22/10/2024
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారి అధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ - నెహ్రూ సెంటర్ - మోడల్ మార్కెట్ - కోర్ట్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసుల సేవలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అవసరం వస్తాయని... వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అది బయటకు కనబడకుండా 24×7 ప్రజా రక్షణలో ముందుండి విధులు నిర్వహిస్తున్న పోలీసుల త్యాగాలు ఎప్పటికీ మరచి పోకూడదని తెలియజేసారు.
ఈ సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్, క్రీడా పోటీలు, వ్యాసరచన పోటీలు, హెల్త్ క్యాంపు, రక్త దాన శిబిరం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు ఎస్పీ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతి రావు, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు, పోలీస్ సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు.
Telangana State Police