23/02/2023
ప్రచురణార్థం:
23/02/2023;
ప్రైవేట్ విద్యా సంస్థల అధిక పీజుల ఒత్తిడినీ హరికట్టాలి- బిడిఎస్ఎఫ్
పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో విద్యార్థుల మానసిక ఒత్తిడి - గోపె వినయ్ కుమార్
ఖానాపురం//
ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు పరీక్షల దగ్గర పడుతున్న వేళ ఫీజులు పూర్తిగా చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామంటూ విద్యార్థులను మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని బి డి ఎస్ ఎఫ్ జిల్లా కమిటీ ఖానాపురం హవేలీలో అనంతోజు పద్మిని అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో బి డి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి గోప వినయ్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న వేళ ప్రైవేట్ కళాశాలలు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు పరీక్షల సమయంలో మానసిక ఒత్తిళ్ళకి గురవుతున్నారని ఇది ప్రైవేట్ యాజమాన్యాలకు సరైన పద్ధతి మార్చుకోవాలని బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమైక్య హెచ్చరిస్తున్నట్లు తెలుపుతూ ప్రైవేటు యాజమాన్యాలు అధిక పీసుల దోపిడీ చేస్తా ఉంటే విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తూ ఉంటున్నారు తక్షణమే ప్రైవేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల తరపున ఉద్యమిస్తామని అలాగే పరిమిషన్లు లేకుండా నడిపిస్తున్నటువంటి విద్యాసంస్థలను సీజు చేసి కేసులు పెట్టాలని విద్యార్థులకు అధిక ఫీజుల వేధింపులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమైక్య బీడీఎస్ఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు రాజుల వంశీ చక్రవర్తి నాగలక్ష్మి ప్రసన్నకుమార్ అనంతజ్ పద్మిని తదితరులు పాల్గొన్నారు.