31/10/2018
కొంతమంది రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నారో.....
దేశం గర్వించే విధంగా గుజరాత్లో ఏర్పాటు చేయబడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గురించి మేధావులు గా చెప్పుకునే వారు తెగ మాట్లాడుతున్నారు ఆ డబ్బులను పేద ప్రజలకి, దేశంలో ఆకలితో అలమటిస్తున్న వారికి ఖర్చుపెడితే బాగుంటుంది బిజెపి కేవలం తమ పార్టీ బలోపేతం కోసమే ఇటువంటి అనవసర ఖర్చు చేస్తుంది అని సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నారు.
స్వతంత్రం వచ్చిన తరువాత చిన్నచిన్న స్వదేశీ సంస్థానాలు గా ఉన్న భారత్ ను ఒక్కటిగా చేసిన మహనీయుడు కు ఇది ఒక చిన్న నివాళి.
బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చిన ఇంకా కాంగ్రెస్ కుటుంబ పాలన లో బానిసలుగా బతుకుతున్నారు.
కుటుంబ సమాధుల కోసం వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కేటాయిస్తే మాత్రం తప్పు లేదు. ఈరోజు మూడు వేల కోట్లతో విగ్రహం నిర్మిస్తే మాత్రం అది మీకు పెద్ద తప్పు గా కనబడింది. ఇది పూర్తిగా గుజరాత్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు దీనికి శంకుస్థాపన చేసింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ.
ఈ విగ్రహం ద్వారా దేశ ప్రతిష్ట పెరగడంతోపాటు పర్యాటక రంగం అభివృద్ధి పథంలోకి నడుస్తుంది గుజరాత్ రాష్ట్రానికి భారతదేశానికి వివిధ రూపాలలో ఆదాయం పెరుగుతుంది.
అది భారత అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కానీ సమాధుల పేరుతో వందల ఎకరాలు కేటాయించడంవల్ల ఏమైనా ప్రయోజనం ఉందా వాటిమీద ఖర్చు తప్ప ఆదాయం శూన్యం అయినా గుడ్డిగా నరేంద్ర మోడీని విమర్శించాలని ఏకైక సంకల్పంతో ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని విమర్శిస్తున్నారు.
ఎవరు ఎన్ని విధాల విమర్శించిన నరేంద్ర మోడీ మాత్రమే ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడపగలరు.
మాకు కుటుంబ బానిసత్వమే నచ్చింది అనుకుంటే మీ ఇష్టం కానీ స్వాతంత్ర సమరయోధులను విమర్శించినట్లు గా మాట్లాడితే సహించేది లేదు...
జై భారత్ వందేమాతరం ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ భారత్ మాతా కి జై.