకపై నిల్చుని ఉన్నవాడు

* పాండరంగ అనే పేరుకి శ్వేత వర్ణ దేవుడు అని అర్థం

Address

Mucherla, Pedana Mandalam
Krishna District
521366

Alerts

Be the first to know and let us send you an email when Mucherla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share