22/06/2025
*సైబర్ నేరస్తుడును అరెస్టు చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు. తేదీ:21.06.2025*
ఆన్లైన్ లో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, సుమారు 1.62 కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఒకరిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు నాగర్ కర్నూల్ లో అరెస్టు చేసినట్లు ఖమ్మం సి.పి. సునిల్ దత్ గారు తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఫోన్ చేసి ఆన్లైన్ లో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి వాట్సప్ మరియు ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు 1.62 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన కేసులో కొంత డబ్బు అకౌంటికి వెళ్ళిన నేరస్థుడు అయిన నేనవత్ అఖిల్, 23 సం. ని గుర్తించి నాగర్ కర్నూల్ జిల్లాలో అరెస్టు చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హజరు పరిచి, రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. ఇదే కేసులో గతంలోను నలుగురు నేరస్థులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించిన సైబర్ క్రైం డి.ఎస్పీ CH.R.V. ఫణిందర్ గారిని, ఎస్సై లు రంజిత్ కుమార్, విజయ్ కుమార్ మరియు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఖమ్మం సి.పి గారు అభినందించారు.