28/02/2026
స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ రథం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ను పరిశుభ్రంగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గంలో ‘స్వచ్ఛ రథం’ వాహనాన్ని ప్రారంభించడం జరిగింది.
గ్రామాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ మరియు ఇతర వ్యర్థాలను సమూలంగా తొలగించి, ప్రజల్లో పారిశుద్ధ్యం – పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచాలనే సంకల్పంతో ఈ స్వచ్ఛ రథాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రజలు తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలను ప్రభుత్వం నిర్దేశించిన రేటుకు స్వచ్ఛ రథం వద్ద అందించి, అదే విలువకు నిత్యావసర వస్తువులు పొందవచ్చు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారడమే కాకుండా, ప్రజలకు ప్రత్యక్ష లాభం కూడా చేకూరుతుంది. మన గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా మారాలంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నాను.
ఈ కార్యక్రమంలో కొటారు వెంకట్రావు గారు, కాకర్ల సత్యేంద్ర గారు, కూచిపూడి గణపతి గారు, కూచిపూడి లక్ష్మణరావు గారు, ఇండుగుల రామకృష్ణ గారు, కూచిపూడి హనుమంతురావు గారు, చెవ్వూరి రాము గారు, అన్నమరెడ్డి రమణ గారు, దండమూడి శేషు గారు, నామా నరేంద్ర గారు, కోర్లపాటి దత్తుడు గారు, కైగాల శ్రీను గారు, అన్నమారెడ్డి సత్తిబాబు గారు, అన్నమారెడ్డి సోమశేఖర్ గారు, తిగిరిపల్లి కనకరత్న గారు, మద్దూకూరి శంకరం గారు, ఉప్పులూరి రమేష్ గారు, దుగ్గిరాల జగదీశ్ గారు, కొప్పాక జోవహర్ గారు, ఎలుగుబంటి బాలకృష్ణ గారు, నీరుకొండ రమేష్ గారు, పాల చంద్రరావు గారు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.